రాష్ట్రపతి పదవికి హజారే?
- రాలెగావ్ సిద్ధిలో పుకార్లు షికార్లు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవిని అవి నీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారేకు ఇవ్వ నుందా? అవునంటూ అన్నా స్వ గ్రామం రాలెగావ్‌సిద్ధిలో గురువారం పికార్లు షికారు చేశాయి. వచ్చే ఏడాది చివరికి రాష్ట్రపతి ప్రతి భాపాటిల్ పదవీ కాలం ముగియ నుండగా, మన్మోహన్ సింగ్ నేతృత్వం లోని యుపిఎ ప్రభుత్వం ఆ పదవిని అన్నా హజారేకు ఇవ్వనున్నట్లు ఊహాగా నాలు వెల్లువెత్తాయి. అన్నాను ఆయన స్వగ్రామంలో కలుసుకు నేందుకు కాంగ్రెస్ నాయకులు క్యూ కట్టడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. అన్నాను కలిసిన వారిలో రెవెన్యూ మంత్రి బాల సాహెబ్ తోరట్, అహ్మద్‌నగర్ ఎంపీ భౌసాహెబ్ వాచౌర్, పిడబ్ల్యుడి మంత్రి విజయసిన్హా మోహిత్ పాటిల్ తది తరులున్నారు. జన లోక్‌పాల్ బిల్లుపై రాం లీలా మైదాన్‌లో అన్నా హజారే దీక్ష నేపథ్యంలో ఆయనకు అనూహ్యమైన మద్దతు రావడంతో సీని యర్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. అయితే దీనికి సంబంధిం చిన వాస్తవాలు బయటకు రావాల్సి వుండగా, అన్నా హజారే సన్నిహితులు, ఇతర సహాయకులు ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. 'అన్నాను కలిసిన మంత్రులు ఆయనకు బాగా తెలుసు. అందుకే కలిసి ఉంటారు. ఎవరైనా కేంద్ర మంత్రులు అన్నాకు ఇలాంటి అవకాశం ఇవ్వజూపుతూ ఆయన్ని కలిసే ధైర్యం చేస్తారని నేను అనుకోను' అని రాలెగాం సిద్ధి సర్పంచ్ జైసింగ్ మపారి అన్నారు.
___________________________________________________________
నేడే ఆజాద్ నివేదిక మేడమ్ చేతికి ‘టీ’
న్యూఢిల్లీ, మేజర్‌న్యూస్: తెలంగాణా అంశం శుక్ర వారం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఆ మలుపు ఆజా ద్ నివేదిక రూపంలో ఆవిష్కృతం కానున్నది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఉదయం పదకొండింటికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణా అంశంపై కీలక నివేదిక సమర్పించబోతున్నారు. తెలంగాణాపై శ్రీకృష్ణ కమిటీ గతంలో ఒక నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఈ అంశం మీద నివేదిక రావడం ఇదే. ఆజాద్ నివేదికలో ఏమి ఉంటుందన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.
ఆజాద్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది వారాల్లోనే ఆయన తెలంగాణా అంశం మీద దృష్టి సారించారు. ఏకంగా రెండు రోజులు హైదరాబాదులో ఉండి పార్టీకి చెందిన అందర్నీ కలిసి పార్టీ చొరవ తీసుకుంటున్నదన్న అభిప్రాయాన్ని మొదటిసారిగా అందరిలో కలిగించారు. ఆ తర్వాత సీమాంధ్రులతోను, తెలంగాణా కాంగ్రెస్ వాదులతోను దఫాల వారీగా ఢిల్లీలో చర్చలు జరిపారు. మధ్య మధ్యలో అవాంతరాలు ఎదురవుతున్న ప్రతిసారీ ఇరు వర్గాలను శాంతపరుస్తూ అందరినీ సలహా సంప్రదింపుల ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ మొత్తం మీద తానొక నివేదిక రూపొందించారు.
ఆజాద్ తన నివేదికలో రాష్ట్రంలోని ప్రస్తుత వాస్తవ పరిస్థితిని వివరించడంతో బాటు కొద్ది నెలలుగా జరుగుతున్న ఉద్యమ సెగను వివరణాత్మకంగా పొందుపరిచి ఉంటారని భావిస్తున్నారు. ఫలానా నిర్ణయం మాత్రమే తీసుకోవాలని అధినేతకు లేదా అధిష్టానానికి అందులో సూచించే అవకాశాల్లేవు. కాని తెలంగాణ అంశంతో మమేకమై, తెలంగాణా వాదులతోను, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతోను కూలంకషంగా చర్చలు జరిపిన వ్యక్తిగా తన అవగాహన మేరకు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండవచ్చని చెబుతున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ కమిటీ చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసకున్నట్లు తెలుస్తోంది.
ఆజాద్ నివేదికకు గడువు దగ్గరపడుతున్న సమయంలోనే అధిష్టానం పేరు మీద కేంద్రపాలిత ప్రాంతమన్న ప్రతిపాదన తెరమీదకు రావడం ఎంతమాత్రం యాధృచ్ఛికం కాదు. ఉభయ వర్గాలు పట్టువిడుపులు లేకుండా ఉన్నందున ఈ సమస్య చాలా జటిలమైందని ఆజాద్ అభిప్రాయపడు తున్నారు. ఆజాద్ నివేదిక అటు సొంత పార్టీ అధిష్టానానికి, ఆ తర్వాత యూపీయే కూటమి భాగస్వాములకు, ఇతర జాతీయ పార్టీల నేతలకు సమాచారపరమైన ఒక నోట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన మధ్యే మార్గాలను కనుగొనాల్సిన అవసరాన్ని ఆయన అందులో పేర్కొన్నట్లు తెలిసింది.
తెలంగాణా వివాదం హైదరాబాదు చుట్టూనే అల్లుకుని ఉందని, అందువల్ల దాన్ని ఉపేక్షించి నిర్ణయం చేయడం సాధ్యపడదన్న అభిప్రాయాన్ని ఆయన తన నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికలోని కీలక సూచనలే ఆజాద్ నివేదికకు ప్రాతిపదికగా ఉన్నట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నేతలు గురువారం నాడు ఆజాద్‌ని కలిశారు. తెలంగాణాపై ఆయన ఇవ్వబోతున్న నివేదికలో తమ మనోభావాలకు అనుగుణంగా సిఫార్సులు ఉండాలని కోరుతూ, ఉంటాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తపరిచారు.
ఆ నివేదిక అధినేత్రి చూసి, సత్వరమే ఆమె తెలంగాణా ప్రకటన చేయాలని, అందాకా తాము రాజీపడబోమని వారు ఆయనకు వివరించారు. గత రెండు మూడు రోజులుగా వారు ఢిల్లీలోనే తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ఆజాద్ ఈ నెల 30 కల్లా సోనియాకు నివేదిక సమర్పించకపోతే తాము రాజీనామాలు చేయడం మినహా మరో గత్యంతరం లేదని చెబుతూ వచ్చారు. మొత్తానికి ఈ విషయంలో వారు తాము అనుకున్నది సాధించారు. ఇదొక రకంగా వారికి సానుకూలాంశం. ఇప్పటికే ఒకసారి రాజీనామాల ప్రహసనంతో ఇరకాటంలో పడిన టీ-కాంగ్రెస్ నేతలు పదే పదే రాజీనామాల ప్రకటన చేయకుండా తప్పించుకోలేని విపత్కర రాజకీయ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈసారి ఆ ఉపద్రవం నుంచి తప్పించుకుంటున్నారు. అయితే ఆజాద్ నివేదిక ఇవ్వడం ఒక మలుపు మాత్రమే. ఒక అంకం పూర్తయినట్లు. అయితే అందులో తెలంగాణకు అనుకూలంగా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండాలని టీ-కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆజాద్ నివేదికే సోనియా నిర్ణయానికి కీలకం అవుతుందని వారు అంటున్నారు. అందువల్ల తమ ఉద్యమం ఆగాలంటే ఆజాద్ సానుకూల అభిప్రాయం అందులో వ్యక్తం చేసి ఉండటంతో బాటు, సోనియాను ప్రభావితం చేసి తెలంగాణాకు అనుకూల వైఖరి అవలంబించేలా ఆయనే శ్రద్ధ తీసుకోవాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు

_________________________________________________________________________
క్లైమాక్స్..
ఆఖరి అంకంలో తెలంగాణ
ఒకటి రెండు రోజుల్లో స్పష్టత
నేడు కోర్‌కమిటీ సమావేశం
నివేదికకు ఆజాద్ తుది మెరుగులు
హైకమాండ్ పిలుపొస్తే సమర్పణ?
చర్చల్లో బొత్స కీలకపాత్ర
ఆజాద్‌తో వరుస మంతనాలు
శాశ్వత పరిష్కారం కావాలి
అప్పుడు కాంగ్రెస్‌కూ భవిత
పార్టీ ఇన్‌చార్జితో పీసీసీ చీఫ్
టీ-కాంగ్రెస్ ఎంపీలకు విందు
పరిష్కార మార్గాలపై చర్చలు
నెల రోజుల్లోపే పరిష్కారం: బొత్స
ఇతర పక్షాలతోనూ చర్చలు!
నేడు ఢిల్లీకి కేసీఆర్ బృందం
ప్రధాని, ఇతర నేతలను కలుస్తాం
పరిస్థితి వివరిస్తాం: కోదండరాం
నివేదికకు ఆజాద్ తుది మెరుగులు
హైకమాండ్ పిలుపొస్తే సమర్పణ?
చర్చల్లో బొత్స కీలకపాత్ర
ఆజాద్‌తో వరుస మంతనాలు
శాశ్వత పరిష్కారం కావాలి
అప్పుడు కాంగ్రెస్‌కూ భవిత
పార్టీ ఇన్‌చార్జితో పీసీసీ చీఫ్
టీ-కాంగ్రెస్ ఎంపీలకు విందు
పరిష్కార మార్గాలపై చర్చలు
నెల రోజుల్లోపే పరిష్కారం: బొత్స
ఇతర పక్షాలతోనూ చర్చలు!
నేడు ఢిల్లీకి కేసీఆర్ బృందం
ప్రధాని, ఇతర నేతలను కలుస్తాం
పరిస్థితి వివరిస్తాం: కోదండరాం
తెలంగాణ అంశం 'క్లైమాక్స్' దిశగా కదులుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. 2జీ కుంభకోణంపై కేబినెట్‌లో అంతర్యుద్ధంతో ఉక్కిరి బిక్కిరైన కాంగ్రెస్... గురువారం దీనికి ఎలాగోలా ముగింపు పలికింది. సీనియర్ మంత్రులైన ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం మధ్య 'రాజీ' కుదిరింది. కోర్టు జోక్యం చేసుకుని, ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే తప్ప కాంగ్రెస్ ఈ విషయంలో మళ్లీ వేలు పెట్టే అవకాశం లేదు. దీంతో... కాంగ్రెస్ నాయకత్వానికి తెలంగాణ వివాదం, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై దృష్టి సారించేందుకు మార్గం సుగమమైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 : తెలంగాణ, సీమాంధ్ర నేతలతో సంప్రదింపుల ప్రక్రియ ముగించి, నివేదిక సమర్పణకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తోంది. చర్చలు ముగించిన ఆజాద్... శుక్రవారం మధ్యాహ్నంలోపు పార్టీ పెద్దలకు తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ పెద్దల నుంచి పిలుపు అందితే... ఆజాద్ అదే సమావేశంలోనే తన నివేదికను సమర్పిస్తారు.
నివేదికను సమర్పించే సమయంలోనే... తెలంగాణపై తన వ్యక్తిగత అభిప్రాయం కూడా పార్టీకి చెబుతానని ఆజాద్ ఇదివరకే స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయ్యి, తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతారని తెలిసింది. గురువారం కూడా ఆజాద్, బొత్స గంటకుపైగా మంతనాలు జరిపారు. ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడిన బొత్స... తెలంగాణ సమస్యకు పరిష్కారం కోసం నెల రోజులుకూడా అవసరంలేదని, ఆలోపే అంతా కొలిక్కి వస్తుందని పేర్కొనడం గమనార్హం.
కేసీఆర్‌తోనూ చర్చలు?: ఇప్పటిదాకా తమ పార్టీ నేతలతో మాత్రమే చర్చలు జరిపిన కాంగ్రెస్ పెద్దలు... కేసీఆర్‌తోసహా ఇతర పార్టీల నాయకులు, జేఏసీతోనూ 'అనధికార' చర్చలు జరిపే అవకాశముందని తెలుస్తోంది. కేసీఆర్, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర నేతలు శుక్రవారం ఢిల్లీకి వెళ్తుండటం గమనార్హం. ప్రధానమంత్రితో సహా పలువురు జాతీయ స్థాయి ప్రముఖులను కలిసి సకల జనుల సమ్మె తీవ్రత, తెలంగాణలో పరిస్థితుల గురించి వివరిస్తామని కోదండరాం చెప్పారు.
'ఈ ప్రతినిధి బృందంలో నేను, కేసీఆర్, ఇతర భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాల నేతలు ఉంటారు. శుక్రవారం వీరంతా ఢిల్లీకి వెళతారు. నేను మాత్రం శనివారం వెళతాను'' అని కోదండరాం వివరించారు. తమ అధిష్ఠానంతో చర్చలకు అందుబాటులో ఉండేందుకే కేసీఆర్, కోదండరాం తదితరులు ఢిల్లీకి వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో శుక్రవారం జరిగే హైదరాబాద్ బంద్ సందర్భంగా కేసీఆర్ ఒక 'ఆసక్తికరమైన' విన్నపం చేశారు. జంట నగరాల ప్రజలు దయతో సంపూర్ణంగా బంద్ పాటించాలని కోరారు. 'సమీప భవిష్యత్తులో బంద్‌లు ఉండవు' అని ఆయన స్పష్టం చేశారు. 'ఇది తెలంగాణ ప్రజల కోసం జరుగుతున్న గొప్ప ఉద్యమం. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలి' అని కోరారు. సమీప భవిష్యత్తులో బంద్‌లు ఉండవని కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక... తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అంతరార్థం ఉందా?
బొత్సదే కీలక పాత్ర: తెలంగాణ సమస్య పరిష్కార సాధనలో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆజాద్‌తో బొత్స ఢిల్లీలో గంటకుపైగా మంతనాలు జరిపారు. తెలంగాణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న అంశంపై వీరిద్దరూ చర్చించారు. వీరి మధ్య రకరకాల ఫార్ములాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం మంచిదని, రాష్ట్ర కాంగ్రెస్‌కు కూడా దీని వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని ఆజాద్‌కు బొత్స చెప్పినట్లు తెలిసింది. వీరి మధ్య శుక్రవారం కూడా చర్చలు కొనసాగనున్నాయి. ఆజాద్‌తో చర్చలకు ముందు.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బొత్స రహస్య సమాలోచనలు జరిపారు. వారికి ఒక హోటల్‌లో విందు కూడా ఇచ్చారు. సమస్య పరిష్కారం ఏ దిశలో ఉండాలనే అంశంపైనే ఎంపీలతో చర్చించినట్లు తెలిసింది.
_____________________________________________________
శౌర్య క్షిపణి పరీక్ష విజయవంతం
7:49 AM RASTRACHETHANA No Comments
భూఉపరితలం నుంచి లక్ష్యాన్ని ఛేదించే అణు సామర్ధ్యం గల మీడియం రేంజ్ శౌర్య క్షిపణిని శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒరిస్సా తీరంలోని చందీపూర్ నుంచి డిఆర్‌డిఒ విజయవంతంగా ప్రయోగించింది. డిఆర్‌డిఒకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని భూగర్భ స్థావరం నుంచి దీనిని ప్రయోగించారు. 750 కి.మీ.దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలదు. అటు సైన్యం, ఇటు నావికాదళం కూడా ఉపయోగించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఒక టన్ను బరువుగల బాంబులను ఇది మోయగలదు. ఇది రెండు దశలలో పనిచేస్తుంది, సంప్రదాయ, అణు బాంబులను కూడా దీని ద్వారా ప్రయోగించవచ్చు.
దాదాపు పది మీటర్ల పొడవు అరమీటరు వెడల్పుతో దీనిజూని తయారు చేశారు. దీర్ఘకాలం మన్నేందుకు ఘన ఇంధనాన్ని దీనికి ఉపయోగిస్తున్నారు. ద్రవ ఇంధనాన్ని ఉపయోగించే క్షిపణులతో పోలిస్తే దీని లాంచ్ టైమ్ చాలా తక్కువ. వేగవంతమైన చలనశీలత కోసం తయారు చేస్తున్న ఈ క్షిపణిని భూగర్భ సొరంగాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. అణ్వాయుధాలను మొదటగా ప్రయోగించకూడదన్న దేశ ఉద్దేశాలకు అనుగుణంగా దీనిని సెకెండ్ స్ట్రైక్ సామర్ధ్యంతో తయారు చేస్తున్నారు. శౌర్యకు సంబంధించిన ఆఖరి పరీక్షలు 2008, నవంబర్‌లో నిర్వహించారు. పరీక్షల సందర్భంగా ఆ పరిసరాలలో రెండు కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వారందరినీ తాత్కాలికంగా వేరో చోటికి పంపారు

No comments:
Post a Comment