పోలవరంపై రగడ
హైదరాబాద్, మేజర్‌న్యూస్: గోదావరి నదిపై బహుళ ప్రయోజన ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పురిట్లోనే పుట్టెడు కష్టాలు ప్రారంభ మయ్యాయి. నిన్నమొన్నటిదాక పొరుగు రాష్ట్రాలనుంచి ఎదురవుతున్న అభ్యం తరాలు, చిక్కు సమస్యలు ఇంకా వీడిపోక ముందే రాష్ట్రంలో పోలవరం టెండర్లు అగ్గిరాజేశాయి. టెండర్లకు సంబంధించిన ప్రక్రియనే ప్రశ్నార్ధకం చేస్తూ రాజకీ య పార్టీలు పోరుకు తెరలేపాయి. అర్హతలేని కంపెనీకి పనులు కట్టబెడుతు న్నారంటూ ముప్పేట విమర్శలతో తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీల మధ్యన సవాళ్ళు ప్రతిసవాళ్లతో విమర్శల యుద్ధ్దం ప్రారంభమయ్యింది.
టెండర్ల లో అక్రమాలు జరిగాయంటూ పోలవరం టెండర్లలో పాల్గొని ఎల్-2గా వచ్చిన సోమా-సీజీజీసి సంయుక్త భాగాస్వామ్య కంపెనీ శుక్రవారం హైకోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, నీటిపారుదల శాఖ ముఖ్య కార్య దర్శిని ప్రతివాదులుగా చేసి 50 పేజీలతో కూడిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు లో దాఖలు చేసింది. రాజకీయ ఒత్తిళ్లమేరకే అర్హతలేని కంపెనీకి పోలవరం టెం డర్లు కట్టబెడుతున్నారని టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పిటిష న్‌లో పేర్కొన్నట్టు సమాచారం. పోలవరం సమీపాన గోదావరి నదిపై 4,720 కోట్ల రూపాయల అంచనాలతో పిలిచిన గ్లోబల్ టెండర్లలో స్యూ కంపెనీ (సదరన్ ఇంజనీరింగ్ వర్క్స్ ) సంయుక్త భాగస్వామ్య సంస్థ 12.66 శాతం తక్కువకు కోట్ చేసి టెండర్లను దక్కించుకుంది.
రాక్‌ఫిల్ డ్యాం, స్పిల్‌వే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కలిపి సంయుక్తంగా పిలిచిన ఈ టెండర్లలో పాల్గొన్న స్యూ కంపెనీకి సాంకేతిక పరమైన అర్హత లేదన్నదే విపక్షాల నుంచి వస్తున్న ప్రధాన అరోపణ. ఆ కంపెనీలో వాటాదారుడుగా ఉన్న లక్ష్మిరాజం నమస్తే తెలంగాణ పత్రికలో ప్రధాన పెట్టుబడిదారుడుగా ఉన్నందున ఆయనే ఇందులో కీలక పాత్ర పోషించారన్న విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్‌కు మద్యవర్తిగా ఉంటూ పోలవరం కాంట్రాక్టును కేసిఆర్‌కు ప్రభుత్వం నుంచి దక్కేలా చక్రం తిప్పారన్న అరోపణలు వస్తున్నాయి. టెండర్ల అక్రమాలు నిరూపించే సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయని ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బలంగా వాదిస్తున్నారు. పోలవరం టెండర్ కోసమే ఉద్యమాన్ని కేసీఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టి వచ్చారని దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ధ్వజమెత్తుతున్నారు.అవినీతి పెట్టుబడులతో నమస్తే తెలంగాణా పత్రికను పెట్టారని నిలదీస్తున్నారు. మరోనేత నాగం జనార్ధన్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి పోలవరం టెండర్‌ను రద్దు చేయాలని కోరారు. పోలవరం టెండర్లపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నేత ప్రభాకర్ కూడ డిమాండ్ చేస్తున్నారు.
ఆ కంపెనీ చంద్రబాబు బంధువులది కాదా : ఈటెల
పోలవరం టెండర్లు దక్కించుకున్న షూ కంపెనీ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు బంధువులది కాదా అని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ ప్రశ్నిస్తున్నారు. స్యూ కంపెనీ అధినేత నాగేశ్వరరావు తనయులు రాజేశ్వరరావు , అనిల్‌కుమార్‌లకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయని దీనిపై తాము బహిరంగ చర్చకు కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. పోలవరం టెండర్‌లను రద్దుచేయాలని లేకుంటే ముఖ్యమంత్రికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టేనని భావించాల్సి వస్తుందన్నారు. ఈ మేరకు లేఖ కూడా రాయనున్నట్టు ఈటెల ప్రకటించారు.
వివాదాస్పదంగా డిజైన్ల మార్పు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల మార్పుపై కూడా వివాదాలు తెరపైకొస్తున్నాయి. ఎంపీ కేశవరావు దీనిపై ప్రధానంగా విమర్శలు సందిస్తున్నారు. తొలిదశలో 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్ధ్యపు డిజైన్‌ను 50 లక్షలకు ఎందుకు పెంచారని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1995 అక్టోబర్ 25న కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులకు కూడా మరో నాలుగు రోజుల్లో కాలం చెల్లిపోతుందంటున్నారు. ఇన్ని రకాల సమస్యల మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

జీతం కోత
సమ్మె కాలానికి వేతన చెల్లింపుల్లేవ్
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
జీవో 177 ప్రకారమేనని వెల్లడి
కోతతోనే ట్రెజరీ ఆఫీసులకు చేరిన బిల్లులు
కోతతోనే ట్రెజరీ ఆఫీసులకు చేరిన బిల్లులు
హైదరాబాద్, ఆక్టోబర్ 21 : సకల జనుల సమ్మెలో పాల్గొన్న, ఇంకా పాల్గొంటున్న ఉద్యోగులకు దుర్వార్త! దసరాకే కాదు... దీపావళికీ వీరికి జీతాలు అందవు! 'పని చేసిన వారికి, పని చేసిన రోజులకు మాత్రమే జీతం' అనే నిబంధనకు కట్టుబడాలని సర్కారు నిర్ణయించుకుంది. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో గతనెల 13న సకల జనుల సమ్మె మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టీసీతో మొదలుకుని టీచర్లు, ఒక్కో శాఖకు చెందిన ఉద్యోగులు సమ్మె విరమించారు. మంత్రులు తమ తమ శాఖలకు చెందిన ఉద్యోగ జేఏసీలతో చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో 'సమ్మె కాలానికి వేతనం చెల్లింపు' అనేది కూడా ప్రధాన మైన అంశం! చర్చలపై సంతృప్తి చెందిన అనేక శాఖల ఉద్యోగులు సమ్మె విరమించినప్పటికీ... వేతనాల చెల్లింపుపై సర్కారు మెలిక పెట్టింది. జీవో 177 మేరకు... సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు జీతం చెల్లించరాదంటూ శుక్రవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు (మెమో నంబర్ 3917) జారీ చేశారు. అలాగే, విధులకు హాజరైన కాలానికి సంబంధించిన వేతనాల బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ 31వ తేదీలోగా పంపాలని ట్రెజరీ విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు.
రాష్ట్రంలోని డ్రాయింగ్ ఆఫీసర్లందరికీ శుక్రవారమే ఈ ఆదేశాలందాయి. అక్టోబర్ నెల వేతనాల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో... వివిధ శాఖల్లో ఉద్యోగుల హాజరు శాతాలను అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఇక సమ్మె కాలంలో తెలంగాణ ప్రాంతంలో 72 శాతం మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. అంటే వీరందరూ కూడా సమ్మె కాలానికిగాను జీతాలు అందుకునే అవకాశం లేనట్టే! ఉద్యోగుల వేతన బిల్లులు 'కోతల'తోనే ట్రెజరీ కార్యాలయాలకు చేరుతున్నాయి.
తప్పదంటూ...
జీవో 177 రద్దు చెల్లదని, దానిని అమలు చేయాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే జీతంలో కోత పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. చర్చల సందర్భంగా ప్రభుత్వం పలు హామీలు ఇచ్చినప్పటికీ... లిఖితపూర్వక ఒప్పందాలు మాత్రం కుదరలేదు. సమ్మెకాలంలో జీతాల చెల్లింపుపైనా ఇదే పరిస్థితి! అన్ని శాఖల ఉద్యోగులు సమ్మె విరమించిన తర్వాతే... గైర్హాజరైన కాలాన్ని సెలవుగా పరిగణించి జీతాలు చెల్లించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అప్పుడు కూడా అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకున్నాకే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
1995లోనే..
సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపట్ల కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. 1995 జూన్ 3న జీవో 220తో 'నో వర్క్... నో పే' అస్త్రాన్ని సంధించింది. ఉద్యోగుల ప్రవర్తనను నియంత్రించే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న 'ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1964' మార్గదర్శకాలను, నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై 1991లో జారీ అయిన 'ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ, అభ్యర్థన) నిబంధనలమేరకు తీసుకునే చర్యలపై గతంలోనే ఆదేశాలున్నప్పటికీ ... ప్రభుత్వం '177' జీవోను తెరమీదకు తెచ్చింది. దాన్ని హైకోర్టు సమర్థించింది. దీంతో, సెప్టెంబర్ 13 నుంచి మొదలైన సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు ఆ రోజు నుంచి వేతనాలు అందడంలేదు. ఇప్పటికీ పట్టువదలకుండా సమ్మె చేస్తున్న టీఎన్‌జీవోలు, గెజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతాలు కూడా అందవు.

*************************************************************************************************************
'లోక్‌పాల్'కు అగ్ర ప్రాధాన్యత
- సిబిఐ, ఎసిబి ద్వైవార్షిక సమావేశంలో ప్రధాని
గతంలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి కేసుల విచారణకు పారదర్శకతతో కూడిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాల్సిన అత్యవసర పరిస్థితులేర్పడ్డాయని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సిబిఐ, రాష్ట్రాల ఎసిబి అధినేతల ద్వైవార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకుద్దేశించిన లోక్‌పాల్ బిల్లు తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. అవినీతి వ్యతిరేక పోరాటానికి సంబంధించి పౌరసమాజం, ఇతర స్వచ్ఛంద సంస్థల నుండి సూచనలను, సలహాలను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు. అవినీతిపై జరుగుతున్న పోరాటంలో మనం ఎన్నో మార్పులను చూస్తున్నామని, అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమం ద్వారా ఈ పోరాటం అగ్ర ప్రాధాన్యతను సంతరించు కుందని ప్రధాని చెప్పారు. ఇందుకు సంబం ధించిన లోక్‌పాల్ బిల్లు కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని పున్ణసమీక్షించాలన్న ప్రతిపాదనలపై వస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ సమాచార హక్కు దరఖాస్తుదారులకు ప్రభుత్వాధికారులు వీలైనంత మేరకు సమాచారాన్ని స్వచ్ఛందంగా అందజేయాల్సి ఉందన్నారు. ప్రజా జీవితంలో పారదర్శకతకు, జవాబుదారీతనాన్ని నిర్దేశించుకునేందుకు సమాచార హక్కు చట్టం ఒక అద్భుతమైన సాధనమని, దేశ ప్రజలు దీన్ని అందిపుచ్చు కోవాలని ఆయన సూచించారు. ప్రజా జీవితంలో పారదర్శకతను కొనసాగించడంతోపాటు, అవినీతిపరులను శిక్షించడం అన్న అంశం కూడా గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకుందని ఆయన చెప్పారు. వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టుల నిర్వహణకు సంబంధించి పారదర్శకతను కొనసాగించేందుకు అవసరమైన బిల్లును ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నదని చెప్పారు. ప్రయివేటురంగంలో సైతం లంచగొండితనాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించేలా చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు.
విదేశీ ప్రభుత్వాధికారులకు లంచాలివ్వడాన్ని కూడా నేరంగా పరిగణించే బిల్లును ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టామన్న ప్రధాని, ప్రయివేటురంగంలో చోటుచేసుకుంటున్న లంచగొండితనాన్ని నేరంగా పరిగణించే విధంగా మన చట్టాల్లో మార్పులు తెచ్చే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. ఏదేమైనా అవినీతికి తావు కల్పించే అవకాశాలను కనీస స్థాయికి కుదించాల్సిన అవసరముందన్న ప్రధాని, ఇందుకు పూర్తిగా లోపరహితమైన వ్యవస్థను నిర్మించుకోలేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.
తాము చట్టం బారి నుండి తప్పించుకోలేమన్న భయాన్ని అవినీతిపరులకు కలిగించేలా వ్యవహరించాలని ఆయన సిబిఐకి సూచించారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి సత్వరమే విచారణ పూర్తి చేసి దోషులను చట్టానికి పట్టించాల్సిన అవసరముందని, ఇది అవినీతిపై శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కొన్ని కేసుల్లో ముందస్తు ప్రచారం కల్పించడం వల్ల వాటికి న్యాయం జరిగే అవకాశాలు దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసేవారికి, పొరపాట్లు చేసే నిజాయితీపరులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరువరాదని ప్రధాని హితవు పలికారు. అవినీతి కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందన్న ప్రధాని, దీన్ని నివారించేందుకు అనువైన మార్గాలను అన్వేషించాలని సూచించారు. రాబోయే రోజుల్లో సమర్థవంతమైన, పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పిన ప్రధాని, లోక్‌పాల్ మాట ఎలా ఉన్నా అవినీతి నిరోధంలో సిబిఐ తన క్రియాశీలక పాత్రను ఇప్పటిలాగే కొనసాగిస్తుందన్నారు. సిబిఐలోని అవినీతి నిరోధక విభాగాన్ని లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని అన్నా హజారే బృందం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
No comments:
Post a Comment