Thursday, October 13, 2011








పట్టాలపై ఫైట్

డీజీపీతో ఉద్యమ నేతలు ఢీ
రైళ్లను అడ్డుకుంటే జైలే: దినేశ్
చేతనైంది చేసుకోండి: తెలంగాణ వాదులు

పట్టాలపై కూర్చున్నా నేరమే
ప్రేరేపించిన వారినీ వదలం
కోర్టుల చుట్టూ తిరగాల్సిందే
పదేళ్ల నుంచి యావజ్జీవం దాకా
విద్యార్థులూ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
ఉద్యోగులు కొలువు కోల్పోవద్దు
డీజీపీ దినేశ్‌రెడ్డి హెచ్చరిక

తురుంఖాన్ లను చాలా మందినే చూశాం
ఖాకీ వదలి చెంచాగిరి చెయ్: కేటీఆర్
డీజీపీ.. చట్టం తెలుసుకో: జేఏసీ
రెచ్చగొట్టేది మీరే: విజయశాంతి
పట్టాలపైకి గొర్రెలు, బర్రెలు: హరీశ్‌రావు
కాల్పులు జరిపినా ముందుంటాం: కేకే
ఘాటుగా బదులిచ్చిన నేతలు

శనివారం నుంచి మూడు రోజుల రైల్‌రోకో
48 ఎక్స్‌ప్రెస్, 76 పాసింజర్‌లు రద్దు
అనేక రైళ్లు దారి మళ్లింపు, పాక్షిక రద్దు

పోరు పట్టాలపైకి ఎక్కుతోంది! పోలీసులకూ, ఉద్యమకారులకూ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. 'పట్టాలెక్కితే కటకటాలే' అంటూ డీజీపీ దినేశ్ రెడ్డి హెచ్చరిస్తే... 'ఇలాంటి తురుంఖాన్‌లను చాలా మందిని చూశాం' అంటూ ఉద్యమకారులు ధ్వజమెత్తారు! 'ఇన్ని రోజులు చూసీ చూడనట్లుగా ఉన్నాం. ఇక ఉపేక్షించం. రైల్వే చట్టం కింద మినిమం పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకు పడుతుంది' అని పోలీస్! 'జైలు కాదు.. తూటాల వర్షం కురిసినా ఆగం' అంటూ ఉద్యమకారులు! ఢీ అంటే ఢీ! 'నువ్వా, నేనా' అన్నట్లు పట్టాలపైకి ఎక్కుతున్న ఫైట్! శనివారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో జరగనున్న రైల్ రోకోతో వాతావరణం మరింత వేడెక్కింది.


హైదరాబాద్, అక్టోబర్ 13 : పట్టాలపైకి రైళ్లు వస్తాయో రావో తెలియదు! కానీ... తెలంగాణలో ఉద్యమ దండు మొత్తం రానుంది. డీజీపీ మాటల ప్రకారం చూస్తే... పోలీస్ పటాలమూ తరలి రానుంది. రైల్ రోకో నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ మధ్య రైల్వే 48 ఎక్స్‌ప్రెస్‌లను, 76 ప్యాసింజర్లను పూర్తిగా రద్దు చేసింది. మరో 38 ఎక్స్‌ప్రెస్‌లను, 16 ప్యాసింజర్లను పాక్షికంగా రద్దు చేసింది. 68 రైళ్లను దారి మళ్లించారు. పుష్పుల్ రైళ్లు, రాజధానిలో ఎంఎంటీఎస్ సర్వీసులదీ అదే పరిస్థితి.

మొత్తంగా... తెలంగాణలో రైళ్లు పట్టాలపై కదిలే పరిస్థితి కనిపించడం లేదు! రైళ్లు తిరిగినా, తిరగకున్నా... వాటిని అడ్డుకున్నా, అడ్డుకోకపోయినా... అసలు పట్టాలపైకి రావడం, వాటిపై పడుకోవడం, ఎడ్లబండ్లను తోలడం, వంటా వార్పు చేయడం వంటి చర్యలన్నీ నేరాలేనని డీజీపీ తేల్చి చెప్పారు. రైల్ రోకో సందర్భంగా ఫిష్‌ప్లేట్ల తొలగింపుతోపాటు... ఆస్తుల విధ్వంసాన్ని అడ్డుకోవడమే పోలీసుల లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా... ఇప్పుడు రైల్ రోకో సజావుగా సాగేందుకు అనుమతిస్తే, భవిష్యత్తులో ఆందోళనలు మరింత శ్రుతిమించ వచ్చని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు... పలు పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు రైల్‌రోకోను సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పోలీసు బలగాలతోపాటు కేంద్రం నుంచి వచ్చిన పారా మిలటరీ, సరిహద్దు రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న సాయుధ పోలీసులతో రైలు పట్టాలు, రైల్వే స్టేషన్లు ఖాకీమయం కానున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా విధుల్లో ఉన్న 18 కంపెనీల కేంద్రపారా మిలటరీ బలగాలను ప్రత్యేక రైలులో హైదరాబాద్ తరలిస్తుండటం గమనార్హం. రైల్‌కోకో సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ క్రమంలోనే గురువారం డీజీపీ దినేశ్ రెడ్డి తెలంగాణ జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనేక సూచనలు చేశారు. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, లెవల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. రైలు పట్టాలపైకి గుంపులుగా అనుమతించవద్దని, అక్కడకు చేరుతున్న వారిని ఎప్పటికప్పుడు పట్టుకుని వ్యాన్లలో తరలించాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

జాబితా రెడీ..: రైల్‌రోకోలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉన్న కార్యకర్తల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీరిని ముందస్తుగా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో జరిగిన రైల్‌రోకోల సందర్భంగా నమోదైన కేసుల్లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణ జేఏసీలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకుల్లో కొందరిని అరెస్టు చేయాలని, మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల వ్యూహాలపై అవగాహన ఉన్న కీలక నేతలు ముందుగానే అజ్ఞాతంలోనికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న బలగాలు..
పారా మిలిటరీ బలగాలు: 94 కంపెనీలు (సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఆర్‌పీఎఫ్), రాష్ట్ర బలగాలు: ఏపీఎస్‌పీ, సీఏఆర్,డీఏఆర్, ఆర్ఏఎఫ్ జూ తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అదనపు బలగాలు జూ కాశ్మీర్ నుంచి 18 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు

రైల్వే శాఖ అప్రమత్తం
గతంలో రెండు రోజులు, శనివారం నుంచి జరిగే మూడు రోజుల రైల్‌రోకోతో 40 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లవచ్చని రైల్వే అధికారులు అంచనా వేశారు. రైల్‌రోకో నేపథ్యంలో అటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రద్దు చేసిన, పాక్షికంగా రద్దు చేసిన, దారి మళ్లించిన, రీ షెడ్యూల్ చేసిన రైళ్లు, ఇతర సమాచారాన్ని మీడియా ద్వారా ప్రయాణికులకు చేరవేస్తున్నారు.

ఈ సమాచారాన్ని ఆయా రైల్వేస్టేషన్‌లలో డిస్ ప్లే చేయడం, రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరచడం తదితర చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు టికెట్ సొమ్ము వాపస్ చేసుకునేందుకు వీలుగా ఆయా రైల్వే స్టేషన్‌లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి కె.సాంబశివరావు తెలిపారు.

ఉగ్రవాదుల కుట్ర భగం

ప్రజాశక్తి - న్యూఢిల్లీ   Fri, 14 Oct 2011, IST  
  • ఢిల్లీలో పేలుడు పదార్థాలతో ఉన్న కారు స్వాధీనం
దేశ రాజధానిలో మరో భారీ పేలుడుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగం చేశారు. గురువారం ఉదయం అంబాలా కంటో న్మెంట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నిలిపి ఉన్న ఒక టాటా ఇండికా కారులో పేలుడు పదార్థాలు నింపి ఉండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఉన్నతా ధికారులకు తెలిపి దానిని స్వాధీనం చేసుకొని నిర్వీర్యం చేశారు. ఆ కారులో రెండు టైమర్‌ పరికరాలు, రెండు పెట్టెల్లో ఐదు కేజీల పేలుడు పదా ర్థాలు, రెండు బ్యాటరీలున్నాయని, స్టేషన్‌ బయట పార్క్‌ చేసి ఉన్న కారు నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాజధానిలో పేలుళ్లకు కుట్ర పన్నిన బబ్బర్‌ ఖాల్సా ఇంటర్నేషనల్‌ అనే ఉగ్రవాద సంస్థకు అందించేందుకు ఈ పేలుడు పదార్థాలను లష్కరే తోయిబా సంస్థ పంపినట్లు తెలిపారు. 

No comments:

Post a Comment