Wednesday, September 14, 2011


మన చరిత్రను తెలుసుకుందాం !


మణి కలం నుండి  
ధారావాహికం  - 8 వ భాగం 
-----------------------------------------------------------------------------------
ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచినా విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?  తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.
-----------------------------------------------------------------------------------

జయచంద్రుడి పతనం :
పృథ్వీరాజు పరాజయం భారతదేసపు చరిత్రనే మార్చివేసిన ఘట్టం. పృథ్వీరాజు ఫై ఈర్ష్య, శత్రుత్వం వహించి ఉన్న కన్యాకుబ్జ పాలకుడు జయచంద్రుడు అతడి పతనానికి సంతోషించి తన రాజ్యంలో ఉత్సవాలు జరిపించాడు. కానీ ఆ మరుసటి సంవత్సరమే ఘోరీ మహమ్మదు కన్యకుబ్జం ఫై కూడా దాడి చేసి జయచంద్రుదినీ వోడించాడు. ఆ రాజ్యంలో ఉన్న పవిత్ర కసి క్షేత్రంలోని వందలాది దేవాలయాలను కూలగొట్టించాడు. తరువాత ఘోరీ మహమ్మదు తన బానిస, సేనాపతి అయిన కుతుబుద్దీన్ ఐబక్ ను డిల్లీ రాజ్య పాలకునిగా నియమించి వెళ్ళాడు.  
కేవలం 200 మంది :
1192 లో భక్తియార్ ఖిల్జీ అనే ముస్లిం వ్యక్తి 200 మంది ముసలి సైనికులను పోగు చేసుకుని హిందువుల పై ద్వేషంతో బీహార్, బెంగాల్ లో పెద్ద ఎత్తున విధ్వంసాలను సాగించాడు. బీహార్ లోని నలందా విశ్వ విద్యాలయం లో గల ఆచార్యులను, విద్యార్థులను నరికి పోగులు పెట్టించి అక్కడ గల విలువైన తాళపత్ర గ్రంథాలను తగుల పెట్టించాడు.
ఘోర విధ్వంసం - యావద్భారత ఆక్రమణ :
కుతుబుద్దీన్ ఐబక్ తో డిల్లీలో బానిస వంశపు సుల్తానుల పాలనా ఆరంభమైంది. తరువాత ఖిల్జీ వంశానికి, తుగ్లక్ వంశానికి, సయ్యద్ వంశానికి, లోడీ వంశానికి చెందినా సుల్తానులు 300  సంవత్సరాలకు పైగా డిల్లీ రాజ్యాన్ని పాలించారు. డిల్లీ కేంద్రంగా తమ ఆధిపత్యాన్ని విస్తరించి క్రమంగా ఉత్తర భారతదేశమంతటినీ తమ అధీనంలోకి తెచ్చుకున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో సుల్తానుల ఆధిపత్యం దక్షిణ భారతదేశంలోకి కూడా వ్యాపించింది.  అతడి సేనాపతి మాలిక్ కఫర్ (యితడు మొదట గుజరాత్ లో ఒక హిందూ యువకుడు. సుల్తాన్ సైన్యాలు ఇతనిని బంధించి కొజ్జాగా మర్చి బానిసగా సుల్తాన్ కు అప్పగించారు. తరువాత యితడు సుల్తాన్ సైన్యం లోనే సేనాధిపతి అయ్యాడు.) దేవగిరి లోని యాదవ రాజ్యాన్ని, వోరుగల్లు లోని కాకతీయ రాజ్యాన్ని, ద్వార సముద్రం లోని హోయసల రాజ్యాన్ని పతనం చేసి రామేశ్వరం వరకు దాడులు జరిపి అనేక దేవాలయాలను కూలగొట్టి, లెక్కలేనంత సంపదను కొల్లగొట్టి, అసంఖ్యాకులైన హిందువులను బానిసలుగా పట్టుకుపోయాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్ ఖుస్రూ "మన పవిత్ర యోధుల ఖడ్గ ధాటికి ఈ దేశమంతా దావాగ్నికి దగ్ధమైన అరణ్యం వలె అయిపొయింది. ఇస్లాం కత్తులు పారించిన నెత్తురుతో ఈ దేశం నెల తడిసిపోయింది." అని చెప్పుకున్నాడు.
సంఘటితం గా లేని హిందువులు :
వ్యక్తిగత శౌర్యపరక్రమాలలో హిందూ సైనికులు ఎవరికీ తీసిపోకపోయినా వ్యూహ నైపుణ్యం లోను, సైన్య సంచాలనంలోను భారతీయ రాజుల సైనిక వ్యవస్థలు వెనుకబడి ఉండడం వారి వరుస పరాజయాలకు కారణమైంది. హిందూ రాజుల వద్ద వృత్తిరీత్యా సైనికులైన వారితో కూడిన సుశిక్షిత స్థిర సైన్యాలు తక్కువగా ఉండేవి. యుద్ధం వచ్చినప్పుడు చాటింపుల ద్వారా పోగుచెయ్యబడ్డ ఆయుధ ధారులు వారి సైన్యాలలో అధిక సంఖ్యలో ఉండేవారు. ఇలా పోగైన గుంపులు యుద్ధరంగంలో వ్యూహాల ప్రకారం పోరాడడంలోను, సమన్వయము పాటించడంలోను, తగినంత శిక్షణ, అభ్యాసం కలిగి ఉండేవి కావు. ముస్లిం సైన్యాలలో అశ్విక దళాలు ప్రముఖంగా ఉండేవి. ఇవి హిందూ రాజులకు తక్కువగా ఉండేవి. పైగా హిందూ సైన్యాలు ధర్మ యుద్ధ నియమాలను పాటిస్తూ ముఖాముఖీ తలపడి పోరాడేవి. ముస్లిం సైన్యాలు మాయోపాయాలను ప్రయోగిస్తూ యుద్ధం సాగించేవి. పరిపోతున్నట్లు నటిస్తూ హటాత్తుగా వెనక్కు తిరిగి దాడి చెయ్యడం, హిందూ సైన్యాల చుట్టూ తిరిగి వచ్చి వెనుక భాగంలో దాడి చెయ్యడం, ఎదుటి పక్షం ఆదమరచి ఉన్నప్పుడు అనూహ్యంగా దాడి జరపడం మొదలైన పద్ధతులను అనుసరించేవి. పదేపదే పరాజయాలు ఎదురౌతున్నా హిందూ రాజులు తమ యుద్ధ రీతులను మెరుగుపరచుకోలేదు. నిర్బంధంగా ఇస్లాం మతంలోకి మార్చబడిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చేందుకు హిందూ ధార్మిక నేతలు సంకల్పించలేదు.
ఆంధ్ర దేశం కూడా :
1303 లో అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన సైన్యం కాకతీయ రాజ్యంపై దాడి చేసింది. ప్రతాపరుద్ర చక్రవర్తి సేనాని అయిన కోసగిమైలి ఆ సైన్యాన్ని నేటి కరీంనగర్ వద్ద ఎదుర్కొని వోడించి తరిమివేశాడు. 1323 లో తుగ్లక్ చక్రవర్తి సైన్యాలు మళ్ళీ వోరుగల్లు పై దాడి చేశాయి. కాకతీయ సేనపతులలో రెడ్డి, వెలమ కులాల మధ్య వైషమ్యాలు తలెత్తడం వల్ల ప్రతాపరుద్రుడు వోడిపోయి బందీ అయ్యాడు. కాకతీయ సామ్రాజ్యం పతనమై అంతరించింది. బందీగా చిక్కి డిల్లీకి తరలించబడుతూ ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్ర దేశం ముస్లిం వశం అయింది. తురక సైన్యాలు ఆంధ్ర దేశమంతటా యథేచ్ఛగా సాముహిక హత్యలు, దోపిడీలు, దేవాలయ ధ్వంసాలు, బలవంతపు మతమార్పిడులు, హిందూ స్త్రీలపై అత్యాచారాలు సాగించారు. ఇది చూసి సహించలేక కాకతీయ సేనానులైన రేచర్ల సింగమనీడు, ప్రోలయ వేమా రెడ్డి, ముసునూరి కాపయ నాయకుడు తెలుగు ప్రజలను సమీకరించి, సైనిక శిక్షణ ఇచ్చి ముస్లిం సైన్యాలపై దాడులు జరుపుతూ క్రమక్రమంగా తెలుగు నేల అంతటినీ విముక్తం చేశారు. వారు క్రీస్తు శకం 1336 లో ఉమ్మడిగా వోరుగల్లుపై దాడి చేసి ముస్లిం సైన్యాలను తరిమివేసి యావదాంధ్ర దేశానికీ ముస్లిం ఆక్రమణ నుంచి విముక్తి కలిగించారు. వోరుగల్లు, అద్దంకి, ఆమనగల్లు రాజధానులుగా ముగ్గురు మూడు రాజ్యాలను స్థాపించుకొని పాలనా సాగించారు.
మొదటిసారి ముష్కరులను అడ్డగించిన తెలుగు నేల - విజయనగర సామ్రాజ్యం :
అదే సంవత్సరంలో (1336) విద్యారణ్యస్వామి మార్గదర్శనంతో హరిహర రాయలు, బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది దక్షిణ సముద్ర తీరం వరకు వ్యాపించి రెండున్నర శతాబ్దాలు దక్షిణ భారత దేశానికి ముస్లిం దాడుల నుంచి రక్షణ కల్పించింది. విజయనగర చక్రవర్తులలో ప్రముఖుడు, తెలుగు వారికి ఇష్టుడు శ్రీకృష్ణ దేవరాయలు.

No comments:

Post a Comment