జనం గుండె చప్పుడు జాలాది
నిన్నటిదాకా యిజాల గురించి రాసి భుజాలు తట్టి లేపావు. ఇవ్వాళ నువ్వు లేవన్న నిజం తెలిపి నిశ్చేష్టుల్ని చేశావు. లోకంలో చూసిందే రాశానన్నావు, రాసిందే మళ్లీ మళ్లీ చూస్తున్నానన్నావు, లోకం శోకాన్ని గరళంగా మింగి అపర శివుడయ్యావు... నేను శవాన్ని కాదు, శివాన్నని ఎన్నిసార్లన్నావు? కూత నేర్చిన కోకిళ్లు కలవారి వాకిళ్లలో కచేరీలు చేస్తుంటే, 'అనేకులం'దర్ని ఏకం చేసేందుకు 'ఆకలి' కాకులచేత లోకంలోని శోకాన్నంతా పాడించావు.
ఆ కాకుల పాటే వేకువ బాటని నిరూపించావు. కుటిలత్వం చిగుళ్లు యేసిన కోకిళ్లు ఎన్నయితేనేమి? విశాలతత్వం నినదించే కాకుల 'హోరు' ముందు అవి కూని రాగాలేగా? ఎన్ని ఎత్తు పల్లాల్ని చూశావు తాతా? ఎన్ని రాజకీయాల్ని ఎదుర్కొన్నావు తాతా? 'శ్రాస్తో'క్తంగా పన్నుతున్న ఎన్నో వ్యూహాల్ని ఛేదించుకుంటూ, 'మూర్తీ'భవించిన మూర్ఖత్వపు వలయాల్ని అవలీలగా దాటుకుంటూ, ఎన్ని ఒడుదుడుకుల్ని అధిగమించావు? ఎంత నైరాశ్యాన్ని దిగమింగేశావు..? కలిసిరాని కాలాన్ని కాలికింద చెప్పుగా జమ కట్టావు. 'కాలం నా కాలి చెప్పు.. కాదంటే ఈ గమనమే తప్పు' అన్నావు.
ఎంత ఆత్మాభిమానం! కాలం నీతో నడుస్తోంటే "ఈ కాలం పది కాలాలు ఉండాలని'' ఒడిసి పట్టావు. జానపదులు కానిదే జ్ఞాన పదులు కాలేరని నువ్వన్న మాటలు అక్షర లక్షలు. అన్నదాన్నే అక్షరాలా నిరూపించావు. జనం పాటలే రాసి ఆ జనం గుండెల్లో గూడు కట్టుకున్నావు. ఆ గుండె చప్పుళ్లనే తత్వాలుగా రాసి నీ'తత్వాన్ని' నిరూపించుకున్నావు. 'ఆరేసుకోబోయి పారేసుకున్నది' పాటవుతున్నప్పుడు ఆ'రేసు'లో ఓడినా పర్వాలేదనుకుని... వాసి-రాసిల మధ్య తేడాని తెలుసుకున్నావు. అదను చూసి, కలాన్ని పదును చేశావు. పనికొచ్చే పాటల పుస్తకంలో ముందస్తు నిలుచున్నావు. ప్రపంచీకరణ భూతం సాహితీ, సంస్కృతుల్ని సైతం కబళించి వేస్తున్న తరుణంలోనూ నువ్వు నీ మార్గం వీడలేదు.
మారిపోతున్న జ్ఞానపదుల్ని, జారిపోతున్న జానపదాల్ని 'ఏతమేసి తోడేశావు''.. పొగిలి పోతున్న దుఃఖమూ, పొంతనిండుతున్న శోకమే "ప్రాణం ఖరీదు'' అని పాడుకున్నావు. బడుగు బతుకుల ఆవేదనలను ఖరీదు చేసే నవాబు అయ్యావు. అభాగ్యులందరి ఆకలి కేకలకు జవాబూ నువ్వే అయ్యావు.. బడిపంతులై...బోర్డు మీద బొమ్మలు గీస్తున్నప్పుడు వంకరగా అగుపించిన సాహితీ ప్రపంచ పటాన్ని సరిచేద్దామని కాబోలు మద్రాసు మెయిలెక్కావు. ఆ బతుకు బండికి "సిగ్నెలిచ్చే దేవుడు.. దిగెళ్లిపోయే జీవుడి''పై పక్షపాతం చూపిస్తే ఉలిదెబ్బలు వేయించి కక్ష తీర్చుకున్నావు''.
శిక్షవేశానన్నావు.. ఎంత గడుసు పిండానివి తాతా.. ఎంత మొండి ఘటానివి? ఎందుకు తాతా అమ్మతల్లులంటే అంత ప్రాణం నీకు? నాటి మనువు ధర్మసూత్రాలు నేటి మనువులో మంగళ సూత్రాలై ఎగ'తాళి' చేస్తున్నప్పుడు, పసుపుతాడు పలుపుతాడై ఉరి బిగిస్తున్నప్పుడు పురుడు పోసిన నేరానికి గరళాన్ని కక్కుతున్నప్పుడు.. నీ వేదన నివేదన అయింది. అక్క సెల్లెళ్ల ఆవేదనల్ని ఆసాంతం మింగేసింది.
నీ కలం ఎన్ని మలుపులు తిరిగింది తాతా..ఎన్ని ఆశల్ని పోగేసుకుంది. ఎన్ని ఆశయాల్ని పొదివి పట్టుకుంది? ఉద్యమాల ఉనికిని కొందరు పనికట్టుకుని ప్రశ్నిస్తున్నప్పుడు ఎర్రదనం పిడికిళ్ల బిగువు సడులుతున్నదన్నప్పుడు నీతిలేని జాతి బొమ్మను నిలదీసి అడిగావు... ఎర్ర బావుటాను ఎగరేసి కదిలావు.. కర్తవ్యం ఫిరంగుల్ని గురిచూసి వదిలావు. గురువు అన్న పదానికి పరువు తగ్గి ఉత్తుత్తి ఉద్యమాల నెత్తుటిలో విద్య తడిసిపోతుంటే ఆకాశాన్ని "ఎర్రగా ఏడ్పించడం'' నీకు చేతనయింది.
మార్పులేని తూర్పు వాకిల్లోంచి దురదృష్టాన్ని చూస్తూ ఎన్ని అవస్థల్ని మోశావు? నీ ప్రయత్నం వృధా పోదు తాతా... నీ లక్ష్యం ఓడిపోదు.. నువ్వు నాటిన విత్తులు బీళ్లను చీల్చుకుని మొక్కలై లేస్తాయి.. నువు కోరుకున్న ఎర్రమందారాల్ని పూస్తాయి.. "కన్ను తెరిస్తే ఉయ్యాలా..కన్ను మూస్తే మొయ్యాలా'' అని బతుకు నిఘంటువులో జీవితార్థాన్ని ఇంత చి(చ)క్కగా చెప్పిన మహా మనిషివి నువ్వే తాతా..."చిటికనేళ్లు కలిస్తే కల్యాణం-బొటన వేళ్లు కలిస్తే నిర్యాణం'' ఏ వాల్మీకికి చెప్పాలనుకున్నావు ఈ జీవన సూత్రాల్ని? ఏ వ్యాసుడికి తెలపాలనుకున్నావు ఈ బతుకు మర్మాన్ని? ఎందుకు తాతా గాడిద బరువు గ్రంథాలు? ...నువు రాసిన నాలుగు పా(మా)టలు చాలవూ జీవిత సారం తెలియడానికి? శంభూకుణ్ణి ఆరాధించావు.. బొటన వేలు దక్షిణ అడిగిన గురుతరాన్ని నిలదీశావు.. నీ పద్ధతే వేరు తాతా.. నీకు మద్దతు మేమంతా.. అది సరే.. పై వాడెవడో జెండా ఊపేస్తే అర్ధాంతరంగా బండెక్కేస్తావా? నువ్వు మిగిల్చిన ఎజెండా సంగతేంటి? నిజమేలే.. నీకు మృత్యువెక్కడిది? మరణానికి సైతం మరణ శిక్ష వేయగల లక్ష్యసాధకుడివి నీవు... కలాన్ని అమ్ముకుని అక్షరాలతో లక్షలు సంపాదిస్తున్న కవులున్న లోకంలో... కాలాన్ని నమ్ముకుని లక్ష్యాన్ని సాధించిన నీ జన్మ ధన్యం తాతా.. నువు చిరంజీవివే తాతా.. ఎనిమిది పదుల వార్థక్యం నిను ఓడించినా.. ఓటమెరుగని యోధుడు నీవు.. సామాన్యుల గుండెల్లో 'ఆది'వి నువ్వు.. నిఖిలలోకం నిండు దుఃఖం వర్షిస్తున్న 'జ్వాలాది'వి నువ్వు... చిరంజీవి జాలాదివి నువ్వు.
నిండు నీళ్ల కళ్లతో... పొగిలిపొగిలి రగిలే.. నీ మనవడు
- 'బాబి'
(ఆచార్య బాబివర్ధన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం)

No comments:
Post a Comment