Wednesday, October 26, 2011


******************************************************************************

తన ఉనికిని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ ఆడుతున్న ప్రమాదకర అట - మత పరమైన రిజర్వేషన్లు

మతపమైన రిజర్వేషన్లు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం. వందల సంవత్సరాలుగా సమాజంలో వివక్షకు గురైన వారిని మిగతా సమాజంతో పాటు అభివృద్ధి చేయాలనే ఉన్నత లక్ష్యంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడినవి. ఆ లక్ష్యాన్ని విస్మరించి, తమ రాజకీయ అవసరాలకు తగిన విధంగా రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు కూడా రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు మాత్రమే ఇవ్వదలచుకున్నాము, అందరికీ కాదు అనేది ప్రభుత్వ వాదన. అయితే బీసీ కోటాలో వెనుకబడిన ముస్లింలకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. దానిని పెంచవచ్చు కదా! రాజకీయ నాయకులూ అందుకు సిద్ధంగా లేరు. ఉన్నవి పోకుండా కొత్తవి ఎలా సాధించుకోవాలా అని నాయకుల ఆలోచన.

మతపరమైన రిజర్వేషన్లు మతపరమైన నియోజక వర్గాల ఏర్పాటుకు దారి తీయవా? దాని వలన జాతీయ సమైక్యతకు భంగకరం కాదా?

2012 సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. పేరు పొందిన రాజకీయ పార్టీలన్నిటికీ తమ భవిష్యత్తు ఆ ఎన్నికల ఫలితాల పైనే ఆధారపడి ఉన్నదని తెలుసు. అందుకే కాంగ్రెస్ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింల కోసం అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. వాళ్ళ రక్షణ కోసం మతపరమైన హింసను నిరోధించేందుకు ఒక చట్టం చేయబోతున్నది.

దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకూ వర్తింపచేసేందుకు ప్రయత్నం చేస్తున్నది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కూడా ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేస్తోంది. మొత్తం మీద దేశంలోని కాంగ్రెస్ ను చూసి మిగతా పార్టీలు కూడా ఈ మత రిజర్వేషన్ల పాచికను ఉపయోగిస్తున్నాయి. ఇవి దేశ ప్రజల్లో విబేధాలు నిర్మాణం చేసేందుకు దారి తీస్తాయి. ఏమైనా రాజకీయ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యం.



*********************************************************************



************************************************************************


మమ్మల్ని ముందుకు తోసి వెనక్కి తగ్గారు

  • రాజకీయ నాయకులపై సచివాలయ టి-ఉద్యోగుల సంఘం విమర్శ
తాము 42 రోజుల పాటు చేసిన సమ్మెకు రాజకీయ నాయకులు అండగా నిలువలేదని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం కన్వీనర్‌ నరేందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ముందుకు తోసేసి రాజకీయ నాయకులు వెనక్కు తగ్గారన్నారు. తాము ఆశించింది కొండంత అయితే లభించింది గోరంత అని చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సమ్మె చేయడం ద్వారా ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చామన్నారు. సమ్మెను విరమింపజేసేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రయత్నించారని, పలుమార్లు కాంగ్రెస్‌ పార్టీ కోర్‌కమిటీ భేటీ అయ్యిందని తెలిపారు. తమ చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్రం సాధించే దిశగా వెళ్తున్నామన్నారు. రాయలసీమ నేతలను చూసి తెలంగాణ ప్రాంత నేతలు బుద్ధి తెచ్చుకోవాలని విమర్శించారు. తెలంగాణ మంత్రులు సచివాలయానికి వస్తే తాము అడ్డుకోమన్నారు. 

*********************************************************************************************
నీకోసం
నీ కోపం నిరుపమానం
ఒక్కోసారి తుఫానులా వస్తుంది
అగ్ని కీల వలయంలో అర్ధనిమీలితంగా నిల్చుంటాను
నీ కోపం వరదలా వస్తుంది
ప్రవాహ మధ్యలో శిలలా దిగ్భ్రమతో నిలచిపోతాను
నీ కోపం చీకటిలా గాఢంగా వస్తుంది.


నిశ్చలన దీపంలా నిల్చుండి పోతాను
ఎడతెరపి లేని నీ ఆరోపణల వర్షంలో
ఆద్యంతం తడుస్తూ
చలనం లేని చెట్టులా ఉండిపోతాను
ఉద్రేకంతో ఎప్పుడూ ఊసులాడ కూడదు
ఉద్వేగానికి ఉబుసు పోక కబుర్లు ఉల్లాసాన్నివ్వవు
యుద్ధ రంగంలో విజయమెప్పుడూ నీదే!
బందీ నెందుకు నిందిస్తావని అడగను.
నీ కోపంతో, నీ కన్నీళ్ళతో నీ హృదయం
పరిశుభ్రమవుతుంది.
శుభ్రమయిన మనసులో
సుందర చంద్రోదయ మవుతుంది
వెన్నెల్లో నువ్వు ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్న
బొమ్మని నేనే కదా!
- సౌభాగ్య

**********************************************************************************

ఆఫీస్.. ఫుల్
మెరుగవుతున్న ఉద్యోగుల హాజరు
సచివాలయంలో విధులకు 87% మంది

సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగులు
కష్టపడినందుకు మాకు ఫలితం లేదా?
సమ్మెలో వచ్చినందుకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి
సీఎంకు ఏపీ ఎన్జీవో నేతల వినతి
ఇక పాలనపై దృష్టి పెడదాం
టీ-మంత్రులతో భేటీలో సీఎం సూచన
జానా, శంకర్‌రావు, పొన్నాల గైర్హాజరు
29న మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 25 : రాష్ట్రంలో పాలన క్రమంగా గాడిన పడుతోంది. సచివాలయంతోపాటు వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లోనూ ఉద్యోగుల హాజరు మెరుగుపడుతోంది. సచివాలయంలో 87 శాతం మంది.. శాఖాధిపతుల కార్యాలయాల్లో 80 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే విధులకు హాజరయ్యారు. దీపావళి తర్వాత మంచిరోజు చూసుకుని మిగిలినవారు కూడా హాజరవ్వాలని నిర్ణయించారు. మరోవైపు తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించారు. సమ్మె కాలంపై ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుచేసేందుకు, జీతాలు రాని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి.

దీంతో విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘు నిరాహార దీక్షను విరమించారు. మరోవైపు సమ్మె కాలంలో అష్టకష్టాలు పడి విధులు నిర్వర్తించిన తమకు పదివేల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె కారణంగా బస్సులు లేకపోయినా అధిక చార్జీలు పెట్టుకుని తాము విధులకు హాజరయ్యామని, గతంలో 1983లో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఓ ఇంక్రిమెంటు ఇచ్చారని వారంటున్నారు.

ఇక మరోవైపు.. తెలంగాణలో ప్రభుత్వోద్యోగులు విధులకు హాజరవుతున్నందున పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారిద్దామని ఈ ప్రాంత మంత్రులకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తేనీటివిందు ఇచ్చారు. ఈ భేటీకి విదేశాల్లో ఉన్న పొన్నాల లక్ష్మయ్య హాజరుకాలేదు. జానారెడ్డి, శంకర్‌రావు కూడా హాజరుకాలేదు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జె.గీతారెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.

విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయంలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగుల నుంచి ఇక అభ్యంతరాలు ఉండవు కాబట్టి.. విధుల్లోకి హాజరు కావాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈనెల 29న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో సోమవారం ఉద్యోగసంఘాల నేతలతో జరిగిన చర్చల వివరాలను వెల్లడించారు. 'సకల జనుల సమ్మె ప్రశాంతంగా జరుగుతుంటే ప్రభుత్వం ఏనాడూ జోక్యం చేసుకోలేదు.

42 రోజుల పాటు ఉద్యమం జరిగినా ఏ ఒక్క రోజూ ఒక తూటా పేలలేదు. ఒక్క లాఠీ విరగలేదు. కనీసం ఎక్కడా బాష్పవాయు గోళాలు ప్రయోగించలేదు. కానీ, నల్లగొండలో బస్సులపై దాడి విషయంలోనూ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా? ఆ తర్వాతే ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. బస్సుల్లో మహిళలు, వృద్ధులు ఉన్నారు. వారు ఆందోళన చెందితే పరిస్థితి ఏంటి? దీనిపై కఠినంగా ఉండొద్దా' అని జేఏసీ నేతలను ప్రశ్నించినట్లు సీఎం తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుపట్టలేదన్నారు.

ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగస్వాములేనని, వారంతా కుటుంబ సభ్యులేనని, సమ్మె తర్వాత కక్ష సాధింపు చర్యలేవీ చేపట్టవద్దని కోరగా తాను సమ్మతించానని చెప్పారు. ఈ ప్రాంతంలో 42 రోజుల పాటు పాలన స్తంభించినందున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రులకు సూచించారు. రచ్చబండ, కిలోరూపాయి బియ్యం పథకం, ఇందిర జల ప్రభ కార్యక్రమాలు తెలంగాణలో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. నవంబర్ రాష్ట్రాన్ని సంక్షేమ మాసంగా ఆయన అభివర్ణించారు.

**********************************************************************************

ఇక చేయాల్సింది పార్టీలే
ఉద్యోగులతో భేటీలో కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 25 : 'ఉద్యోగులు చేయగలిగినంత చేశారు. అంతకన్నా చేయగలిగింది లేదు. ఇక అందుకోవాల్సింది రాజకీయ పార్టీలే' అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సమ్మె నుంచి ఉద్యోగులు సేఫ్‌గానే లాండ్ అయ్యారన్నారు. 42 రోజులపాటు చేసిన సమ్మెను వాయిదా వేసుకున్న నేపథ్యంలో కేసీఆర్‌తో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అగ్రనేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్ మంగళవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను జేఏసీ నాయకులు ఆయనకు చూపించారు. 'ఉద్యోగుల త్యాగాన్ని మరువలేం. ఉద్యోగులు ఎంత చేయాలో అంత చేశారు. ఇక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రావాలి' అని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగులు చేసిన ఉద్యమాన్ని ఇక పార్టీలు అందుకోవాలని, అప్పుడే తెలంగాణపై స్పష్టత వస్తుందని, లేకుంటే విషయం తేలదని అన్నారు. ఉద్యోగుల ఉద్యమంపై తెలంగాణలో ఎక్కడా వ్యతిరేకత రాలేదన్న అభిప్రాయం భేటీలో వ్యక్తమైంది.



**********************************************************************************





No comments:

Post a Comment