Friday, October 7, 2011




హస్తినలో వేడి
ప్రణబ్ కేంద్రంగా జోరందుకున్న మథనం
రోజంతా చర్చలే చర్చలు.. నేటి సాయంత్రం కోర్ కమిటీ
కిరణ్, రాజనర్సింహ, బొత్స, డీఎస్‌లకు ఢిల్లీ పిలుపు

సమ్మె విరమణ కోరుతూ నేడు కీలక ప్రకటన
వచ్చే వారం సీడబ్ల్యూసీ 23న అఖిలపక్ష భేటీ
రంగంలోకి రాష్ట్ర గవర్నర్
ప్రధాని పిలుపుతో హస్తినకు
ఆ వెంటనే రాష్ట్ర నేతలకు ఢిల్లీ పిలుపు
నేడు మన్మోహన్‌కు నరసింహన్ నివేదిక
మిత్ర పక్షలతోనూ చర్చస్తాం: ప్రధాని
తేల్చడమే మా ఉద్దేశం
చిరంజీవికి రాహుల్ వెల్లడి
ఢిల్లీ పెద్దలకు తెలంగాణ సెగ బాగా తగిలింది. ఇన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసీ చూడనట్లుగా వ్యవహరించిన కాంగ్రెస్ అధిష్ఠానం... ఇప్పుడు తెలంగాణ సమస్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. తమలో తాము చర్చిస్తూ, గవర్నర్ నరసింహన్‌ను సంప్రదిస్తూ, రాష్ట్ర రాజకీయ నాయకత్వంతోనూ చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్‌లకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. ఇక... కోర్ కమిటీ, మినీ కోర్ కమిటీ సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా... కాంగ్రెస్ దిగ్గజం, క్లిష్ట సమస్యల పరిష్కర్తగా పేరున్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కేంద్రంగా ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : దసరా పండుగ పూర్తయిన వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణపై తేల్చడం అంత సులభం కాదన్న కాంగ్రెస్ పెద్ద మనిషి ప్రణబ్ ముఖర్జీ చేతుల్లోనే రాష్ట్ర సమస్యను ఒక కొలిక్కి తీసుకువచ్చే బాధ్యతను పెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో తెలంగాణలో పరిస్థితిపై సమీక్షించారు.

ఈ భేటీలో నిర్దిష్టంగా ఏ నిర్ణయమూ తీసుకోనప్పటికీ, త్వరలో ఈ విషయంపై మిత్రపక్షాలను సంప్రదిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ పార్టీ అ«ధ్యక్షురాలు సోనియాగాంధీతో, మన్మోహన్ సింగ్‌తో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఆ వెంటనే ప్రణబ్ 'మినీ కోర్ కమిటీ'ని సమావేశ పరిచారు. రక్షణ మంత్రి ఆంటోనీ, హోంమంత్రి చిదంబరం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లతో ప్రణబ్ తెలంగాణ అంశంపై చర్చించారు.

తెలంగాణ విషయంలో పార్టీ, ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉండాలనే అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఆ తర్వాత ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. "మా భేటీ అసంపూర్తిగా ముగిసింది. శనివారం కూడా మళ్లీ చర్చి స్తాం'' అని తెలిపారు. మరోవైపు వచ్చే వారం సీడబ్ల్యూ సీ సమావేశం జరుగుతుందని, ఈనెల 23న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

నిరంతరంగా...: తెలంగాణపై గులాంనబీ గతనెల 30న ఆజాద్ నివేదిక సమర్పించినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ ఢిల్లీ పెద్దలు ఈ సమస్యపై దృష్టి సారించడం గమనార్హం. ఆజాద్ నివేదిక అందించిన రోజు సాయంత్రమే కోర్ కమిటీ సమావేశం జరిగింది. దీనిపై నిర్దిష్ట చర్యలను ప్రతిపాదిస్తూ నివేదిక అందించే బాధ్యతను మేడమ్ సోనియా ప్రణబ్‌కు అప్పగించారు. దీంతో... మర్నాడు ప్రణబ్ తన కోల్‌కతా పర్యటనను కూడా వాయిదా వేసుకుని మినీ కోర్ కమిటీ సమావేశం జరిపారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఆజాద్ మళ్లీ ఓ నివేదిక తయారు చేసి మంగళ, బుధవారాల్లో సోనియాగాంధీతో సమాశమయ్యారు. అంతకుముందు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోనూ చర్చలు జరిపారు. మరోవైపు ప్రధాని మన్మోహన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో జేఏసీ నేతలను, కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలను వేర్వేరుగా కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వీటన్నింటి నేపథ్యంలో త్వరలోనే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం అటో ఇటో తేల్చేయడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. శుక్రవారం చిరంజీవి కలుసుకున్నప్పుడు సోనియా తనయుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని ఆయనకు తేటతెల్లం చేసినట్లు తెలుస్తోంది. 'పెద్దలందరూ తెలంగాణపైనే సమాలోచనలు జరుపుతున్నారు. సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. త్వరలో ఈ విషయంపై తేల్చాలన్నదే మా ఉద్దేశం' అని రాహుల్ ఆయనకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'ఆ నలుగురి' రాక...: తెలంగాణ అంశంపై తర్జన భర్జనలు పడుతున్న కేంద్రం... ఇదే అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తోనూ చర్చలు మొదలుపెట్టింది. ప్రధాని పిలుపు మేరకు నరసింహన్ శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ప్రధానితో భేటీ కానున్నారు. గవర్నర్ ఇప్పటికే రాష్ట్ర పోలీసు అధికారులతో చర్చించి ఒక నివేదికను రూపొందించినట్లు తెలిసింది.

ప్రస్తుత ప్రతిష్టంభన తొలగిపోయేందుకు ఆయన అయిదారు ప్రతిపాదనలు చేసినట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రపతి పాలన విధించడం మాత్రం ఆయన ఉద్దేశం కాదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని నరసింహన్ ప్రధానికి చెప్పనున్నట్లు తెలిసింది. కాగా, నరసింహన్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై శనివారం జరిగే కోర్ కమిటీలో చర్చించే అవకాశాలున్నాయి.

శనివారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు పీసీసీ చీఫ్ బొత్స, మాజీ చీఫ్ డీఎస్‌లతోనూ కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు చర్చించనున్నారు. మొత్తంగా చూస్తే... రాష్ట్ర విభజనపై కేంద్రం వైఖరి ఏమిటో ఈ నెలాఖరులోనే తెలిసిపోతుందని ఢిల్లీలో పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణపై తాము పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించామని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నందన సకల జనుల సమ్మె విరమించాలని శనివారం కేంద్రం నుంచి ఒక అభ్యర్థన వెలువడే అవకాశం కూడా ఉంది.

ఢిల్లీ పిలిచింది
హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్లిన మరుక్షణమే... రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌లకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు వీలుగా శనివారం మధ్యాహ్నంలోపు ఢిల్లీలో అందుబాటులో ఉండాలంటూ సమాచారం అందింది.

శుక్ర, శనివారాల్లో అధిష్ఠానం నుంచి సీఎం కిరణ్‌కు పిలుపు వస్తుందంటూ 'ఆంధ్రజ్యోతి' ఇదివరకే చెప్పింది. కాగా.. శుక్రవారం కిరణ్ కుమార్ రెడ్డి, విజయనగరం జిల్లా పర్యటనలో సత్తిబాబు, హైదరాబాద్‌లో రాజనరసింహ, నిజామాబాద్‌లో ఉన్న డీఎస్‌లతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ మాట్లాడారు.

శనివారం మధ్యాహ్నానికి ఢిల్లీకి రావాలని ఆదేశించారు. కిరణ్ ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలు దేరుతున్నారు. బొత్స విశాఖ నుంచే ఢిల్లీకి వెళ్తుండగా... రాజనరసింహ, డీఎస్‌లు మధ్యాహ్నంలోపు దేశ రాజధాని చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సకల జనుల సమ్మెతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు వీలుగానే వారిని అధిష్ఠానం పిలిచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం వరుస చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే సీఎంతో సహా నలుగురు ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి పిలుపు అందడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా సీన్ ఢిల్లీకి మారినట్లయింది. అందరి చూపు అటువైపే ఉంది. ఢిల్లీలో శనివారం జరిగే కీలక చర్చలేమిటో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.



‘పట్టా’లెక్కిన యుద్ధం
rails(సూర్య ప్రధాన ప్రతినిధి)తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే లక్ష్యం లో భాగంగా జేఏసీ ఇచ్చిన రైల్‌రోకో యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో 12, 13, 14వ తేదీల్లో జరిగే రైల్‌రోకోను విజయ వంతం చేయాలని జాక్‌ భావిస్తోంది. ఇటీవల జరి గిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా మూడురోజుల పాటు రైళ్లను యధావిధిగా నడపా లని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు విభాగం పట్టుదలతో ఉన్నాయి. అటు పోలీసులు, ఇటు జాక్‌ రైల్‌ రోకోను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ముందుగానే యుద్ధ వాతావరణం నెలకొనడం ఉత్కంఠ రేకిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కాంక్ష, సెగ కేంద్రానికి తాకాలంటే కేంద్ర ప్రభుత్వ ఆదా యానికి గండి కొట్టడం, కేంద్ర సర్వీసులను నిలిపి వేయడం ఒక్కటే మార్గంగా భావిస్తున్న జాక్‌.. అందులో భాగంగా రైల్‌రోకోను ఎన్నుకుంది.


టీవల జరిగిన రైల్‌రోకో వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు, బస్సులు కూడా బందయి పోవడంతో ప్రభుత్వం విఫలమయిందన్న భావన విస్తృతం కాకుండా, రైల్‌రోకో వల్ల ప్రజలు ఇబ్బం దులు పడకుండా పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అటు పోలీసులు, ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప సైతం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులతో రైళ్లు నడిపిస్తామని స్పష్టం చేయడం ద్వారా.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రైల్‌రోకోను ఏ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో స్పష్టమవుతోంది.


కాగా.. తాము రైల్వేకి పూర్తి రక్షణగా నిలుస్తామని, అడ్డంకులను తొలగిస్తామని ముఖ్యమంత్రి, డీజీపీ హామీ ఇచ్చారు. ప్రయాణీకుల రక్షణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవలి కాలంలో సీరియస్‌గానే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా.. డీజీపీ దినేష్‌రెడ్డి రైల్‌రోకో సందర్భంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రైళ్లను గమ్యం చేర్చే అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన జిల్లా ఎస్పీలు, ఐజీలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కోదాడ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, రైళ్లను అడ్డుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రైళ్లకు ముందు పైలెట్‌ రైళ్లను వినియోగిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పట్టాల వద్ద గట్టి నిఘా ఉంచనున్నారు.


ఉద్రిక్తతకు కారణమయ్యే నేతలను ముందుగానే అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక రకంగా దీనిని దినేష్‌రెడ్డి సవాలుగా తీసుకుంటున్నారు. ఆయన డీ జీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో శాంతిభ ద్రతలు అదుపులోకి వచ్చాయి. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో హింస చోటుచేసుకునే అవకాశం ఉన్నందున, విధ్వంసకారులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగవ ద్దని దినేష్‌రెడ్డి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.





ఇక కీలక నిర్ణయం!
హస్తినలో హడావుడి..
రాష్ట్రపతి పాలన దిశగా పావులు
సోనియా, మన్మోహన్‌లతో విడివిడిగా చర్చించిన ప్రణబ్‌ముఖర్జీ
ఆ వెంటనే ఆంటోనీ, చిదంబరం, ఆజాద్, అహ్మద్‌లతో మంతనాలు
రాష్ట్రంలో ‘చేయి’ దాటిన పరిస్థితిని చక్కదిద్దటంపై తర్జనభర్జనలు
శాసనసభను ఆరు నెలలు సుప్తచేతనావస్థలో ఉంచటంపై మొగ్గు!
సాధారణ స్థితి వచ్చే వరకూ రాష్ట్రంలో కేంద్ర పాలన యోచన
ముఖ్యమంత్రిని మార్చే అంశంపైనా జోరుగా ఊహాగానాలు
ప్రధానమంత్రి పిలుపుతో శుక్రవారమే ఢిల్లీ చేరుకున్న గవర్నర్
నేడు మన్మోహన్‌తో భేటీ.. రాష్ట్ర పరిస్థితిపై నివేదిక సమర్పణ!
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లకూ ఢిల్లీ నుంచి పిలుపు..
నేడు బయల్దేరి వెళ్లనున్న ముగ్గురు నేతలు
ఒకటి, రెండు రోజుల్లో ‘కీలక నిర్ణయం’ ప్రకటించనున్న కేంద్రం
తెలంగాణలో ‘సమ్మె’ విరమించాలని విజ్ఞప్తి చేసే అవకాశం

న్యూఢిల్లీ/హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ కోసం గత 25 రోజులుగా తీవ్రస్థాయిలో జరుగుతున్న సకల జనుల సమ్మె మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో.. ఈ సమస్యను అధిగమించేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీకి చెందిన ఉద్ధండులు శుక్రవారం పలు దఫాలుగా సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దటం, దానికి అవసరమైన చర్యలు చేపట్టటమన్న రెండు అంశాల చుట్టూ వీరి చర్చలు సాగాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. అనంతరం పార్టీ కోర్ కమిటీ నేతలు సమావేశమై తర్జనభర్జనలుపడ్డారు. తెలంగాణ అంశాన్ని రాజకీయ కోణంలో సుదీర్ఘంగా విశ్లేషించుకున్న తర్వాత.. ‘చేయి దాటిన’ పరిస్థితులను చక్కదిద్దటానికి అవసరమైతే ‘కఠిన నిర్ణయాలు’ తీసుకునే అంశంపైనా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలిసింది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దటమన్న ఎజెండాతో రాష్ట్ర శాసనసభను ఆరు నెలల పాటు సుప్తచేతనావస్థలో పెట్టటంపై ఢిల్లీ పెద్దలు సమాలోచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిన కారణంగా ప్రస్తుత దశలో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టి.. రాష్ట్రపతి పాలన విధించటం వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో.. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ప్రధానిని కలిసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించటంతో పాటు ఒక నివేదికను కూడా ఇవ్వనున్నారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా.. వెంటనే ఢిల్లీ రావాలంటూ శుక్రవారం రాత్రే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. వారు ముగ్గురూ శనివారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ‘కీలక నిర్ణయం’ ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే.. సమస్య పరిష్కారానికి తాము చర్యలు ప్రారంభిస్తామని, దానికి ముందుగా సమ్మెలు, ఆందోళనలు విరమించాలని.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, తెలంగాణవాదులకు కేంద్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని సమాచారం.

ప్రణబ్ చర్చోపచర్చలు...

దసరా పండుగను పురస్కరించుకుని గత ఐదు రోజుల పాటు పశ్చిమబెంగాల్‌లోని స్వస్థలంలో ఉన్న ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఢిల్లీ చేరుకోగానే సాయంత్రం ఆరు గంటలకు నేరుగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లారు. అర గంట పాటు జరిగిన భేటీలో సోనియాతో పలు అంశాలను చర్చించినప్పటికీ అందులో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. సోనియాతో భేటీ అనంతరం ప్రణబ్ నేరుగా ప్రధానమంత్రి నివాసం ‘7 రేస్‌కోర్స్ రోడ్’కు వెళ్లి మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. సోనియాతో చర్చించిన అంశాలు, ఆమె ఇచ్చిన సూచనలపై ప్రధానితో మాట్లాడారు. ప్రధానితో భేటీ ముగిశాక నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయానికి తిరిగివచ్చారు. ఆయన వచ్చేసరికే కోర్ కమిటీలో సహ సభ్యులైన సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, హోంమంత్రి చిదంబరం, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ అక్కడ వేచి చూస్తున్నారు.

ప్రణబ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ కూడా చేరుకున్నారు. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దటం, తెలంగాణ సమస్యను పరిష్కరించటం, రాష్ట్రపతి పాలన విధించటం వంటి అంశాలపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఎలాంటి చర్యలు చేపడితే జనజీవనం సాధారణ స్థితికి వస్తుందనే అంశంపైనే కాంగ్రెస్ పెద్దలు ఎక్కువసేపు మాట్లాడుకున్నట్లు చెప్తున్నారు. రాష్ట్ర విభజనపై తీసుకునే ఏ నిర్ణయమైనా రాజకీయంగా కాంగ్రెస్‌కు నష్టం తప్పదన్న భావనకు వచ్చిన కారణంగానే రాష్ట్రపతి పాలన విధించటంపై తీవ్రస్థాయిలో తర్జనభర్జనలు సాగినట్లు తెలిసింది. రాష్ట్రపతి పాలన విధిస్తే తద్వారా జరగబోయే పరిణామాలు, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులను కూడా కేంద్ర నాయకులు విశ్లేషించుకున్నారని సమాచారం.

ప్రణబ్ కార్యాలయంలో జరిగిన భేటీలో పాల్గొన్న చిదంబరం, ఆంటోనీ, ఆజాద్ ముందుగా బయటకు రాగా అహ్మద్‌పటేల్ లోపలే ఉండి ప్రణబ్‌తో మరికొంతసేపు చర్చలు జరిపారు. పరిస్థితిని చక్కదిద్దటానికి అగ్రనేతల్లో ఎవరైనా రాష్ట్రానికి వెళితే ఎలా ఉంటుందనే అంశంపై వారిద్దరూ మాట్లాడుకున్నట్లు చెప్తున్నారు. పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు, సంబంధిత పక్షాలతో మాట్లాడేందుకు ప్రణబ్ రాష్ట్రంలో పర్యటించనున్నారని మరోవైపు వార్తలు వచ్చాయి. దీన్ని ప్రణబ్ తరఫున ఎవరూ ధ్రువీకరించకున్నా పరిస్థితి చేయిదాటేలా ఉన్నట్లయితే ఎవరో ఒకరు తప్పకుండా రాష్ట్రానికి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులు, పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ జరిపిన చర్చల సారాంశం వంటి అనేక నివేదికలను సమగ్రంగా పరిశీలించిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయం తీసుకునే చివరి ఘట్టానికి వచ్చారని ఏఐసీసీలోని సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం జరగాల్సివున్నా.. అనివార్య కారణాల రీత్యా అది వాయిదా పడిందని ఏఐసీసీ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశం తిరిగి ఎప్పుడు జరిగేది తెలియరాలేదు.

అసంపూర్తిగా ముగిశాయి: ఆజాద్

ప్రణబ్‌తో సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై చర్చించామని, చర్చ అసంపూర్తిగా ముగిసిందని.. భేటీ తర్వాత ఆజాద్ విలేకరులతో పేర్కొన్నారు. ‘‘ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్, చిదంబరం, ఆంటోనీ, నేను కలిసి 45 నిమిషాలపాటు చర్చించాం. సమావేశం అసంపూర్తిగా మిగిలింది. రేపు (శనివారం) మళ్లీ మేం కలవవచ్చు’’ అని వివరించారు. తెలంగాణలో సమ్మెతో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కదా? అని ప్రశ్నించగా.. ‘‘అందుకోసమే కదా మేం ఇక్కడ సమావేశమయ్యాం’’ అని ఆజాద్ స్పందించారు. రాష్ట్రానికి ఏదైనా బృందాన్ని పంపిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆజాద్ సమాధానం దాటవేశారు.

నేడు ఢిల్లీకి కిరణ్, దామోదర, బొత్స

హస్తిన నుంచి పిలుపు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ రావాలని ఏ క్షణమైనా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆదేశాలు రావచ్చిన ఎదురుచూసిన ముఖ్యమంత్రి సకల జనుల సమ్మెపై రోజువారీగా జరుపుతున్న సమీక్షా సమావేశాన్ని కూడా శుక్రవారం నిర్వహించలేదు. శుక్రవారం కాంగ్రెస్ మహామహులు ఈ అంశంపై పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరమే ముఖ్యమంత్రిని అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా శనివారం ఉదయం విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రిని మారుస్తారా?

రాష్ట్ర శాసనసభను ఆరు నెలలు సుప్తచేతనావస్థలో పెట్టి రాష్ట్రపతి పాలన విధించటమన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో ప్రధానాంశంగా కనిపిస్తోంది. ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవటమేగాక.. పాలనాపరంగా, శాంతిభద్రతల విషయంలోనూ చేతులెత్తేసే పరిస్థితులు ఏర్పడుతుండటంతో ఈ నిర్ణయానికి వస్తున్నట్లు చెప్తున్నారు. ఆరు నెలల్లో పరిస్థితిని చక్కదిద్ది ఆ తర్వాత తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని సీఎం చేయటమా? అనే దిశగా కూడా ఢిల్లీలో ఆలోచనలు సాగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పెద్దలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు వారితో సన్నిహితంగా ఉండే రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. రాష్ట్రపతి పాలనతోపాటు రాష్ట్ర విభజన అనివార్యమనే పరిస్థితే వస్తే హైదరాబాద్‌ను దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ రెండు రాష్ట్రాలను ప్రకటించటం.. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు రాష్ట్రాలను ఏర్పాటుచేయటమన్న అంశాలను కేంద్ర నాయకత్వం ఇదివరకే పరిశీలించింది. ఈ ప్రత్యామ్నాయాలు ఆచరణకు వీలుకాని పక్షంలో రాష్ట్రాన్ని యథతథంగా ఉంచుతూనే తెలంగాణ కోసం (డార్జిలింగ్ తరహాలో) ప్రత్యేక అధికారాలతో కూడిన ఒక ప్యాకేజీని ప్రకటించటంపై కూడా చర్చించింది.

సీడబ్ల్యూసీ భేటీతో పాటు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి చిన్న రాష్ట్రాలపై ఏర్పాటుపై సమగ్రంగా చర్చించి ఒక అవగాహనకు రావటం.. దానిపై కాలపరిమితితో కూడిన రెండో ఎస్‌ఆర్‌సీ వేయటం తదితర చర్యలపైనా చర్చించింది. ఏదేమైనా.. తన రాజకీయ ప్రయోజనాలను ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకున్న తర్వాతే కాంగ్రెస్ ప్రకటన ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాలంటే రాష్ట్రపతి పాలన ద్వారా తానే రంగంలోకి దిగాలన్న అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు వారు స్పష్టం చేస్తున్నారు.

అటు టీఆర్‌ఎస్‌-జాక్‌ సైతం రైల్‌రోకోను ప్రతిష్ఠగా తీసుకుంటోంది. పోలీసులు మూడు అంచెల వ్యూహం అవలంబిస్తే తాము ఆరంచెల వ్యూహం అనుసరిస్తామని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేయడం గమనార్హం. దానికితోడు.. రైల్‌రోకోను అడ్డుకుంటే కోదాడలో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయని, తమను రెచ్చగొట్టవద్దని హరీష్‌, కోదండరామిరెడ్డి హెచ్చరించారు. కోదాడలో జరిగిన ఘటన కావాలని చేసింది కాదని, యాదృచ్ఛికంగా జరిగిందని కోదండరామరెడ్డి గతంలో ప్రకటించిన విషయం ప్రస్తావనార్హం. దీన్ని బట్టి రైల్‌రోకో సందర్భంగా ఘర్షణ అనివార్యమని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ రైళ్లపైనే కేంద్రీకృతమయింది.

No comments:

Post a Comment