తెలంగాణపై.. ఇంకా చర్చలు
చేతులు ముడుచుకు కూర్చోలేదు!
విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి
ఏకాభిప్రాయం కోసమే కృషి
సమస్య సంక్లిష్టత దృష్ట్యా వెంటనే నిర్ణయానికి రావడం కష్టం
రెండో ఎస్సార్సీ ప్రసక్తే లేదు
'ఆంధ్రజ్యోతి'తో ప్రధాని మన్మోహన్

ప్రధాని ప్రత్యేక విమానం నుంచి ఆన్‌లైన్ ప్రతినిధి ఎ.కృష్ణారావు: తెలంగాణ సమస్యపై ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చోలేదని, పరిష్కారం కనుగొనేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. సమస్యతో ముడివడి ఉన్న వివిధ పక్షాల మధ్య ఒక విశాల ప్రాతిపదికన ఏకాభిప్రాయం ఏర్పరచేందుకే ఈ ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. దీనితో సంబంధం ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరుపుతున్నామని, ఈ చర్చల్లోంచే సమస్యకు పరిష్కారమేర్పడుతుందని.. తాము కనుగొనబోయే పరిష్కారం అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికాలో మూడు రోజుల పర్యటన తర్వాత భారతదేశానికి తిరిగివస్తూ ప్రత్యేక విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సమస్యకున్న సంక్లిష్టత రీత్యా వెంటనే నిర్ణయానికి రావటం కష్టమవుతోందని.. పరిష్కారం కనుగొనడంలో కొంత సమయం పట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నదని, అది కొత్తగా తలెత్తింది కాదని.. 50వ దశకం మధ్య నుంచే ఈ ఉద్యమం కొనసాగుతోందన్నారు.
రెండో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్సార్సీ) ఏర్పాటు ఆలోచన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇలాంటి కమిషన్ల ఏర్పాటు అంశంపై చాలా సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయని మాత్రం ఆయన వివరించారు. " దేశంలో ఫెడరల్ చిత్రపటాన్ని మళ్లీ తిరగరాయాలన్న ప్రతిపాదనలూ చాలామంది చేస్తున్నారు. కానీ అలాంటి అభిప్రాయం ఏదీ మాకిప్పుడు లేద''ని ప్రధాని స్పష్టం చేశారు.
ఆంధ్రజ్యోతి ప్రశ్న.. ప్రధాని జవాబు
ఆన్‌లైన్: మీరు గత ఏడున్నరేళ్లలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించారు. కానీ, కొన్ని రాజకీయ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయి. అందులో ఒకటి మా రాష్ట్రంలోని తెలంగాణ సమస్య. ఎంతో కాలం నుంచి ఈ సమస్య పరిపాలన, రాజకీయ యంత్రాంగాల్ని అతలాకుతలం చేస్తోంది. అయినప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు ముడుచుకుని కూర్చోవటానికి కారణమేంటి? ప్రధాని: తెలంగాణ సమస్యపై ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఆ విషయాన్ని నేను అంగీకరించను. సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వాటి వల్ల.. సమస్యతో ముడిపడి ఉన్న వివిధ పక్షాల మధ్య విశాల స్థాయిలో ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. తెలంగాణపై వెంటనే నిర్ణయానికి రావటంలో ఎన్నో సమస్యలున్నాయి. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 50వ దశకం మధ్య నుంచీ ఈ ఉద్యమం ఉంది. అందువల్ల, పరిష్కారం కనుగొనడంలో ఉన్న సంక్లిష్ట సమస్యల దృష్ట్యా కొంత సమయం పట్టక తప్పదు. సమస్యతో సంబంధం ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చల్లోంచే సమస్యకు పరి

అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు
- వారు తలచుకుంటే జనవరిలోనే తెలంగాణ
- హైదరాబాద్‌లో అద్వానీ
రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శాసనసభలో తీర్మానం చేయకుండానే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టవచ్చని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. తెలంగాణ విషయంలో యుపిఎ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తలచుకుంటే వచ్చే ఏడాది జనవరి 1 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. అవినీతిని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ అద్వానీ ప్రారంభించిన జన చైతన్య యాత్ర బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావటం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె జరిగిందని, వందలాదిమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చివరకు ఢిల్లీలో కూడా ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవటం శోచనీయమని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ మద్దతుని స్తుందన్నారు. యుపిఎ-2 ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస కుంభకోణాలతో దేశ ప్రజలు విసిగిపోయారని చెప్పారు.
విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి మనదేశానికి రప్పించటం ద్వారా ప్రతి గ్రామంలోనూ విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతుల్ని కల్పించవచ్చని, తద్వారా దేశాన్ని అభివృద్ధి చేయవచ్చని అన్నారు. అడ్డూఅదుపు లేకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. బిజెపి జాతీయ నాయకులు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. యుపిఎ-2లోని మంత్రులు, ఇతర నాయకులు కుంభకోణాలకు పాల్పడిన నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పారని అన్నారు. తెలంగాణపై 2004 నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కిస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందుచూపు కొరవడ్డాయని విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ ప్రాంతంలో బిజెపి బలపడుతుందంటూ మజ్లిస్ నాయకులు మాట్లా డటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో తమ పార్టీ ఎందుకు బలపడకూడదో చెప్పాలని ప్రశ్నించారు. హిందీ మాట్లాడేవారికి పది రాష్ట్రాలు న్నప్పుడు, తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రా లుంటే తప్పేమిటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ బహి రంగ సభలో బిజెపి సీనియర్ నాయకులు
బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగరరావు, ఎంపీలు అనంతకుమార్, రవిశంకర్, సిక్కిం మాజీ గవర్నర్ విఎస్ రామారావు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మన్, అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
బిజెపి నేత ఎల్‌కె.అద్వానీ జనచేతన యాత్రలో భాగంగా బుధవారం నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో ప్రసంగించారు. నిజామాబాద్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2012 జనవరిలో తెలంగాణ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని, అయినా రాకపోతే 2014లో ఎన్‌డిఎ అధికారంలోకొచ్చాక తెలంగాణను తప్పనిసరిగా ఇస్తుందని హామీ ఇచ్చారు. 'ప్రధాని పదవి కోసమే యాత్ర చేస్తున్నారా? అవినీతికి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నారా?' అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానంగా అవినీతి నిర్మూలన కోసం ప్రజలను చైతన్యపరిచేందుకు యాత్ర చేస్తున్నానని చెప్పారు. అనంతరం జనచేతన యాత్ర కామారెడ్డికి చేరుకుంది. ఏడు సంవత్సరాల కాంగ్రెస్ పాలన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు మారుపేరుగా నిలచిందని కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రోడ్‌షోలో అద్వానీ అన్నారు. జలయజ్ఞంలో అవినీతి, భూదోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. అత్యంత విలువైన భూములను ప్రభుత్వంలోని పెద్దలు తాము భాగస్వాములుగా ఉన్న సంస్థలకు, వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్‌షోలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో జరిగిన రోడ్‌షోలో మెదక్ ఎంపీ విజయశాంతి పాల్గొని అద్వానీకి అభివాదం చేశారు. సాయంత్రం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ చౌరస్తాలో అద్వానీ ప్రసంగించారు.
హజారే హడలెత్తించారా?
జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందా? తెలంగాణా లో తెరాసదే ఇష్టారాజ్యమా? నాలుగే నాలుగు రాష్ట్రాల్లో నాలుగే నాలుగు సీట్లకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూసి ఇలాంటి ముక్తాయిం పులకు రావడం సబబేనా? వాటిల్లో ఒకటి లోక్‌సభ సీటైతే, మిగతా మూడూ అసెంబ్లీ స్ధానాలు. హర్యానాలో హిస్సార్ లోక్‌సభ స్ధానంలో కులదీప్ సింగ్ బిష్ణోయ్ గెలిచారు. ఆయన భజన్‌లాల్ కుమారుడు. ఒరిజినల్‌గా ఆ సీటు భజన్‌లాల్‌ది. ఆయన చనిపోవడంతో ఆయన కొడుకు బిష్ణోయ్ పోటీచేసి గెలు చుకున్నారు. ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తయితే అ న్నా హజారే అంశం మరొక ఎత్తయింది.
అన్నా హజారే రంగంలోకి దిగి, కాం గ్రెస్‌కి మాత్రం ఓటెయ్యవద్దని ప్రచారం చేశారు. ఈ ఫలితంగానే అక్కడ కాం గ్రెస్ ఓడిపోయిందన్న ప్రచారం ఊపందుకుంది. కాని అలాంటి నిర్ధారణకు రావడానికి అనువైన శాస్ర్తీయ ఆధారాలు దొరకడం లేదు. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన కాంగ్రెస్..అవినీతి మీద యుద్ధం చేస్తున్న హజారే మధ్య యుద్ధంగా హిస్సార్ ఉప ఎన్నికను అభివర్ణించారు. హజారే పిలుపుకి స్పందించి ఓటర్లు కాంగ్రెస్‌ని మూడో స్ధానంలోకి నెట్టారని అనుకోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. నిజానికి అక్కడ కాంగ్రెస్‌కి లేశమాత్రమైనా బలం లేదు. రెండో స్ధానంలో నిలిచిన అజయ్ చౌతాలాకు, బిష్ణోయ్‌కి మధ్య ఓట్ల తేడా చాలా చాలా తక్కువ. బిష్ణోయ్‌కి 38.8 శాతం ఓట్లు వస్తే అజయ్ చౌతాలాకు 38.1 శాతం వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ది పరిస్థితి దారుణం.
16.3 శాతం మాత్రమే వచ్చాయి. భజన్‌లాల్ సీటు మళ్లీ ఆయన కొడుకే గెలుచుకుంటాడని అందరూ ఊహించిందే. అక్కడ కాంగ్రెస్ దారుణంగా మూడో స్ధానంలోకి పడిపోయిందని చెబుతున్నారు తప్ప నిజానికి నైతిక ఓటమి చెందింది అన్నా హజారే అన్న విషయం లోతుగా పరిశీలిస్తే తప్ప అర్ధం కాదు. జనలోక్‌పాల్ బిల్లుకి అనుకూలంగా, అవినీతికి వ్యతిరేకంగా హజారే బృందం పిలుపు ఇస్తే దానికి స్పందన నామమాత్రమేనని తేలింది. అక్కడ అవినీతి మీద తీర్పు రాలేదు. కులం ప్రాతిపదికనే ఓట్లు చీలాయి. జాట్లకు, జాట్లేతరులకు మధ్య పోటీ జరిగింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డి) అభ్యర్థి అజయ్ చౌతాలా, కాం గ్రెస్ అభ్యర్ధి జై ప్రకాష్‌లిద్దరూ జాట్లు.
బిష్ణోయ్ నాన్ జాట్. అవినీతి మీదే యుద్ధం జరిగి ఉంటే అజయ్ చౌతాలాకు ఆ సెగ బాగా తగిలి ఉండాలి. ఎం దుకంటే అజయ్ చౌతాలా అవి నీతి కేసులో ఇరుక్కుని ఉన్నారు. తండ్రి ఓం ప్రకాష్ చౌతాలా ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు అజయ్ చౌతాలా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల మీద సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది. అయినా అజయ్ కిందటిసారి కన్నా ఈసారి ఓట్లు ఎక్కువ సంపాదించారు. అన్నా హజారే అవినీతి మీద యుద్ధం ఇక్కడ పని చేయలేదనడానికి ఇదొక్కటి చాలు. జాట్లు అజయ్ చౌతాలా, జై ప్రకాష్‌ల మధ్య చీలిపోతే, జాట్లేతరులంతా బిష్ణోయ్ వెనక నిలిచారని అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. బిష్ణోయ్ విషయంలో తండ్రి భజన్ లాల్ మరణం తాలూకు సానుభూతి బాగా పని చేసింది. అదే బిష్ణోయ్‌ని అజ య్ చౌతాలా ప్రభంజనం నుంచి కొద్దిలో కాపాడింది. వీళ్లిద్దరికీ కేవలం ఆరు వేల ఓట్ల తేడా మాత్రమే ఉంది.
హిస్సార్ సీటు భజన్‌లాల్ కుటుంబానికి కంచు కోట. అందుకే బిష్ణోయ్ తన తండ్రి కన్నా 77,000 ఓట్లు ఎక్కువ సంపాదించారు. ఇక అజయ్ చౌతాలాకు వచ్చిన ఓట్లు కూడా ఎంతమాత్రం తక్కువ కాదు.2009లో ఐఎన్‌ఎల్‌డి తరపున పోటీ చేసిన సంపత్ సింగ్ కన్నా ఆయన లక్షా ఎనిమిది వేల ఓట్లు అధికంగా పొందారు. నిజానికి సంపత్ సింగ్ ఓం ప్రకాష్ చౌతాలాకు నమ్మిన బంటు. అయితే ఆయన చౌతాలాను విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు అయినా ఆయన ఓట్లు కాంగ్రెస్‌కు పడలేదు. కేజ్రీవాల్, బాబా రామ్‌దేవ్ హిస్సార్‌కు చెందిన వారైనా, వారి ప్రచారం పని చేయలేదని బీజేపీ నేతలే విశ్లేషించి చెప్పారు.ఇవన్నీ ఒక ఎత్తయితే హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలున్నాయి. అందర్నీ కలుపుకొని పోయే నాయకత్వం లేదు. పైగా పార్టీ అభ్యర్ధిని ఓటర్లు ఇష్టపడలేదు. ఇవన్నీ కలిసి కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని బాన్సువాడ.. బీహార్‌లో దరౌందా..
మహారాష్టల్రో ఖండక్‌వాస్లా అసెంబ్లీ సీట్లు:
బీహార్‌లోని దరౌందాలో పాలక జనతాదళ్(యు) మళ్లీ గెలిచింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు), లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీల మధ్యే పోటీ. కాంగ్రెస్ పార్టీది అక్కడ కేవలం ప్రేక్షక పాత్రే. చెప్పుకోవడానికి నికరమైన మిత్ర పార్టీ ఒక్కటీ లేదు. ఈ పరాభవ పరిస్థితి బీహార్‌లో కాంగ్రెస్‌కి కొత్తగా వచ్చింది కాదు. దశాబ్దాలుగా అక్కడ ఒక క్రమ పద్దతిలో క్షీణిస్తూ వస్తున్నది. మహరాష్టల్రో ఎన్సీపీ ఓడిపోయింది. బీజేపీ-శివసేన కూటమి ఖండక్‌వాస్లా సీటు గెలుచుకుంది. రాష్ట్రంలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అధికా రంలో ఉంది. విషాదం ఏమిటంటే కేంద్రంలోనూ ఈ రెండు పార్టీలు అధికా రాన్ని అనుభవిస్తున్నాయి.
అయినా ఒక్క సీటుని గెలుచుకోలేకపోయాయి. ఇందుకు కాంగ్రెస్-శరద్‌పవార్ సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక బాన్సువాడ సీటు. దీని తరహాయే వేరు. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది నిజమే అయినా నిజానికి బాధ పడాల్సింది తెరాస. లక్ష మెజారిటీతో గెలిపిస్తామని తానొక వైపు, తన కేడర్ చేత మరొక వైపు కేసీఆర్ ఢంకా భజాయించారు. తీరా యాభయ్ వేల ఓట్లతో పోచారం గెలవడంతో ఖంగు తినడం కేసీఆర్ వంతయింది. పైగా కాంగ్రెస్‌కి తాము ఊహించిన వాటి కన్నా ఎక్కువ ఓట్లు రావడం తెరాసకి అస్సలు మింగుడు పడటం లేదు.
తెలంగాణా ఉద్యమ ఊపులో అస్సలక్కడ తెరాస తప్ప మరే ఇతర పార్టీ కనీసం ప్రచారం కూడా చేసే వాతావరణం లేదన్న స్థితి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కూడా విస్తుపోయే రీతిలో ఓట్లు రావడాన్ని నాణానికి మరో పార్శ్వంగా చూడా లి. తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలే అక్కడ పోటీ వద్దని వారించి, తీరా ఫలితం చూశాక నాలుక కరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఆ సీటు కాంగ్రెస్‌ది కాదు. తెలుగుదేశానిది. ఆ పార్టీ టిక్కెట్టు మీద కిందటి సారి పోటీ చేసి గెలిచిన పోచారం శ్రీనివాస రెడ్డి ఈ మధ్యే రాజీనామా చేసి, తెలుగు దేశానికి గుడ్‌బై చెప్పి తెరాసలో చేరారు. ఒక రకంగా చూస్తే ఆయన సీటు ఆయనకొచ్చింది. కాని తెలుగుదేశం నష్టపోయింది. తన సీటు కోల్పోయింది. పైగా విషాదం ఏమిటంటే అసలా పార్టీ అక్కడ పోటీ చేయలేదు. తన సీటు కోసం తుది దాకా పోరాడాల్సిన తెలుగుదేశం ఎన్నికల బరిలో ముఖం చాటేసింది. తన ఓట్లలో అత్యధిక భాగం తెరాస పార్టీకి కాకుండా కాంగ్రెస్‌కి వెళ్లాయని తెలిశాక పశ్చాత్తాపం చెందడం తెలుగుదేశం వంతయింది.
మొత్తం మీద నాలుగు చోట్లా కాంగ్రెస్ ఓడి పోయి ఉండొచ్చు. కేంద్రంలో ఏడేళ్లుగా నిరవధికంగా అధికారంలో ఉంటున్న పార్టీగా నిస్సందేహంగా నాలుగు సీట్లనూ గెలుచుకుని ఉండాల్సింది. కాని స్ధానిక సమీకరణాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయిలో గాని, ఆయా రాష్ట్రాల స్ధాయిలో గాని అధిగమించలేకపోయింది. స్ధానిక కారణాలేమైనా.. వాటినన్నింటినీ తలదన్నే సునామీ లాంటి ప్రభావిత అంశాలేవీ కాంగ్రెస్ నాయకత్వం దగ్గర లేకపోవడం ఈ ఓటమికి ప్రధాన కారణం.

No comments:
Post a Comment