Wednesday, September 14, 2011


హైందవోజ్జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము - VIjayaVipanchi



హైందవోజ్జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము
ధర్మరక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము  || హైందవో ||

భావదాస్యపు నిశలు తొలిగె స్వాభిమానం ఎదను పొంగె
మానసమ్మున మాతృభక్తి జీవనదిలా పొంగి పొరలె
వీర శివ రాణా ప్రతాపుల ధీర విక్రమ స్ఫూర్తితో
పరమ వైభవ లక్ష్యసాధన యజ్ఞ పూర్తికి కదలుదాం || హైందవో ||

స్వావలంబన మరువ తగదు స్వార్ధపరులై మసలరాదు
జనశ్రేయము కడ్డు తగిలెడు నినాదాలను నమ్మతగదు
పరమ పావన స్వదేశీ మంత్రమ్ము నిత్యమూ స్మరణ చేస్తూ
స్వాభిమాన స్వతంత్ర సర్వశ్రేష్ఠ జీవన సాధనముతో  || హైందవో ||

విషపు నాగులు కాటువేయగ అదను కొరకై పొంచియున్నవి
వంచకుల విద్రోహ చర్యలు కంటకములై నిలచియున్నవి
తల్లి భారతి ఋణము తీర్చే  తరుణ మిదియని మదిని తలచి
రాష్ట్ర సేవా యజ్ఞవేదిని జీవితమ్మును సమిధ చేయగ || హైందవో ||

No comments:

Post a Comment