Monday, October 24, 2011


ఇక దీక్షలే!
Telangana-copyహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం... ఆంధ్రప్రదేశ్‌ ఆవతరణ దినోత్సవం రోజు నే ఎవరికి వారే నిరవధికదీక్షలు చేపట్టాలని నిర్ణయించుకు న్నారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఉద్యమిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ, తెలంగాణవాదాన్ని తమ భుజస్కంధాలపైనే మోస్తున్నామంటున్న టీఆర్‌ఎస్‌, మంత్రి పదవీకి రాజీనామా చేసి తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి .... ఇలా ఎవరికి వారే నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దీక్ష చేస్తామంటూ ప్రక టించారు.

సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి న్యూఢిల్లీ వేదికగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ సాధించుకోవాలంటే ఉద్యమించాల్సింది ఇక్కడ కాదు...ఢిల్లీలో అంటున్నారు. కేంద్ర ప్రభు త్వం ఢిల్లీలో ఉందని, అందుకే ఢిల్లీలో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు బాపూజీ తెలిపారు. కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు తాను నిరవధికదీక్షను చేపడు తున్నట్లు ప్రకటించారు. సకల జనులసమ్మె నుంచి కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు వైదొలగడంతో ఉద్యమం పని అయిపోయిందనే వాదనలు వినిపి స్తున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీలో నిరవధికదీక్ష చేపట్టడం కేంద్రంపై ఒత్తిడిని పెంచడంతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని మరింత వేడెక్కించ వచ్చునని ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశిస్తు న్నారు.

సకలజనులసమ్మె విరమణలో టీఆర్‌ఎస్‌కు ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలవరం టెండర్ల కేటాయింపులో పార్టీ ప్రమేయంపై వెల్లువెత్తుతున్న విమర్శలతో ఒక్కసారిగా ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిందని వ్యాఖ్యనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి ఇందిరాపార్కు వద్ద నిరవధి కదీక్షలను చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమంపై తిరిగి పట్టు సాధించాలంటే ఇంతకంటే మించిన మరో ప్రత్యామ్నాయం లేదని టీఆర్‌ఎస్‌ నాయ కత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టీ-రాజకీయ జేఏసీ నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధులతో 72 గంటల పాటు నిరవధిక దీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సోమ వారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ అధినేతతో భేటీ అయిన ఆ పార్టీ శాసనసభ్యులు నిరవధికదీక్షలు కాదు అవసరమైతే ఆమరణ నిరహారదీక్ష చేపడు తామని ప్రతిపాదించినట్లు సమాచారం. ఉద్య మాన్ని మరోసారి వేడెక్కించాలంటే కేసీఆర్‌ ఆమర ణానికి దిగితే బాగుంటుందన్న ప్రతిపాదనలు సమావేశంలో వచ్చినట్లు తెలుస్తోంది.

పోలవరం టెండర్ల కేటాయింపులో పార్టీ ప్రమేయంపై వెల్లు వెత్తుతున్న విమర్శల తిప్పికొట్టేందుకు టెండర్లను రద్దు చేయండంటూ ముఖ్యమంత్రికి కేసీఆర్‌ ఆదివారం నాడు లేఖ రాయడం మంచిదయిందని సమావేశంలో పలువురు అభిప్రాయపడినట్లు తెలి సింది. సమ్మెను ఉద్యోగ సంఘాలు మరింతో కాలం కొనసాగించే అవకాశాలు లేకపోవడంతో ఉద్య మాన్ని పార్టీ భుజాలకెత్తుకోవడమే శ్రేయస్కరమని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు తెలిసింది.

దీనితో నిరవధికదీక్షలు కాకుండా టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులంతా అమరణ నిరహారదీక్షలు దిగడమే మంచిదనే అభిప్రాయాన్ని మెజార్టీ సభ్యులు వ్యక్తం చేశారంటు న్నారు. అసరమైతే కేసీఆర్‌ ఆమరణ నిరహారదీక్ష చేపడితే ఉద్యమాన్ని మరింత వేడెక్కించవచ్చునని, కేసీఆర్‌ ఆమరణానికి దిగితే సమ్మె విరమణ, పోలవరం టెండర్ల వ్యవహారాన్ని ప్రజలు మర్చి పోయి ఉద్యమంలో మనతో కలిసి వస్తారంటూ పలువురు శాసనసభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నల్గొండ పట్ణణ కేంద్రంలో నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి దీక్షకు దిగుతానంటున్న ప్రకటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల దూకుడును పెంచారు. అక్టోబర్‌ రెండవ తేదీనే అమరణ నిరహారదీక్ష చేస్తానంటూ ప్రకటిం చిన మాజీ మంత్రి ఎందుకో తెలియదు కానీ నిరహారదీక్ష చేపట్టలేకపోయారు.

ఇప్పుడు తాను దీక్ష దిగడం ఖాయమంటున్నారు. జిల్లాకు చెందిన మరో మంత్రి జానారెడ్డికి మంత్రివర్గంలో లభిస్తున్న ప్రాధాన్యత తనకు లభించకపోవడం, ప్రాధా న్యతలేని మంత్రిత్వశాఖను కేటాయించడంతో అసంతృప్తితో మంత్రి పదవీకి కోమటిరెడ్డి రాజీ నామా చేశారే తప్పిస్తే తెలంగాణ కోసం కాదంటూ ఆయన ప్రత్యర్థులు విరుచుకు పడుతున్నారు. వైఎస్‌ హయాంలో ఏ ఒక్కనాడు తెలంగాణ గురించి మాట్లాడని కోమటిరెడ్డి, ఇప్పుడు ఉద్యమంలో అన్ని తానే అన్నట్లుగా వ్యవహరిం చడం వెనుక జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనే తాపత్రయమే కనిపి స్తోందని, ప్రత్యేక రాష్ర్ట సాధన కోసం ఉద్యమిస్తు న్నట్లుగా కనిపించడం లేదంటున్నారు. సీనియర్‌ మంత్రి జానారెడ్డిని జిల్లాలో ఇబ్బందులకు గురిచే యడానికి ఆయన వ్యూహాత్మకంగా దీక్షకు దిగు తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.

నవంబర్‌ ఒకటి నుంచి తెలంగాణ కోసం దీక్షలు చేస్తామంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కిస్తామంటూ దీక్షలకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో దీక్ష చేసేవారిని ప్రజలు స్వాగతిస్తారని, కేవలం రాజకీయ ప్రయో జనాల కోసం ఉద్యమ ముసుగు తగిలించుకు నేవారిని సరైనరీతిలో బుద్ధి చెబుతారన్నారు.

No comments:

Post a Comment