అటు విన్నపం ఇటు విధ్వంసం
రాష్ట్రంలో ఒక వంక రాళ్లు..ఢిల్లీలో మరోవంక వేడికోళ్లు.. సోమవారమంతా ఢిల్లీలో పోటాపోటీ భేటీలు..ఒక వైపు టీ-కాంగ్రెస్ నేతలు..మరో వైపు తెలంగాణా ఉద్యమ నేతలు.. ప్రధాని వద్ద పంచాయతీ.. స్పష్టమైన హామీ కోసం వీరిపట్టు.. హామీ విషయంలో ప్రధాని బెట్టు.. అంతా తెలుసు.. అందరితో మాట్లాడతా.. త్వరలో చూద్దాం... ఇదీ మన్మోహన్ పడికట్టు పదాల సమాహారం. రెండు బృందాలకూ ఇదే సమాధానం. బైటికొచ్చాక టీ-కాంగ్రెస్ నేతలు ఎలాంటి నిర్లిప్తతా పైకి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆచితూచి మాట్లాడారు. నిర్దిష్ట కాలపరిమితి చెప్పండని అడిగినా ప్రధాని ఆ విషయం ప్రస్తావించలేనని మాత్రం ఒక్క ముక్కలో బోలెడు అర్థాన్ని విడమరచి చెప్పారు. ే
కసీఆర్ బృందం తరఫున ేకసీఆర్ తొలుత ఆచితూచి మాట్లాడినా ఆయనలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. మెుత్తం మీద ేకసీఆర్ ఢిల్లీ టూర్ ఎలాంటి స్పష్టమైన హామీ లభించకుండా ముగిసింది. వీరి డిమాండ్లలో ఏ ఒక్కదానికీ ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చిన దాఖలాలు లేవు. టీ-కాంగ్రెస్ నేతలు మింగలేకా కక్కలేకా మల్లగుల్లాలు పడితే తెరాస నేతలు మాత్రం ప్రధానితో చర్చలు విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. తాము ఇంతక్రితం ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ అమలు అవుతుందని స్పష్టం చేశారు. సమ్మె ఆగదన్నారు. అంతే కాదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ేకసీఆర్ చెప్పారు.

ఇక అంతా చీకటే
ఆధికారికంగా కరెంటు కోతలు
October 4th, 2011
హైదరాబాద్, అక్టోబర్ 3: సమ్మె దెబ్బతో ఆంధ్రకు అంధకారం అలముకుంది. విద్యుత్ సంక్షోభం ముదిరిపోవటంతో చేతులెత్తేసిన సర్కారు అధికారికంగా విద్యుత్ కోతలను ప్రకటించింది. రాజధాని హైదరాబాద్‌లో నాలుగు గంటలు, జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్ధల్లో ఆరు గంటలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఎనిమిది గంటలు కోతలు విధించాలని ట్రాన్స్‌కో సిఎండి అజయ్‌జైన్ ఆదేశించారు.
ఇక గ్రామాల్లో పట్టపగలే చీకట్లు కమ్ముకోనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విద్యుత్ ఉండదు. కానీ సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకూ విద్యుత్ సరఫరా ఉంటుంది. పరిశ్రమలకూ గడ్డుకాలం తప్పడం లేదు. వారానికి మూడు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించారు. విద్యుత్ సరఫరా అయ్యే మిగిలిన నాలుగు రోజుల్లో సాయంత్రం సమయాల్లో విద్యుత్ కోతలు పరిశ్రమలకు అమలు చేస్తారు. ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలకు విద్యుత్ పరంగా అవరోధాలున్నా, ఆరు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకునేందుకు డిస్కాంలు చర్యలు తీసుకుంటున్నాయి.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను ఏడు నుంచి ఆరు గంటలకు తగ్గించారు. ట్రాన్స్‌కోతోపాటు నాలుగు డిస్కాంలలో విద్యుత్ సరఫరా పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కంట్రోలు రూంలను ఏర్పాటు చేశారు. ఏపి ట్రాన్స్‌కోలో కంట్రోలు రూం 040-23399401 లేదా 23399402కు ఫిర్యాదులు చేయవచ్చు. వ్యవసాయరంగానికి వచ్చే 20 రోజులపాటు మాత్రమే రోజుకు ఆరు గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలను భారీ ఎత్తున అమలు చేస్తున్నందు వల్ల పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు డిస్కాం అధికార్లు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈమేరకు ట్రాన్స్‌కో సిఎండి అజయ్ జైన్ డిస్కాం అధికార్లను ఆదేశించారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సకల సనుల సమ్మె వల్ల ఆశించినట్టుగా జరగటం లేదు. బొగ్గు ఉత్పత్తి 34 వేల ఎంటికి పడిపోయింది. గత నెల 13నుంచి ఇప్పటి వరకు 17 లక్షల ఎంటి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సింగరేణిలో కూడా బొగ్గు నిల్వలు 7.7 లక్షల ఎంటి నుంచి 1.7 లక్షల ఎంటికి తగ్గాయి. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 272 ఎంయుకు చేరుకుంది. కాగా రాష్ట్రంలో 230 ఎంయు విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దాదాపు 35నుంచి 40ఎంయు విద్యుత్ లోటు ఏర్పడింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో వచ్చే 20రోజులకు మాత్రమే విద్యుదుత్పత్తికి అవసరమైన నీటి నిల్వలున్నాయి. వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సీజన్ చివరి రోజుల్లో విద్యుత్ సమస్య ముదురుతుంది. ఈనెల 2న రికార్డు స్ధాయిలో 47 ఎంయు విద్యుత్ కొరత ఏర్పడింది. గత సెప్టెంబర్ నెలలో 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారు. రోజుకు 1100 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కొరత తలెత్తింది. తమిళనాడు, కేరళ నుంచి వచ్చే విద్యుత్ కూడా నిలిచిపోయింది. అక్టోబర్ నెలలో విద్యుత్ కొనుగోలుకు 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఆశించిన రీతిలో త్వరితగతిన బొగ్గు థర్మల్ ప్రాజెక్టులకు చేరుకోవడం లేదు. రామగుండం ఎన్టీపిసిలో 2600 మెగావాట్ల విద్యుదుత్పత్తిలో సగానికి సగం పడిపోయింది. విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ ప్రాజెక్టులో ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. అదనంగా 1.7 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను కేటాయిస్తామని కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టుల కెపాసిటీ 2495 మెగావాట్లు. కాగా గ్యాస్ విద్యుదుత్పత్తి సగానికి సగం 1385 మెగావాట్లకు పడింది. దీంతో చాలినంత గ్యాస్ లేక ప్రాజెక్టులు అరకొరగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అదనంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఇంతవరకూ సానుకూలంగా స్పందించలేదని విద్యుత్ నిపుణులు పేర్కొన్నారు. ఎవరికీ కేటాయించని విద్యుత్ నుంచి 185 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం కేటాయించింది. ఇదొక్కటే కొద్దిలో కొద్దిగా ఊరట కలిగిస్తోంది. ఇది కూడా ఐదు వందల మెగావాట్ల వరకూ కేటాయించే అవకాశం ఉన్నా, కేంద్రం ఈ విషయంలో రాష్ట్రం పట్ల తాత్సార వైఖరితో ఉందని తెలుస్తోంది. పవర్ గ్రిడ్ విస్తరణ కారిడార్ తాల్చార్- కోలార్ నుంచి రోజుకు పది గంటల పాటు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ లభిస్తోంది.

ప్రధానిని కలిసిన కాంగ్రెస్, జేఏసీ నేతలు
టైం కావాల్సిందేనన్న మన్మోహన్
తెలంగాణపై దక్కని ఊరట
పరిష్కారంపై లభించని నిర్దిష్ట హామీ
3ప్రాంతాలకూ ఆమోదయోగ్య పరిష్కారం
అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కసరత్తు
ఒకరికి అనుకూలంగా ప్రకటన చేస్తే
మరో ప్రాంతం నుంచి సమస్యలు
ఒక పరిష్కారంతో మరో సమస్య రావద్దు
భాగస్వాములందరినీ సంప్రదించాలి
ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి
నేతలకు మన్మోహన్ హితబోధ
తాము సంతృప్తి చెందలేదన్న కేసీఆర్
సకల సమ్మె ఆగదని స్పష్టీకరణ
9,10,11 తేదీల్లో ఉధృతంగా రైల్‌రోకో
టైం కావాల్సిందేనన్న మన్మోహన్
తెలంగాణపై దక్కని ఊరట
పరిష్కారంపై లభించని నిర్దిష్ట హామీ
3ప్రాంతాలకూ ఆమోదయోగ్య పరిష్కారం
అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కసరత్తు
ఒకరికి అనుకూలంగా ప్రకటన చేస్తే
మరో ప్రాంతం నుంచి సమస్యలు
ఒక పరిష్కారంతో మరో సమస్య రావద్దు
భాగస్వాములందరినీ సంప్రదించాలి
ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి
నేతలకు మన్మోహన్ హితబోధ
తాము సంతృప్తి చెందలేదన్న కేసీఆర్
సకల సమ్మె ఆగదని స్పష్టీకరణ
9,10,11 తేదీల్లో ఉధృతంగా రైల్‌రోకో
"తెలంగాణ సమస్య పరిష్కారానికి మాకు కొంత సమయం కావాలి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున సకల జనుల సమ్మెను విరమించండి. సమస్యకు పరిష్కారం కావాలంటే మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఎవరూ నష్టపోలేదనే రీతిలో (విన్-విన్ సిచ్యువేషన్) అది ఉండాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే, అంతకు ముందు భాగస్వాములు (స్టేక్ హోల్డర్స్) అందరినీ ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేయాలి కదా!''
-కేసీఆర్ నేతృత్వంలోని జేఏసీ నేతలతో ప్రధాని.
"ఒక ప్రాంతానికి అనుకూలంగా ప్రకటన చేస్తే.. మరొక ప్రాంతంలో సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలోనూ ఇలాగే ప్రకటనలు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక సమస్యను పరిష్కరించి మరొక సమస్యను సృష్టించుకోకూడదు. మూడు ప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అందుకే సమయం తీసుకుంటోంది. మా నిర్ణయం మూడు ప్రాంతాల ప్రజలనూ సంతృప్తి పరుస్తుంది.''
-కాంగ్రెస్ తెలంగాణ నేతలతో ప్రధాని.
న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : తమ గోడు చెప్పుకొందామని ప్రధానమంత్రి మన్మోహన్ దగ్గరకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వింత అనుభవం ఎదురైంది. తెలంగాణ సంక్షోభాన్ని సత్వరమే పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరడానికి వారు వెళ్లగా.. "కేంద్ర ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో ఉంది (స్టెబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్న్‌మెంట్ ఈజ్ ఎట్ స్టేక్)'' అని ప్రధాని వ్యాఖ్యానించడంతో వారు విస్తుపోయినంత పనైంది. సకల జన సమ్మె నేపథ్యంలో ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ జేఏసీ నేతలు సోమవారం విడివిడిగా ప్రధాని మన్మోహన్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని తెలంగాణ అంశంపై గతంలో ఎన్నడూ లేనంత చొరవతో మాట్లాడారు. అదే సమయంలో 'మరింత టైం కావాల'న్న కాంగ్రెస్ అధిష్ఠానం మాటనే ఆయన కూడా వినిపించారు. అంతకు మించి ఏ హామీ ఇవ్వలేదు. దీంతో ప్రధాని నుంచి ఏదో ఒక గట్టి మాట వస్తుందనుకున్న తెలంగాణ నేతల ఆశ నెరవేరలేదు. దాంతో సకల జన సమ్మె కొనసాగుతుందని.. ఈ నెల 9, 10, 11 తేదీల్లో రైల్‌రోకో ఉంటుందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు.
మొదట టి.కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం ప్రధానిని కలిశారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. వారి వాదనను సావధానంగా విన్న ప్రధాని 'కేంద్ర ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో ఉంది' అంటూ నర్మగర్భంగా వారి ఎదుట వ్యాఖ్యనించారు. అంతలోనే... 'మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అస్థిరతకు కారణమైన వాళ్లమవుతాం' అని ఆయన పేర్కొన్నారు. 'తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం ప్రకటించకపోయినా, ఎప్పటిలోగా పరిష్కారం లభిస్తుందో చెప్పండి.
వారమో, నెలో, ఆరు నెలలో.. ఇలా ఎప్పటి లోగా నిర్ణయం తీసుకునే అవకాశముంటే అదే విషయాన్నే ప్రకటించండి'' అని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టినప్పుడు... 'మూడు ప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కోసమే, కాంగ్రెస్ సమయం తీసుకుంటోంది'' అని ప్రధాని చెప్పారు. 'మీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన చేయించి, సకల జనుల సమ్మెను విరమింపజేయాల'ని నేతలు కోరినప్పుడు.. మన్మోహన్ తమ వైఖరిని మరింత విశదపరిచారు. 'గతంలోనూ ఇలాగే ప్రకటనలు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
ఒక ప్రాంతానికి అనుకూలంగా ప్రకటన చేస్తే.. మరొక ప్రాంతంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక సమస్యను పరిష్కరించి మరొక సమస్యను సృష్టించుకోకూడదు' అని ప్రధాని స్పష్టంచేశారు. ఇక సాయంత్రం తెలంగాణ జేఏసీ నేతలు తనను కలసినపుడు కూడా నిర్దిష్టమైన హామీ ఇవ్వడానికి ప్రధాని నిరాకరించారు. సమస్య పరిష్కారానికి సమయం కావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సకల జనుల సమ్మె, తెలంగాణ తక్షణ ఏర్పాటు ఆవశ్యకత, తీసుకోవాల్సిన చర్యల గురించి కోదండరాం తదితరులు వివరిస్తున్నప్పుడు ప్రధాని జోక్యం చేసుకుని... 'మేం ఏమేం చేస్తున్నామో ఈయనకు అన్నీ తెలుసు' అని కేసీఆర్‌ను చూపిస్తూ పేర్కొనడం విశేషం.
జేఏసీ నేతల వాదనను ఆలకిస్తూనే ప్రధాని.. వారికి హితబోధ కూడా చేశారు. 'సమస్యకు పరిష్కారం కావాలంటే మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఎవరూ నష్టపోలేదనే రీతిలో (విన్-విన్ సిచుయేషన్) అది ఉండాలి. ఈ సమస్యపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే, అంతకు ముందు భాగస్వాములు (స్టేక్ హోల్డర్స్) అందరినీ ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేయాలి కదా!'' అని ప్రధాని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రధాని తీరుపై జేఏసీ ఆగ్రహం.. నిరాశలో టి.కాంగ్రెస్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ అంశాన్ని కేంద్రం ఇప్పట్లో పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదన్న అభిప్రాయం జేఏసీ నేతల్లో వ్యక్తమవుతోంది. సమ్మెను మరింత ఉధృతం చేయడం ద్వారానే సర్కారుకు గుణపాఠం నేర్పాలని వారు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఢిల్లీ వచ్చిన కేసీఆర్.. చివరకు రిక్తహస్తాలతోనే తన బృందంతో హస్తిన వదలిపెట్టక తప్పడంలేదు.
సమస్య పరిష్కారం అంత సులభం కాదని, త్వరపడి నిర్ణయించి జాతీయ స్థాయిలో కూడా సమస్యల్ని తె చ్చిపెట్టుకోలేమని కాంగ్రెస్ నేతల బృందానికి ప్రధాని వివరించడంతో.. కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. తెలంగాణపై ఏం జరుగుతుందో అధిష్ఠానం తమను విశ్వాసంలోకి తీసుకొని చెప్పకపోవడం, మరో వైపు తమ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తోచకపోవడం టీ కాంగ్రెస్ నేతలను సైతం అగమ్య గోచర స్థితిలో పడవేసింది.
రాజీనామా చేసి తమతో పాటు ఉద్యమించాలంటూ జేఏసీ నేతలు చే స్తున్న ఒత్తిడిని కాంగ్రెస్ తెలంగాణ నేతలు తట్టుకోలేకపోతున్నారు. రాజీనామాలు చేసే విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలు, విభేదాలు వ్యక్తం కావడంతో గందరగోళం ఏర్పడింది. కేసీఆర్, జేఏసీ చెప్పిన మాటవినాలా? అధిష్ఠానానికి సహకరించాలా? అన్న మీమాంసలో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు ఉన్నారు. నిర్ణయం రానిదే ఢిల్లీ వదలబోమని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఒట్టి చేతులతోనే ఇంటిదారి పట్టవలిసి వస్తోంది.
జైపాల్ ఆవేదన.. ప్రధానితో భేటీ కాగా.. జేఏసీ నేతలు తన ఇంటికి కూడా వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించడం, తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఖిన్నుడయ్యారు. అధిష్ఠానం తమను విశ్వాసంలోకి తీసుకుని ఒక లైన్ ఇస్తే అది తాము అవలంబించేందుకు వీలుంటుందని, తాము కూడా ప్రజలకు ఏమి చెప్పాలో తేల్చుకోలేకపోతున్నామని జైపాల్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది.
అయితే కేసీఆర్ కలిసి వెళ్లిన కొద్దిసేపటికి జైపాల్ కూడా తన మంత్రిత్వ శాఖకు చెందిన విషయాలను చర్చించేందుకు ప్రధానమంత్రిని కలుసుకోవడం గమనార్హం. ఓఎన్జీసీ చైర్మన్, వేదాంత ఒప్పందం తదితర అంశాలతో పాటు తెలంగాణ అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
దసరా అనంతరం సంప్రదింపులు వేగవంతం మరో వైపు తెలంగాణపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఎలాగూ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నందువల్ల ఒత్తిళ్ళకు లొంగకుండా తమ పంథాలో తాము నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దసరా అనంతరం తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కదలికలు ఉంటాయని తెలుస్తోంది.
తమ ప్రక్రియలో భాగంగా సీనియర్ నేతలతో కలిసి రాష్ట్రానికి ఒక బృందాన్ని పంపడం, కాంగ్రెస్ వైఖరిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం వంటి చర్యలు అమలవుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ వర్గాల ప్రకారం దసరా నుంచి దీపావళి లోపే సీడబ్ల్యూసీ సమావేశం, ఆ వెంటనే అఖిల పక్ష సమావేశం జరుగుతాయని తెలుస్తోంది. ఏమైనా రాష్ట్ర రాజకీయ, సామాజిక వ్యవస్థపై కమ్మిన కారు మేఘాలు ఈ నెలాఖరులోపు తొలగిపోతాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

No comments:
Post a Comment