Thursday, September 29, 2011



హోం > వివరాలు
ఆ నలుగురి వల్లే నట్టేట్లో దేశం!
విశ్లేషణ



వి.హనుమంతరావు
సీనియర్ పాత్రికేయులు








పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై భక్తిరసం ఇటీవల తెప్పలుగా పారుతున్నది. మరోపక్క పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి పాలకులు ధర్మోపన్యాసాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుదినం నేలరాస్తూనే, అన్నా హజారే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్నారని నేరారోపణ చేయటం కాంగ్రెస్ పాలకులకే చెల్లు.

పార్లమెంటు పవిత్ర దేవాలయం వంటిది. అది మన రాజ్యాంగ సృష్టి. అలాంటి వ్యవస్థను అపవిత్రం చేయటం శిక్షార్హం. ఆ వ్యవస్థను అన్నా హజారే ప్రశ్నించడం, ఉల్లంఘించడం, రాజ్యాంగాన్నే ధిక్కరించడం అన్నది కాంగ్రెస్ పాలకుల నేరారోపణ. అది చట్టాలు రూపొందించే పార్లమెంటును, దాని విధివిధానాలు, నియమ నిబంధనలను ప్రశ్నించడమేనని వారి వాదన. అవినీతిని నిరోధించడానికి తన బిల్లును పార్లమెంటు ఆమోదించాలని డిమాండ్ చేయటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని గ్రహించిన అన్నా హజారే తన కోర్కెను మూడు అంశాలకు కుదించి బయటపడ్డారు. కానీ అన్నాను తప్పుపట్టిన కాంగ్రెస్ చేసిన నిర్వాకమేమిటి? ఇక్కడ పార్లమెంటు పనిచేయాల్సిన తీరు, నియమనిబంధనల గురించి ప్రస్తావించాల్సి ఉంది.

అటు పార్లమెంటు, ఇటు శాసనసభల్లో సుమారు ఒకే రకమైన నిబంధనలుంటాయి. బడ్జెట్ సమావేశం ముందు దేశాధ్యక్షుని ప్రసం గం, బడ్జెట్, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు, తీర్మానాల మీద, ఈ నాలుగు సందర్భాల్లో సభ్యులు తమ ఓటింగ్ హక్కును వినియోగిస్తారు. ప్రతీ సంద ర్భంలో ఓటింగ్‌కు పెట్టే ముందు స్పీకర్ అనుకూలంగా ఎవరు, వ్యతిరేకంగా ఎవరు అనేది తెలుసుకోవటం జరుగుతుంది. లోక్‌పాల్ వ్యవస్థ మీద జరిగిన చర్చ సందర్భంలో ఈ విధానాన్ని ప్రభుత్వం పాటించిందా అనేది చూడాలి. అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం సభ్యులు నియమ నిబంధనలు పాటించాలని, హజారే మూడు సూత్రాలను సభ సూత్ర ప్రాయంగా అంగీకరించిందని, సభలో జరిగిన చర్చల వివరాలను స్టాండింగ్ కమిటీకి పంపించాలని స్పీకర్‌ను కోరారు.

ఆ రోజు జరిగిన చర్చలను మీడియా ప్రచురించిన ప్రకారం సభ అభిప్రాయాన్ని బల్లలు చరచటం ద్వారా తెలియ జేశారు. స్పీకర్ మాట్లాడుతూ ‘బల్లలు చరచటం వాయిస్ ఓటు ఒకటే’నని అంటూ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది కాబట్టి ఓటింగ్ అవసరం లేదు. ఎవరూ ఓటింగులో పాల్గొనకుండా ఉండలేదు. లేదా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అని ప్రకటించారు.

పార్లమెంటు మాజీ సభ్యుడు, పార్లమెంటరీ వ్యవహారాల్లో తల నెరిసిన ఈరా సెజియన్ పార్లమెంటు వ్యవహారాల్లో అధికారయుతంగా ప్రకటించిన ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’ అనే గ్రంథంలో ఓటింగ్ గురించిన విధివిధానాలను ఉటంకిస్తూ ‘సభ అభిప్రాయం’, ‘ఒక ప్రకటనను తీర్మానంగా భావించడం’, ‘బల్లలు చరిస్తే అది వాయిస్ ఓటుతో సమానం’ అని ప్రకటిం చడం చాలా విచిత్రంగా, అర్థం చేసుకోలేనివిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

పధాని మాట్లాడుతూ హజారే ప్రతిపాదించిన తీర్మానం పార్లమెంటరీ డెమోక్రసీలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. కానీ పార్లమెంటరీ నియమ నిబంధనల ప్రకారం ఓ తీర్మానం ఆమోదానికి పెట్టారా అంటే అదీ లేదు. ఏ పార్లమెంటరీ విధివిధానాల ప్రకారం ‘సభ అభిప్రాయం’ అనే తీర్మానం చేశారో, బల్లలు చరిచి తీర్మానం ఆమోదిం చినట్లు ప్రకటించారో చెప్పమని సెజియన్ ప్రశ్నించారు. కీలక సందర్భాల్లో పార్లమెంటు నిర్వహణ ఇలా ఉండగా, ఆర్థికరంగం తీరుతెన్నులు దినదినం దిగజారుతూ దేశ సార్వ భౌమాధికారానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నాయి.

ఆరు దశాబ్దాల భారత పార్లమెంటు వరసగా 12వ సారి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన ప్రతీసారి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని నమ్మబలుకుతూ వచ్చినా ద్రవ్యోల్బణం తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూనే వస్తోంది. ధరలు దివి నుంచి భువికి దిగిరావడం లేదు. ఈ దుష్పరిణామం ఆర్థికమంత్రి ప్రణబ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నది. రెండంకెల స్థాయికి ద్రవ్యో ల్బణం చేరుకొనే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, వరసగా అశుభ వార్తలొస్తున్నాయని ప్రణబ్ వాపోయారు.

మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? ‘రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం కలిసి ద్రవ్యోల్బణ పరిస్థితిని చక్కబెడతాం’, ‘సమస్యనెలా పరిష్కరించాలో, అధిగమించాలో చూస్తాం’, ‘ప్రపంచ మార్కెట్ల న్నింటినీ ఈ సమస్య కమ్ముకొస్తూంది’. ఇదీ ప్రణబ్ స్పందన! ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా ఇదే పాట. ఇందులో కొత్తదనం ఏమిటంటే తన ప్రభుత్వ వైఫ ల్యానికి పరిష్కారం తన చేతుల్లో లేదు, ప్రపంచమంతా ఇలాగే మండిపో తోంది. నేనేమీ చేయలేను అని చేతులెత్తేయడమే. ఒక పార్శ్వం నుంచి చూస్తే కనిపించే దృశ్యం ఇది.

మరో పక్క నుంచి చూస్తే పారిశ్రామికవేత్తలు వడ్డీ భారం పెరిగిపోతున్న దృష్ట్యా పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి జంకుతున్నారు. ప్రభుత్వం మీద తమ ఒత్తిడిని పెంచడానికి ఉత్పత్తిని తగ్గించి ఒక రకమైన సమ్మెకు పూను కొన్నారు. ఉత్పత్తి సూచి తగ్గిన మాట నిజమే. గత సంవత్సరం జూలైలో ఎని మిది శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి సూచి ఈ సంవత్సరం అదే నెలలో 3.3 శాతానికి దబ్బున పడిపోయింది.

పజల కొనుగోలుశక్తి తగ్గటంతో పారిశ్రామి కోత్పత్తులకు గిరాకీ తగ్గింది. ఇది పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ సంస్థల రెండో వాదన. వడ్డీలు ఇలా పెరిగితే అభివృద్ధి మందగిస్తుంది జాగ్రత్త అని ప్రభుత్వా నికి వారి హెచ్చరిక. పారిశ్రామికాభివృద్ధికి భూమి కావాలి. తాము రైతుల నుంచి కొనుగోలు చేయాలంటే సాధ్యం కావడం లేదు కనుక ప్రభుత్వమే భూమి సేకరించి కేటాయించాలనేది వారి మూడో వాదన. ప్రభుత్వం భూసేక రణ బిల్లు ప్రకారం భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తే, తాము పరిశ్రమలు పెట్టలేం, అభివృద్ధి ముందగిస్తుంది అనేది వారి మూడో వాదన.

ఈ వాదనలకు ప్రతిగా వినిపిస్తున్న వాదనలూ ఉన్నాయి. పరిశ్రమల వ్యయంలో వడ్డీ చెల్లిం పు అత్యల్పం. కాగా పారిశ్రామికవేత్తల గోలకు అసలు కారణం వారి లాభాల్లో కోత పడుతూండటం. వడ్డీరేట్లు పెరగటం వాస్తవమే. అలాంటప్పుడు వారికి కావాల్సిన నిధులను చాలా తక్కువ వడ్డీకి లభించే విదేశాల నుంచి తెచ్చుకో వచ్చు కదా! అంతేకాదు, తాజాగా చైనా నుంచి కూడా రుణాలు తెచ్చు కోవడానికి భారత ప్రభుత్వం అనుమతిని ప్రకటించింది. ఇంకేం కావాలి!

వ్యవసాయరంగం పచ్చగా ఉంటే మొత్తం ఆర్థికవ్యవస్థే పచ్చగా ఉం టుంది. గత రెండు మూడేళ్లుగా వ్యవసాయోత్పత్తి పెరుగుతూనే వస్తోంది. అలాంటప్పుడు పారిశ్రామిక రంగం ఒక్కటే నేల చూపు చూస్తోందంటే దానికి కృత్రిమ కారణమేదో ఉండాలి. అందుకు పారిశ్రామికవేత్తలే కారణమని అనిపి స్తోంది. స్థూల జాతీయాదాయం అభివృద్ధి రేటు ఎనిమిది శాతం దిగువకు పడిపోయింది. ఉత్పత్తుల, సేవల విలువే జీడీపీ అనేది తెలిసిన విషయమే. దేశంలో ధరల పెరుగుదల మూలంగా వీటి విలువ పెరగాలి కదా! జీడీపీ పెర గాలి కదా! కాని అభివృద్ధి రేటు తగ్గుతుందేమిటి?

భారత ప్రభుత్వం ప్రైవేటీకరణ భూతాన్ని పట్టపగ్గాలు లేకుండా విడిచి పెట్టింది. అంటే దేశాన్ని తాము అభివృద్ధి చేయలేమని, తమ వద్ద నిధులు లేవని, అందుచేతే ప్రైవేట్ రంగాన్ని గత్యంతరం లేక ఆహ్వానిస్తున్నామని అంటోంది. సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన నాటి నుంచి, ప్రపంచ బ్యాంకు ఆదేశం మేరకు ఈ విధానాన్ని మొదట ప్రభుత్వం - ప్రైవేట్ రంగాల ఉమ్మడి ఆధ్వర్యంలో దొడ్డిదారిన ప్రవేశపెట్టింది. ప్రైవేటు రంగం పరిధిలోకి విదేశీ బహుళజాతి సంస్థలు, దేశీయ కార్పొరేట్ సంస్థలు వస్తాయి.

ప్రభుత్వ రంగం ప్రజలను, దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొంటే ప్రైవేట్ రంగం లాభా లు, మరిన్ని లాభాలు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఈ రెండు రంగాల లక్ష్యాలు వేర్వేరు, విభిన్న లక్ష్యాలతో ఉమ్మడిగా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఈ రంగాల్లో ఎవరికి ఎక్కువ ఆర్థిక బలం ఉంటే త్రాసు అటువైపు మొగ్గుతుంది. ఇటీవల వెలుగు చూసిన స్కాముల్లో ప్రైవేటు రంగం కోట్లకు పడగలెత్తిందనే విషయం వెలుగుచూసింది. ప్రభుత్వ విధానాలే వారి లాభాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. డబ్బుతో అధికారులను, మంత్రులను కొనుగోలు చేసే శక్తి వారికి సంక్రమించింది.

ఈ అసమాన కలయికతో ప్రైవేటురంగం బలంగా తయారైంది. కాబట్టి వారే అధికారాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా చలాయిస్తున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ ప్రభుత్వరంగంలో ఉంటూ వచ్చాయి కాబట్టి వాటిలోని నిధులు దేశాభివృద్ధికి ఉపయోగపడతాయి. వాటిని ఇప్పుడు మెల్లగా ప్రైవేటీకరిస్తు న్నారంటే, ఆ మేరకు నిధులు ప్రైవేటు రంగం మరింతగా పుంజుకోవడానికే తోడ్పడతాయి. ప్రైవేటీకరణలో ఉద్యోగులను తొలగించి, టెక్నాలజీ సహా యంతో వ్యవస్థను నడిపిస్తారు. ఇది నిరుద్యోగం పెరగడానికే దారితీస్తుంది.

ఈ రెండు రంగాల్లో నిధులు ప్రైవేటురంగానికి మళ్లుతాయి కాబట్టి, ఆ మేరకు ప్రభుత్వానికి నిధులు లభించవు. అసలే నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభు త్వం మరింతగా నిధులు కొరతను ఎదుర్కొని, సామాజిక సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకు కోత పెడుతుంది. దీనర్థం ప్రైవేట్ రంగాన్ని అసలుకే లేకుండా చేయాలని కాదు. దేశాభివృద్ధిలో వారి పాత్ర కూడా కీలకమే. అయితే ఏఏ రంగాలు ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలో ప్రభుత్వం ప్రజలతో సంప్రదించి నిర్ణయించాలి. కానీ మన్‌మోహన్, అహ్లూవాలియా, ప్రణబ్, చిదంబరం బృందం అధికారంలో కొనసాగినంత కాలం అది సాధ్యమా?

More Headlines

Listings ఆ ముగ్గురు...Listings సంక్షోభంలో సాంకేతిక విద్య
Listings ‘ముక్కు’మంత్రి!Listings ‘సద్భావన’ మంత్రం పారేనా?!
Listings ‘సుస్థిర జీవన’ వ్యాఖ్యాత!Listings రైతన్నకు బొంద చూపిన ‘కందా’!
Listings రాజకీయ రంగానికే వన్నె!Listings సండే స్కోప్
Listings అమెరికా ద్వంద్వనీతికి రబ్బానీ బలి!Listings ‘ఫేస్ - ట్వీట్’
Listings ప్రపంచ ‘అనాథ’ పాలస్తీనా!Listings తూర్పు దిక్కుకు దండం!
Listings గడాఫీపై అంకుల్ సామ్ ‘గన్’Listings మీదు ‘మిక్కిలి’ ప్రపూర్ణుడు!



రాష్ట్రపతి పదవికి హజారే?

  • రాలెగావ్‌ సిద్ధిలో పుకార్లు షికార్లు
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి పదవిని అవి నీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారేకు ఇవ్వ నుందా? అవునంటూ అన్నా స్వ గ్రామం రాలెగావ్‌సిద్ధిలో గురువారం పికార్లు షికారు చేశాయి. వచ్చే ఏడాది చివరికి రాష్ట్రపతి ప్రతి భాపాటిల్‌ పదవీ కాలం ముగియ నుండగా, మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వం లోని యుపిఎ ప్రభుత్వం ఆ పదవిని అన్నా హజారేకు ఇవ్వనున్నట్లు ఊహాగా నాలు వెల్లువెత్తాయి. అన్నాను ఆయన స్వగ్రామంలో కలుసుకు నేందుకు కాంగ్రెస్‌ నాయకులు క్యూ కట్టడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. అన్నాను కలిసిన వారిలో రెవెన్యూ మంత్రి బాల సాహెబ్‌ తోరట్‌, అహ్మద్‌నగర్‌ ఎంపీ భౌసాహెబ్‌ వాచౌర్‌, పిడబ్ల్యుడి మంత్రి విజయసిన్హా మోహిత్‌ పాటిల్‌ తది తరులున్నారు. జన లోక్‌పాల్‌ బిల్లుపై రాం లీలా మైదాన్‌లో అన్నా హజారే దీక్ష నేపథ్యంలో ఆయనకు అనూహ్యమైన మద్దతు రావడంతో సీని యర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. అయితే దీనికి సంబంధిం చిన వాస్తవాలు బయటకు రావాల్సి వుండగా, అన్నా హజారే సన్నిహితులు, ఇతర సహాయకులు ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. 'అన్నాను కలిసిన మంత్రులు ఆయనకు బాగా తెలుసు. అందుకే కలిసి ఉంటారు. ఎవరైనా కేంద్ర మంత్రులు అన్నాకు ఇలాంటి అవకాశం ఇవ్వజూపుతూ ఆయన్ని కలిసే ధైర్యం చేస్తారని నేను అనుకోను' అని రాలెగాం సిద్ధి సర్పంచ్‌ జైసింగ్‌ మపారి అన్నారు. 
___________________________________________________________



నేడే ఆజాద్‌ నివేదిక మేడమ్‌ చేతికి ‘టీ’
soniyaన్యూఢిల్లీ, మేజర్‌న్యూస్‌: తెలంగాణా అంశం శుక్ర వారం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఆ మలుపు ఆజా ద్‌ నివేదిక రూపంలో ఆవిష్కృతం కానున్నది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం ఉదయం పదకొండింటికి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణా అంశంపై కీలక నివేదిక సమర్పించబోతున్నారు. తెలంగాణాపై శ్రీకృష్ణ కమిటీ గతంలో ఒక నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఈ అంశం మీద నివేదిక రావడం ఇదే. ఆజాద్‌ నివేదికలో ఏమి ఉంటుందన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.

ఆజాద్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది వారాల్లోనే ఆయన తెలంగాణా అంశం మీద దృష్టి సారించారు. ఏకంగా రెండు రోజులు హైదరాబాదులో ఉండి పార్టీకి చెందిన అందర్నీ కలిసి పార్టీ చొరవ తీసుకుంటున్నదన్న అభిప్రాయాన్ని మొదటిసారిగా అందరిలో కలిగించారు. ఆ తర్వాత సీమాంధ్రులతోను, తెలంగాణా కాంగ్రెస్‌ వాదులతోను దఫాల వారీగా ఢిల్లీలో చర్చలు జరిపారు. మధ్య మధ్యలో అవాంతరాలు ఎదురవుతున్న ప్రతిసారీ ఇరు వర్గాలను శాంతపరుస్తూ అందరినీ సలహా సంప్రదింపుల ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ మొత్తం మీద తానొక నివేదిక రూపొందించారు.

ఆజాద్‌ తన నివేదికలో రాష్ట్రంలోని ప్రస్తుత వాస్తవ పరిస్థితిని వివరించడంతో బాటు కొద్ది నెలలుగా జరుగుతున్న ఉద్యమ సెగను వివరణాత్మకంగా పొందుపరిచి ఉంటారని భావిస్తున్నారు. ఫలానా నిర్ణయం మాత్రమే తీసుకోవాలని అధినేతకు లేదా అధిష్టానానికి అందులో సూచించే అవకాశాల్లేవు. కాని తెలంగాణ అంశంతో మమేకమై, తెలంగాణా వాదులతోను, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలతోను కూలంకషంగా చర్చలు జరిపిన వ్యక్తిగా తన అవగాహన మేరకు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండవచ్చని చెబుతున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ కమిటీ చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసకున్నట్లు తెలుస్తోంది.

ఆజాద్‌ నివేదికకు గడువు దగ్గరపడుతున్న సమయంలోనే అధిష్టానం పేరు మీద కేంద్రపాలిత ప్రాంతమన్న ప్రతిపాదన తెరమీదకు రావడం ఎంతమాత్రం యాధృచ్ఛికం కాదు. ఉభయ వర్గాలు పట్టువిడుపులు లేకుండా ఉన్నందున ఈ సమస్య చాలా జటిలమైందని ఆజాద్‌ అభిప్రాయపడు తున్నారు. ఆజాద్‌ నివేదిక అటు సొంత పార్టీ అధిష్టానానికి, ఆ తర్వాత యూపీయే కూటమి భాగస్వాములకు, ఇతర జాతీయ పార్టీల నేతలకు సమాచారపరమైన ఒక నోట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన మధ్యే మార్గాలను కనుగొనాల్సిన అవసరాన్ని ఆయన అందులో పేర్కొన్నట్లు తెలిసింది.

తెలంగాణా వివాదం హైదరాబాదు చుట్టూనే అల్లుకుని ఉందని, అందువల్ల దాన్ని ఉపేక్షించి నిర్ణయం చేయడం సాధ్యపడదన్న అభిప్రాయాన్ని ఆయన తన నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికలోని కీలక సూచనలే ఆజాద్‌ నివేదికకు ప్రాతిపదికగా ఉన్నట్లు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు గురువారం నాడు ఆజాద్‌ని కలిశారు. తెలంగాణాపై ఆయన ఇవ్వబోతున్న నివేదికలో తమ మనోభావాలకు అనుగుణంగా సిఫార్సులు ఉండాలని కోరుతూ, ఉంటాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తపరిచారు.

ఆ నివేదిక అధినేత్రి చూసి, సత్వరమే ఆమె తెలంగాణా ప్రకటన చేయాలని, అందాకా తాము రాజీపడబోమని వారు ఆయనకు వివరించారు. గత రెండు మూడు రోజులుగా వారు ఢిల్లీలోనే తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ఆజాద్‌ ఈ నెల 30 కల్లా సోనియాకు నివేదిక సమర్పించకపోతే తాము రాజీనామాలు చేయడం మినహా మరో గత్యంతరం లేదని చెబుతూ వచ్చారు. మొత్తానికి ఈ విషయంలో వారు తాము అనుకున్నది సాధించారు. ఇదొక రకంగా వారికి సానుకూలాంశం. ఇప్పటికే ఒకసారి రాజీనామాల ప్రహసనంతో ఇరకాటంలో పడిన టీ-కాంగ్రెస్‌ నేతలు పదే పదే రాజీనామాల ప్రకటన చేయకుండా తప్పించుకోలేని విపత్కర రాజకీయ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈసారి ఆ ఉపద్రవం నుంచి తప్పించుకుంటున్నారు. అయితే ఆజాద్‌ నివేదిక ఇవ్వడం ఒక మలుపు మాత్రమే. ఒక అంకం పూర్తయినట్లు. అయితే అందులో తెలంగాణకు అనుకూలంగా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండాలని టీ-కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఆజాద్‌ నివేదికే సోనియా నిర్ణయానికి కీలకం అవుతుందని వారు అంటున్నారు. అందువల్ల తమ ఉద్యమం ఆగాలంటే ఆజాద్‌ సానుకూల అభిప్రాయం అందులో వ్యక్తం చేసి ఉండటంతో బాటు, సోనియాను ప్రభావితం చేసి తెలంగాణాకు అనుకూల వైఖరి అవలంబించేలా ఆయనే శ్రద్ధ తీసుకోవాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు
_________________________________________________________________________











క్లైమాక్స్..
ఆఖరి అంకంలో తెలంగాణ
ఒకటి రెండు రోజుల్లో స్పష్టత

నేడు కోర్‌కమిటీ సమావేశం
నివేదికకు ఆజాద్ తుది మెరుగులు
హైకమాండ్ పిలుపొస్తే సమర్పణ?
చర్చల్లో బొత్స కీలకపాత్ర
ఆజాద్‌తో వరుస మంతనాలు
శాశ్వత పరిష్కారం కావాలి
అప్పుడు కాంగ్రెస్‌కూ భవిత
పార్టీ ఇన్‌చార్జితో పీసీసీ చీఫ్
టీ-కాంగ్రెస్ ఎంపీలకు విందు
పరిష్కార మార్గాలపై చర్చలు
నెల రోజుల్లోపే పరిష్కారం: బొత్స
ఇతర పక్షాలతోనూ చర్చలు!
నేడు ఢిల్లీకి కేసీఆర్ బృందం
ప్రధాని, ఇతర నేతలను కలుస్తాం
పరిస్థితి వివరిస్తాం: కోదండరాం

తెలంగాణ అంశం 'క్లైమాక్స్' దిశగా కదులుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. 2జీ కుంభకోణంపై కేబినెట్‌లో అంతర్యుద్ధంతో ఉక్కిరి బిక్కిరైన కాంగ్రెస్... గురువారం దీనికి ఎలాగోలా ముగింపు పలికింది. సీనియర్ మంత్రులైన ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం మధ్య 'రాజీ' కుదిరింది. కోర్టు జోక్యం చేసుకుని, ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే తప్ప కాంగ్రెస్ ఈ విషయంలో మళ్లీ వేలు పెట్టే అవకాశం లేదు. దీంతో... కాంగ్రెస్ నాయకత్వానికి తెలంగాణ వివాదం, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై దృష్టి సారించేందుకు మార్గం సుగమమైంది.


హైదరాబాద్, సెప్టెంబర్ 29 : తెలంగాణ, సీమాంధ్ర నేతలతో సంప్రదింపుల ప్రక్రియ ముగించి, నివేదిక సమర్పణకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తోంది. చర్చలు ముగించిన ఆజాద్... శుక్రవారం మధ్యాహ్నంలోపు పార్టీ పెద్దలకు తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ పెద్దల నుంచి పిలుపు అందితే... ఆజాద్ అదే సమావేశంలోనే తన నివేదికను సమర్పిస్తారు.

నివేదికను సమర్పించే సమయంలోనే... తెలంగాణపై తన వ్యక్తిగత అభిప్రాయం కూడా పార్టీకి చెబుతానని ఆజాద్ ఇదివరకే స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయ్యి, తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతారని తెలిసింది. గురువారం కూడా ఆజాద్, బొత్స గంటకుపైగా మంతనాలు జరిపారు. ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడిన బొత్స... తెలంగాణ సమస్యకు పరిష్కారం కోసం నెల రోజులుకూడా అవసరంలేదని, ఆలోపే అంతా కొలిక్కి వస్తుందని పేర్కొనడం గమనార్హం.

కేసీఆర్‌తోనూ చర్చలు?: ఇప్పటిదాకా తమ పార్టీ నేతలతో మాత్రమే చర్చలు జరిపిన కాంగ్రెస్ పెద్దలు... కేసీఆర్‌తోసహా ఇతర పార్టీల నాయకులు, జేఏసీతోనూ 'అనధికార' చర్చలు జరిపే అవకాశముందని తెలుస్తోంది. కేసీఆర్, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర నేతలు శుక్రవారం ఢిల్లీకి వెళ్తుండటం గమనార్హం. ప్రధానమంత్రితో సహా పలువురు జాతీయ స్థాయి ప్రముఖులను కలిసి సకల జనుల సమ్మె తీవ్రత, తెలంగాణలో పరిస్థితుల గురించి వివరిస్తామని కోదండరాం చెప్పారు.

'ఈ ప్రతినిధి బృందంలో నేను, కేసీఆర్, ఇతర భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాల నేతలు ఉంటారు. శుక్రవారం వీరంతా ఢిల్లీకి వెళతారు. నేను మాత్రం శనివారం వెళతాను'' అని కోదండరాం వివరించారు. తమ అధిష్ఠానంతో చర్చలకు అందుబాటులో ఉండేందుకే కేసీఆర్, కోదండరాం తదితరులు ఢిల్లీకి వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో శుక్రవారం జరిగే హైదరాబాద్ బంద్ సందర్భంగా కేసీఆర్ ఒక 'ఆసక్తికరమైన' విన్నపం చేశారు. జంట నగరాల ప్రజలు దయతో సంపూర్ణంగా బంద్ పాటించాలని కోరారు. 'సమీప భవిష్యత్తులో బంద్‌లు ఉండవు' అని ఆయన స్పష్టం చేశారు. 'ఇది తెలంగాణ ప్రజల కోసం జరుగుతున్న గొప్ప ఉద్యమం. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలి' అని కోరారు. సమీప భవిష్యత్తులో బంద్‌లు ఉండవని కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక... తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అంతరార్థం ఉందా?

బొత్సదే కీలక పాత్ర: తెలంగాణ సమస్య పరిష్కార సాధనలో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆజాద్‌తో బొత్స ఢిల్లీలో గంటకుపైగా మంతనాలు జరిపారు. తెలంగాణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న అంశంపై వీరిద్దరూ చర్చించారు. వీరి మధ్య రకరకాల ఫార్ములాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం మంచిదని, రాష్ట్ర కాంగ్రెస్‌కు కూడా దీని వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని ఆజాద్‌కు బొత్స చెప్పినట్లు తెలిసింది. వీరి మధ్య శుక్రవారం కూడా చర్చలు కొనసాగనున్నాయి. ఆజాద్‌తో చర్చలకు ముందు.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బొత్స రహస్య సమాలోచనలు జరిపారు. వారికి ఒక హోటల్‌లో విందు కూడా ఇచ్చారు. సమస్య పరిష్కారం ఏ దిశలో ఉండాలనే అంశంపైనే ఎంపీలతో చర్చించినట్లు తెలిసింది.
_____________________________________________________


















శౌర్య క్షిపణి పరీక్ష విజయవంతం


భూఉపరితలం నుంచి లక్ష్యాన్ని ఛేదించే అణు సామర్ధ్యం గల మీడియం రేంజ్‌ శౌర్య క్షిపణిని శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒరిస్సా తీరంలోని చందీపూర్‌ నుంచి డిఆర్‌డిఒ విజయవంతంగా ప్రయోగించింది. డిఆర్‌డిఒకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లోని భూగర్భ స్థావరం నుంచి దీనిని ప్రయోగించారు. 750 కి.మీ.దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలదు. అటు సైన్యం, ఇటు నావికాదళం కూడా ఉపయోగించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఒక టన్ను బరువుగల బాంబులను ఇది మోయగలదు. ఇది రెండు దశలలో పనిచేస్తుంది, సంప్రదాయ, అణు బాంబులను కూడా దీని ద్వారా ప్రయోగించవచ్చు.

దాదాపు పది మీటర్ల పొడవు అరమీటరు వెడల్పుతో దీనిజూని తయారు చేశారు. దీర్ఘకాలం మన్నేందుకు ఘన ఇంధనాన్ని దీనికి ఉపయోగిస్తున్నారు. ద్రవ ఇంధనాన్ని ఉపయోగించే క్షిపణులతో పోలిస్తే దీని లాంచ్‌ టైమ్‌ చాలా తక్కువ. వేగవంతమైన చలనశీలత కోసం తయారు చేస్తున్న ఈ క్షిపణిని భూగర్భ సొరంగాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. అణ్వాయుధాలను మొదటగా ప్రయోగించకూడదన్న దేశ ఉద్దేశాలకు అనుగుణంగా దీనిని సెకెండ్‌ స్ట్రైక్‌ సామర్ధ్యంతో తయారు చేస్తున్నారు. శౌర్యకు సంబంధించిన ఆఖరి పరీక్షలు 2008, నవంబర్‌లో నిర్వహించారు. పరీక్షల సందర్భంగా ఆ పరిసరాలలో రెండు కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వారందరినీ తాత్కాలికంగా వేరో చోటికి పంపారు

Wednesday, September 28, 2011





చెరో రాజధాని!
హైదరాబాద్ అందరిదీ
రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విభజన

కొత్త రాజధానులు ఏర్పాటు చేసుకునే దాకా
రెండింటి పరిపాలనకు భాగ్యనగరమే కేంద్రం
ఆదాయం ఇరు రాష్ట్రాలకూ పంపిణీ
ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు
ఇది కాంగ్రెస్ పెద్దల మధ్యేమార్గ ప్రతిపాదన
అంగీకరించకపోతే రాష్ట్రపతి పాలనే?
రెండు రాష్ట్రాలు! రెండు రాజధానులు! ప్రస్తుతానికి హైదరాబాద్ ఇరువురిదీ! ఆ తర్వాత... కేంద్రానిది! తెలంగాణ సమస్యకు కాంగ్రెస్ ప్రతిపాదించబోయే పరిష్కారం ఇదేనా? అవునంటున్నాయి ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు...


హైదరాబాద్, సెప్టెంబర్ 28 : ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ ఒకరు! విభజిస్తే ఒప్పుకోం అని మరొకరు! తలతెగినా హైదరాబాద్‌ను వదులుకోం అని ఒకరు! హైదరాబాదే కీలకం అని మరొకరు! విడవమంటే పాముకు కోపం! కరవమంటే కప్పకు కోపం! ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం 'మధ్యేమార్గ'మైన నిర్ణయం తీసుకుంటోందా? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు 'ఔను' అనే సమాధానమే లభిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ కేంద్రకంగా మారి, దానిపై పీటముడి పడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సమస్యను తేల్చనిదే సంక్షోభానికి ఒక పరిష్కారం కనుగొనడం సాధ్యంకాదని కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న హైకమాండ్... కీలకమంతా హైదరాబాద్‌లోనే ఉందనే సంగతిని గుర్తించింది. అదే సమయంలో, 16 రోజులుగా జరుగుతున్న సకల జనుల సమ్మె, ఇందులో భాగంగా రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, కేంద్రానికి అందుతున్న ఫిర్యాదులు, నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం నేపథ్యంలో ఇక ఏదో ఒక అడుగు ముందుకు వేయక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

కొద్దిరోజుల్లోనే నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు మంగళవారం తెలంగాణ నేతలతో సమావేశమైన రక్షణ మంత్రి ఆంటోనీ కూడా పేర్కొనడం గమనార్హం. ఈ పరిణామాల నడుమ... అసలు కాంగ్రెస్ పెద్దల ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి 'ఆంధ్రజ్యోతి' ప్రయత్నించినప్పుడు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... రాష్ట్రాన్ని రెండుగా విభజించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే... అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతీయులు హక్కును 'క్లెయిమ్' చేస్తున్న హైదరాబాద్‌ను మాత్రం ఎవరికీ కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

రెండు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి, ఆ రెండింటికి రెండు వేర్వేరు రాజధానులను కాంగ్రెస్ ప్రతిపాదించనుంది. ఆ రాష్ట్రాలు కొత్త రాజధానులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునేదాకా హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగిస్తాయి. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయ వనరులను రెండుకొత్త రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఇరు ప్రాంతాల నేతలు ఒక ఒక అవగాహన ఒప్పందానికి వచ్చేలా చూస్తారు.

రెండు రాష్ట్రాలకు రాజధాని నగరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాత, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు. అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయ వనరుల్లో కేంద్ర పాలిత ప్రాంత అవసరాలకు పోగా మిగిలిన దాన్ని ఇరు రాష్ట్రాలకు వాటాలు వేసే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ సంక్షోభానికి ఇంతకు మించిన ఉత్తమ పరిష్కారం లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో జరిపిన చర్చల్లోనూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ 'మధ్యేమార్గం' ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం.

తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనంటూ నేతలు చెబుతుండగా ఆజాద్ కల్పించుకుని... 'మీ వాదనలు మీరు చెబుతున్నారు. వారి వాదనలు వారు చెబుతున్నారు. ఏదీ కాదనలేని పరిస్థితి నెలకొంది. మధ్యేమార్గంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందేమో!'' అని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పక్షాలను ఒప్పించడానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. తెలంగాణ వాదులు అంగీకరిస్తారా? విభజనకు సీమాం«ద్రులు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలకు కూడా కేంద్రంలో అధికార పక్షమైన కాంగ్రెస్ సమాధానం సిద్ధంగా ఉంచుకుంది.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా... ఈ సమస్యకు ఇంతకుమించి పరిష్కారం లేదని అది భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తమైతే సరేసరి! ఆ దిశగా చర్చలు ప్రారంభించి ముందుకు వెళ్తుంది. అలా ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడితే... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, ప్రస్తుత సమస్యను ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ సంక్షోభా న్ని ఇంకా సాగదీయకూడదని, దీని వల్ల పరిస్థితులు విషమించేఅవకాశం ఉందని నిఘా వర్గాలుచేస్తున్న హెచ్చరికలూ కాంగ్రెస్ అధిష్ఠానం అడుగు ముందుకువేయడాని కి కారణంగా కనిపిస్తున్నాయి. సకల సమ్మె నేపథ్యంలో... నెలాఖరు తర్వాత రాష్ట్రంలో ప్రజాందోళనను మరింత తీవ్రం చేసి, పరిస్థితులను అస్తవ్యస్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు వివిధ శక్తులు ఏకమవుతున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు సమాచారం.






అవినీతిని అదుపులో ఉంచడం రాజు ప్రథమ కర్తవ్యం

''ఉద్యోగులు నలుబది విధముల అవినీతికి పాల్పడేదరు. ముందు జరిగిన దానిని వెనుక జరిగినట్లుగా, వెనుక జరిగిన దానిని ముందు జరిగినట్లుగా వ్రాయుట,

సాధ్యమయ్యే పనిని సాధ్యము కాదని, సాధ్యము కాని పనిని సాధ్యముగా చూపుట, స్వల్పంగా జరిగిన పనిని అధికంగా, అధికంగా జరిగిన పనిని స్వల్పంగా జరిగినట్లు నమోదు చేయుట, ఒకటి జరిగిన వేరొకటి జరిగినట్లుగా వ్రాయుట, ఒకరి ద్వారా జరిగిన దానిని వేరొకరి ద్వారా జరిగినట్లుగా చూపుట, ఇవ్వవలసిన పైకమును ఇవ్వకపోవుట, సమయమునకు కాక సమయం మించిపోయిన తరువాత ఇచ్చుట, ఒక రూపాయి ఇచ్చి రెండు రూపాయలు ఇచ్చినట్లు వ్రాయుట, రెండు రూపాయలిచ్చిన చోట ఒక రూపాయి ఇచ్చినట్లు వ్రాయుట, ఒకటి ఇచ్చి వేరొకటి ఇచ్చినట్లు నమోదు చేయుట, లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్నవాటిని లేనట్లుగా ఖాతాలు వ్రాయుట, చిల్లర ఖాతాలను మొత్తపు ఖాతాలుగా, మొత్తపు ఖాతాలను చిల్లర ఖాతాలుగా చూపుట, తక్కువ విలువ గల వాటిని ఎక్కువ విలువ గలవిగా, ఎక్కువ విలువ గల వాటిని తక్కువ విలువ గలవిగా మార్చుట, ధరలు పెంచుట, తగ్గించుట, పని దినములను తగ్గించి గాని, లేదా పెంచి గాని వ్రాయుట, సంవత్సరములను మాసములుగా, మాసములను రోజులుగా లెక్క కట్టుట మొదలగు నానావిధములుగా అవినీతికి పాల్పడి ప్రజల, ప్రభుత్వ ధనమును దోచుకొందురని, దీనిని నిరోధించేందుకు కటినమైన శిక్షలు అమలు పరచి పరిస్థితిని అదుపులో ఉంచాలి" అని చాణక్యుడు పాలకులకు సూచించాడు.