Wednesday, October 19, 2011


నేడే లాస్ట్‌
Secretariatహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణలో సకల జనుల సమ్మె 36వ రోజుకు చేరడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై అనిశ్చితి నెలకొంటోంది. ప్రభుత్వ చర్చలతో ఒక్కోశాఖ సమ్మె విరమణ ప్రకటిస్తుండటంతో ఉద్యోగులు, ప్రభుత్వానికి ఒకింత ఊరట కలుగుతు న్నప్పటికీ వారి జీతభత్యాలపై కొంత అయోమయం రాజ్య మేలనుంది. ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో ప్రధానం గా ఉద్యోగులు సమ్మెకాలానికి వేతనాలు డిమాండ్‌ చేస్తుం డటంతో ప్రభుత్వానికి కొత్త సమస్య తలెత్తనుంది. ఇప్పటికే కీలక ప్రభుత్వాదాయ వనరుల శాఖలు సమ్మెలోనే ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై ఒకవైపు భారం పెరుగుతోంది.

కీలకమైన రెవెన్యూ, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, ఎకై్సజ్‌, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల బిల్లులు చేసే ట్రెజరీ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఈ నెల జీతాలపై భారం పడనుంది. అయితే ప్రభుత్వ సమ్మె మొదలైనప్పుడే నోవర్క్‌-నో పే విధానాన్ని అమలుచేస్తు న్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 177ను తెరపైకి తెచ్చింది. ఈ విధానం మేరకు ఇక ఉద్యోగులు విధుల్లో పాల్గొని పనిచేస్తేనే వేతనాలు ఇవ్వాలని, సమ్మెలో ఉన్నవారికి ఎట్టిపరిస్థితుల్లోనూ జీతాలు ఇచ్చేది లేదని ఖరాకండిగా స్పష్టం చేసింది.
అయితే ఈ నెల వేతనాల బిల్లులు నేడు ప్రభుత్వానికి చేరనున్న నేపథ్యంలో నేడు విధుల్లో చేరని ఉద్యోగులకు ఈనెల కూడా వేతనం అందే పరిస్థతి కన్పించడంలేదు.

అయితే ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల హజరీ డిడిని, వారు విదులకు హాజరయినట్లుగా వారి నుంచి డిక్లరేషన్‌ను పొంద నున్నట్లు తెలిసింది. ఇదేగనక అమలు అయితే ఉద్యోగులు పనిచేయకుండా డిక్లరేషన్‌ ఇచ్చే పరిస్థితి ఉండదు. అలా ఇవ్వని పక్షంలో ఇక వేతనం పొందడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ ఉద్యోగులు అఫిడవిట్‌ ఇస్తే వారికి ముప్పుగా పరిణమించే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు 30శాతం మేర విధుల్లో హాజరుకావడంలేదు. వివిద ప్రభుత్వ శాఖల్లో ఇంకా సమ్మె కొనసాగు తుండటంతో ఈమేరకు వారికి నష్టం వాటిల్లనుంది. నేడు విధుల్లో చేరి బిల్లులు చేస్తేనే టెక్నికల్‌గా వారికి ప్రభుత్వ వేతనం అందే పరిస్థితి నెలకొంది.

డీఏపై తర్జనభర్జనలు.... 
ఇప్పటికే ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ ప్ర కటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ ప్ర కటనపై ఎదురుచూస్తున్నారు. అయితే ఈ డీఏ ప్రకటన దీ పావళికి వస్తుందని భావించిన వారికి నిరావే ఎదురు కానుంది. ఆర్దిక శాఖ పరిశీలనలో ఫైలు ఉన్నప్పటికీ ప్రభు త్వ డీఏ ప్రకటనపై సుమఖంగా లేదనే వాదన వినిపిస్తోంది.




హోరెత్తిన తెలంగాణ

( న్యూస్ నెట్‌వర్క్) తెలంగాణ వ్యాప్తంగా 36వ రోజు కూడా సకల జనుల సమ్మె ప్రభావం కనపడింది. మంగళవారం జరిగిన ధర్నాలు, ధూం« దాం వంటి నిరసన కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల జోరు కనిపించింది. మంత్రులు దానం నాగేందర్, జానారెడ్డిల దిష్టి బొమ్మల దహనాలు కొనసాగాయి. పలుచోట్ల కేసీఆర్, మందకృష్ణల దిష్టి బొమ్మలను కూడ దహనం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ధర్నా అనంతరం పార్టీ శ్రేణులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో మంత్రు లు జానా, దానంల ఫ్లెక్సిల ఎదుట చీరలు, గాజులు పెట్టి నిరసనలు తెలిపారు. దేవరకొండలో సీపీఐ నిర్వహించిన ధూం ధాం కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు అన్ని శాఖల ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. బోధన్‌లో పీడీఎస్‌యు ఆధ్వర్యంలో మందకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలంటూ బాన్సువాడలో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. టీటీజేఏసీ విరమణ ఆదేశాలను ఖాతరు చేయకుండా డీటీఎఫ్, టీయూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి సమ్మెలో పాల్గొన్నారు. జ్యుడిషియల్ ఉద్యోగులు కోర్టు ఎదుట తెలంగాణ వంటకాలు చేసి భోజనాలు చేశారు. అటవీశాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఉట్నూర్‌లో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి సోనియా, కిరణ్‌కుమార్, చిదంబరం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ల దిష్టిబొమ్మను దహనం చేశారు.

ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి అరెస్టును నిరసిస్తూ జేఏసీ ఆ«ధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో వైద్యులు ర్యాలీ నిర్వహించి, జాయింట్ కలెక్టర్‌ను అడ్డుకొని నిరసన తెలిపారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్దపల్లిలో జేఏసీ నేతలు మంత్రుల దిష్టిబొమ్మను దహనం చేయగా ఓదెలలో టీఆర్ఎస్ నాయకులు సీఎం, డీజీపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి ఇంటి ముందు మహిళలు బతుకమ్మ ఆడే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గీత కార్మికులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. తొర్రూరులో తెలంగాణ మహిళా మంత్రుల ప్లెక్సీలను దహనం చేశారు. హన్మకొండ, మహబూబాబాద్‌లలో న్యాయవాదులు రాస్తారోకో చేశారు. నెక్కొండలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడే వున్నాయి. తాండూరుకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస రెడ్డి సెల్‌టవర్ ఎక్కి హడావిడి చేశాడు. మండల కార్యాలయాల ఎదుట ఉద్యోగులు ఆటాపాటా, ధూంధాం,బతుకమ్మలు నిర్వహించారు. మెదక్ జిల్లా కోర్టు వద్ద సిబ్బంది, న్యాయవాదులు ధూంధాం నిర్వహించారకు. టీఎన్జీవోలు దీక్షలు జరిపారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ను టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఖమ్మంలో హిజ్రాలు బోనాలతో ప్రదర్శన నిర్వహించారు. ఇల్లెందు, మధిరలలో సీపీఐ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. భద్రాచలంలో జేఏసీ నేతలు పశువులకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. మణుగూరులో న్యూ డెమొక్రసీ కార్యకర్తలు మందకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు.మహబూబ్‌నగర్‌లో ఉద్యోగులు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జడ్పీ మైదాన వేదిక వద్ద పశువైద్యులు నిరాహార దీక్ష చేశారు. వనపర్తిలో న్యాయవాదులు మౌన ప్రదర్శన చేశారు.

No comments:

Post a Comment