Thursday, September 22, 2011


ఒక దుఃఖం ఆత్మకథ



         -జనజ్వాల

ఎన్నిసార్లు రాళ్లు విసురుతాడు
విసిరిన ప్రతిసారి ఒక దుఃఖం
దుఃఖం బొట్టుబొట్టుగా
ఒక్కొక్కటి కడవ కడవలుగా నింపుకున్నాను
గురి చూసి కడవలు కూడా
పగలకొట్టిండు
ఇప్పుడు ఏకంగా దుఃఖం నదియై సముద్రమైంది.
సముద్రం అల అలలుగా
రెక్కలు తొడుక్కుని
ఆకాశం లోకం చందమామ
చెట్టుకింద సేద తీర్చుకుంటుంది
చెట్లమీద పచ్చని చిలకలకు
చిలకల ముక్కుల తారలకు
కథలు కథలుగా సముద్రం
తన ఆత్మకథ
చెప్పుకుంటుంది చూడు
ప్రతిరాత్రి-
***
రాళ్లంతా గులకరాళ్లుగా ఒడ్డు అంచున పేర్చుకుంటుంది
పగలంతా అదేపని
రాత్రి ముఖం కడుక్కో
ఒక దుఃఖం ఆత్మకథ చదువుకో
వాడు శత్రువో మిత్రుడో
నీ రెప్పల అద్దంలో తెలిసిపోతుంది
రాళ్లను పేర్చడం మాత్రం మర్చిపోకూ
మరచిపోయేది మాత్రం మర్చిపో
చదవడం మాత్రం మర్చిపోకు
ఒక దుఃఖం ఆత్మకథ-

No comments:

Post a Comment