Sunday, September 4, 2011


తగ్గుతున్న గ్రామీణ భారతం


2011 జనాభా లెక్కల ప్రకారం పల్లెల నుండి పట్టణాలకు వలసలు జోరుగా సాగుతున్నాయి. పల్లెలలో జీవనం దుర్భరం కావటంతో బ్రతుకు తెరువు కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. గ్రామీణ క్షేత్రంలో వ్యవసాయం కంటే వ్యాపారం మేలు అనే భావంతో పరంపరాగతంగా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతు కుటుంబాలు తమ భూములను అమ్ముకొని పట్టణాలకు చేరుతున్నారు. ఈ రోజున దేశంలో రాజకీయాలు ప్రజలను ఎటువంటి దశకు తీసుకెల్లాయంటే ప్రజల మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లుతున్నది. రెండు, మూడు దశాబ్దాలకు పూర్వం రైతు కుటుంబాలు, వారి వద్ద పనిచేసే పలేరులు, వ్యవసాయంతో సంబంధం ఉన్న వృత్తుల కుటుంబాలకు మధ్య విశ్వాసం ఉండేది. ఈ రోజున ఆ పరిస్థితులు కనబడటం లేదు. దానితో వ్యవసాయం చేయటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణాలపై మోజు కూడా పెరిగిపోతున్నది. ఏతావాత గ్రామాలలో కొద్దిపాటి తెలివి ఉన్నవారు ఎవరూ గ్రామంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దానికి తోడూ ఈ రోజు చదువులు చదువుకొనేవారు చదువు అయిన తరువాత తన గ్రామానికి వెళ్లి అక్కడ వ్యవసాయమో మరేదో చేసుకొని బ్రతికేందుకు ఇష్టపడత లేదు. అన్ని కలగలిసి పల్లెల పరిస్థితులను దయనీయంగా మారుస్తున్నాయి. జనాభా లెక్కల ప్రకారం గణాంకాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం
దేశం మొత్తం జనాభా - 121,01,93,422
గ్రామీణులు - 83,30,87,662 - 68.84%
పట్టణ వాసులు - 37,71,05,760 - 31.16%

మన రాష్ట్రంలో....
మొత్తం జనాభా - 8,46,65,533
గ్రామీణులు - 5,63,11,788
పట్టణ వాసులు - 2,83,53,745

మొత్తం పురుషులు - 4,25,09,881
గ్రామాల్లో - 2,82,19,760
పట్టణాల్లో - 1,42,90,121

మొత్తం మహిళలు - 4,21,55,652
గ్రామాల్లో - 2,80,92,028
పట్టణాల్లో - 1,40,63,624

దేశంలోని పల్లె బలం..
1901 జనాభా లెక్కల్లో...
గ్రామీణ జనాభా - 89.2%
పట్టణ జనాభా - 10.8%

1951 జనాభా లెక్కల్లో...
గ్రామీణ జనాభా - 82.7%
పట్టణ జనాభా - 17.3%

2011 జనాభా లెక్కల్లో...
గ్రామీణ జనాభా - 68.84%
పట్టణ జనాభా - 31.16%

కేరళలో గ్రామీణ జనాభా సంఖ్యా గణనీయంగా తగ్గిపోతోంది. గత పదేళ్ళలో కేరళలో గ్రామీణ జన సంఖ్యా 26  శాతానికి తగ్గిపోయింది. దేశంలోనే ఇది పెద్ద రికార్డు. 

No comments:

Post a Comment