Tuesday, November 1, 2011


మాట తప్పడమూ అవినీతే!
తొమ్మిది సార్లు హామీ ఇచ్చి మీరిన కాంగ్రెస్
జెండాలు, అజెండాలను వదిలి పోరాడాలి
జంతర్‌మంతర్ వద్ద లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

న్యూఢిల్లీ, నవంబర్ 1 : పార్టీల జెండాలను, అజెండాలను పక్కన పెట్టి తెలంగాణ నేతలంతా కలిసి పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సాకారం అవుతుందని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. పదేళ్ల కాలంలో తొమ్మిది సార్లు మాట ఇచ్చి తప్పిందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద మంగళవారం ఆయన సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. వారం పాటు కొనసాగనున్న ఈ దీక్షలో ఆయనతోపాటు మరో 12 మంది పాల్గొంటారు.

అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధికి లక్ష్మణ్ బాపూజీ నివాళులర్పించారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన సాధారణ ప్రజల మధ్య ప్రేమ తప్ప ఎలాంటి విరోధం లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. "పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలనూ కాంగ్రెస్ అమలు చేయకుంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? అది అవినీతితో సమానం. దానిపైనే మాదీక్ష'' అని వివరించారు. అదే సమయం లో ఏ పార్టీకీ తమ దీక్ష అనుకూలమో, వ్యతిరేకమో కాదని వివరణ ఇచ్చారు. "అన్ని పార్టీలు, నాయకులు అజెండాలను పక్కన పెట్టాలి. ప్పుడే తెలంగాణ సాధ్యం'' అని పేర్కొన్నారు.

తమ దీక్షకు మద్దతునిచ్చిన నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2004 నుంచి తాను తెలంగాణ కోసం పోరాడుతున్నానని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీగౌడ్ చెప్పారు. తెలంగాణ ద్రోహులైన మంత్రులతో పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. 4.5 కోట్ల మంది ప్రజలు తెలంగాణను కోరుకుంటుంటే సీమాంధ్ర శాసనసభ్యులు అడ్డుకుంటున్నారని సమితికి చెందిన మరో నేత హరీశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.

కాగా లక్ష్మణ్ బాపూజీ పిలుపునకు టి-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. "దీక్షకు మద్దతుగా 4న తెలంగాణలోని అన్ని మండలాల్లో జెండాలను పక్కన పెట్టి దీక్ష చేపడతా''మని ప్రకటించారు. బాపూజీ దీక్షకు మద్దతుగా 5వ తేదీ వరకూ ఎమ్మార్పీఎస్ దీక్షలు జరుపుతుందని మంద కృష్ణమాదిగ ప్రకటించారు.

టీడీపీ ఎంపీలు గుండు సుధారాణి, బలరామ్ నాయక్, ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, జైపాల్ యాదవ్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేతలు దిలీప్‌కుమార్, విమలక్క, పాదూరి కరుణ, ఐఎన్‌టీయూసీ నాయకుడు అంబటి కృష్ణమూర్తి, పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీంసింగ్, చిన్న రాష్ట్రాల సమాఖ్య అధ్యక్షుడు తోమర్, టీజేఎస్‌సీ నేతలు గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, వెంకటేశం, న్యాయవాదుల జేఏసీ, విద్యార్థుల జేఏసీ ప్రతినిధులు దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. కాగా, లక్ష్మణ్ బాపూజీతో పాటు బోయిన్‌పల్లి వెంకటరామారావు, వి.చంద్రారెడ్డి, వి.భీమయ్య, దేసిని చినమల్లయ్య, బి.సీతారామయ్య, వి.మనోహర్ పంతులు,


****************************************************************************************************

ప్రణబ్ ముసలం

2జీ స్కాంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం పాత్రను బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోట్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒత్తిడి కారణంగానే ఆ నోట్‌ను ఆర్థిక శాఖ రూపొందించిన విషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రణబ్ ముఖర్జీ రాసిన లేఖ తాజాగా వెలుగులోకి తెచ్చింది. 2జీ స్పెక్ట్రమ్ స్కాంను ఆప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం అడ్డుకోలేదని రాసిన ఆర్థిక శాఖ నోట్‌ను కేబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ)తో సంప్రదింపుల ద్వారా రూపొందించినదేనని ఆ లేఖ వెల్లడించింది. పీఎంఓ ఒత్తిడి మేరకే 2జీ నోట్‌లో హోం మంత్రి చిదంబరం పేరును జత చేసినట్లు ఆ లేఖ తెలిపింది.

టెలికం స్కాంలో చిదంబరం పాత్రను ప్రస్తావించడంపై ఆర్థిక వ్యవహారాల శాఖ (ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్-డిఈఏ)కు భిన్నాభిప్రాయం ఉందని ప్రణబ్ ఆ లేఖలో తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలంపాట ద్వారా నిర్వహించాలని ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం పట్టుబట్టి ఉంటే టెలికం స్కాం తలెత్తే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక శాఖ నోట్‌లో ఉంది. 2జీ స్కాంలో చిదంబరంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో సుబ్రమణ్యం స్వామి వేసిన వ్యాజ్యం సందర్భంగా బహిర్గతమైన ఆ నోట్ అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ సందర్భంగా ఆర్థిక శాఖ నోట్‌పై వివరణ ఇస్తూ ప్రధానికి ప్రణబ్ రెండు పేజీల లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా బహిర్గతం కావడంతో కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలకు సంబంధించిన మరో కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో ప్రణబ్ ముఖర్జీ, చిదంబరంలు అధిష్ఠానం వద్ద రాజీ పడి కాంగ్రెస్‌లో సద్దుమణిగిందని భావిస్తున్న 2జీ కుంపటి మళ్ళీ రాజుకుంది.

2జీ స్పెక్ట్రమ్‌ను మొదట వచ్చిన వారికే మొదటగా కేటాయించాలన్న విధానంతో 2001నాటి ధరలకు టెలికం మంత్రిత్వ శాఖ ఆశ్రిత కంపెనీలకు కట్టబెట్టింది. దాంతో ఖజానాకు లక్షా డెబ్భైఆరువేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక ఈ కేటాయింపుల గుట్టురట్టు చేసింది. 2008లో స్పెక్ట్రమ్ కేటాయింపుల సందర్భంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా, ప్రణబ్ ముఖర్జీ విదేశాంగ మంత్రిగా, టెలికం లైసెన్సులు, స్పెక్ట్రం అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యుక్షులుగా ఉన్నారు. స్పెక ్ట్రమ్ అవినీతిని ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం, ఆ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుని హోదాలో ప్రణబ్ ముఖర్జీలు అడ్డుకోలేదు.

పైగా స్పెక్ట్రం లైసెన్సుల జారీకి వేలంపాట నిర్వహించాల్సిన అవసరం లేదంటూ, పాత విధానాన్నే కొనసాగించాలన్న అభిప్రాయాన్ని చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు వేర్వేరు సందర్భాల్లో వ్యక్తం చేశారు. 2జీ స్కాంలో చిదంబరం పాత్రపై విచారణ జరపాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి లేదా ఆయన్ని మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. టెలికం స్కాంలో చిదంబరాన్ని సిబిఐ, యూపీఏ సర్కారు, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా సమర్ధించాయి. ఆ క్రమంలో సుప్రీంకోర్టు అధికారాల పరిధిని సైతం కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడానికి సాహసించింది.

ఆర్థిక శాఖ నోట్ కారణంగా పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలు పరాకాష్ఠకు చేరుకోకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆ నాయకుల మధ్య రాజీ కుదిర్చారు. 2జీ స్కాంపై ప్రధానికి పంపిన ఆర్థిక శాఖ నోట్ రెండు మంత్రిత్వ శాఖల మధ్య జరిగిన సమాచార మార్పిడి మాత్రమేనని, దానిలోని అంశాలతో తనకు, శాఖకు ఏకీభావంలేదని ప్రణబ్ ప్రకటించడంతో ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది.

చిదంబరంకు ముఖర్జీ క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన ఆ సమస్య ముగిసి పోలేదు. చిదంబరంపై దర్యాప్తు జరపడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం ఎంతమాత్రమూ కాదు. అయితే తాజాగా బహిర్గతమైన ప్రణబ్ లేఖలో ఆర్థిక శాఖ నోట్‌కు సంబంధించిన పూర్వాపరాలను ఆయన ఒక క్రమంలో వివరించారు. కేంద్ర హోం మంత్రి చిదంబరంపై కూడా 2జీ స్కాం ఆరోపణలు మీడియాలో ప్రచారమవుతున్న నేపథ్యంలో స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల నిర్ణయం తదితర విషయాలపై ఒక సమగ్రమైన అవగాహనకోసం కృషి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఆర్థికశాఖ నోట్ కథ మొదలైనట్లు లేఖ తెలిపింది.

కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఉత్తర్వుల మేరకు 2011 జనవరిలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన సంప్రదింపుల వ్యవహారాలిన్నిటినీ గుదిగుచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. పీఎంఓ, డీఈఏ, డీఓటీ కార్యాలయ సీనియర్ అధికారులు, కేబినెట్ సెక్రటరీల మధ్య అనేక సమావేశాలు జరిగాయి. పరస్పరం అనేక వివరణలు, ఈ మెయిల్ లావాదేవీలు జరిగాయి. పర్యవసానంగా 2011 మార్చిలో 12 పేరాలతో కూడిన 'క్రానాలజీ ఆఫ్ బేసిక్ ఫాక్ ్ట్స రిలేటెడ్ టు ప్రైజింగ్ అండ్ అలకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్' అనే ఒక నోట్‌ను ఆర్థిక శాఖ తయారు చేసింది.

అయితే ఆ నోట్ సమగ్రంగా లేదని, డిఈఏ గత వైఖరిని వివరించడమే కాకుండా మాత్రమే కాకుండా వర్తమానంలో ఎలా వ్యవహరించాలని కూడా విశదపరచాలని కేబినెట్ సెక్రటేరియట్ సూచించినట్లు ప్రణబ్ లేఖ తెలిపింది. కేబినెట్ సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా ఆర్థిక శాఖ సవరించిన నోట్ తయారు చేసింది. 2008 జనవరిలో జరిగిన స్పెక్ట్రమ్ కేటాయింపుల సందర్భంగా చేసుకున్న అవగాహనా పత్రాలలోని క్లాజు 5.1, 43.5(4)ల ప్రకారం ఎలాంటి కారణ ం చూపకుండా స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఆ అధికారాన్ని వినియోగించి టెలికం మంత్రి ఎ. రాజా కేటాయిస్తున్న స్పెక్ట్రమ్ కేటాయింపులను చిదంబరం నిలువరించి ఉండాల్సిందని ఆర్థికశాఖ నోట్ వ్యాఖ్యానించింది. ప్రణబ్ నోట్‌లోని ఈ వ్యాఖ్యానం చిదంబరం, యూపీఏ ప్రభుత్వం మెడకు ఉచ్చులాగా చుట్టుకుంది. ఆర్థిక శాఖ నోట్‌లోని అభిప్రాయాలను తోసిపుచ్చడం ద్వారా ప్రణబ్ లేఖ చిదంబరానికి క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు ప్రభుత్వ శాఖల అంతర్గత వ్యవహారాల్లో చోటు చేసుకున్న అపార్థాల పర్యవసానంగా ఇంత రాద్ధాంతం జరిగినట్లుగా చిత్రీకరించేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2 జీ స్కాం విషయంలో చిదంబరంపై వచ్చిన ఆరోపణలను ప్రణబ్ లేఖ ద్వారా పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో తలెత్తిన వరుస స్కాంలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట ప్రతిపక్షాలు పోరాటులు చేశాయి. ప్రజలు, ప్రజాస్వామిక సంస్థలు, పౌరసమాజం అనేక ఉద్యమాలు నిర్వహించాయి. దాంతో ఆ స్కాంలపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. పర్యవసానంగా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కార్పొరేట్ సంస్థల అధికారులను ప్రభుత్వం జైల్లో పెట్టి న్యాయ విచారణ జరిపిస్తోంది.

కామన్‌వెల్త్ గేమ్స్ స్కాంలో కల్మాడీ, ఆదర్శ్ కుంభకోణ ంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌లపై చర్య తీసుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చిదంబరం వ్యవహారంలో తటపటాయిస్తోంది. యూపీఏ భాగస్వామి పార్టీ డిఎంకె నేతలు రాజా, కనిమొళి, మారన్‌లపై జరుగుతున్న విచారణ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా నిష్పాక్షికంగా ఉన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్ తన పార్టీ ప్రముఖుల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంది. కల్మాడీ, చవాన్‌లను దూరం చేసుకున్నంత సులువుగా చిదంబరంను కాంగ్రెస్ దూరం చేసుకోలేదు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో సహా దాదాపు ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికలు, 2014 సార్వత్రక ఎన్నికల నేపథ్యంలో అగ్రనాయకులపై ఇలాంటి ఆరోపణలు రావడం కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. 2జీ కుంభకోణంతో సహా యూపీఏ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టేందుకు జన్ లోక్‌పాల్ వంటి తీర్పరి వ్యవస్థ అవసరం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని అన్నా బృందం మరోసారి నిరశన దీక్షకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రణబ్ లేఖ ఆ సమావేశాలను మరింత వేడెక్కించే అవకాశముంది.
********************************************************
చరిత్రపై (రి)సెర్చిలైటు!
చిత్తశుద్ధితో కూడిన ఆత్మవిశ్వాసం రూపరేఖలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? తెలియకపోతే, ఈ వాక్యాలు గమనించండి ఒక్కసారి-‘‘బ్రౌన్ అదృష్టం కొద్దీ, బంగోరె తపఃఫలితం కొద్దీ అవి నా చేతుల్లో పడ్డాయి. ఆంధ్రదేశపు పంటపండింది. తెలుగుపండితుల బండారం వెల్లడైంది. బంగోరె ఉనికికి సార్థకత చేకూరింది.’’ అప్పుడెప్పుడో బండి గోపాలరెడ్డి (బంగోరె) ఓ మిత్రుడికి రాసిన ఉత్తరంలో మాటలివి. ఒక పరిశోధనతో తన ఉనికికి సార్థకత చేకూరిందని అనుకోగలిగిన పరిశోధకుడు బహుశా బంగోరె ఒక్కరే. భౌతికంగా జీవితం చాలించినా, బంగోరె ఉనికి తెలుగు పరిశోధనలో శాశ్వతమైన చోటు దక్కించుకుంది.

నేను నెల్లూరులో బి.ఎ. చదువుతున్న రోజులు. 1963లో వీఆర్ కళాశాలలో తెలుగు సాహిత్య సమితి నెలకొల్పాం. శ్రీశ్రీ సభను ప్రారంభించారు. వారంరోజుల తర్వాత బంగోరె ఈ సంగతి విని, నన్ను వెదికి పట్టుకొని, వార్త రాయించుకొని ‘జమీన్‌రైతు’లో(నెల్లూరు స్థానిక వార్తాపత్రిక) ప్రచురించాడు. ఆ పత్రికకు అప్పుడు ఉప సంపాదకుడు, విలేకరి అన్నీ ఆయనే. నెల్లూరులో ఏ సభ జరిగినా కన్పించేవాడు. సభా విశేషాలతోపాటు నిర్వాహకులమీద, నిర్వహణ మీద ఘాటైన విమర్శ, చెణుకులు తన వార్తల్లో ఉండేవి. అతను జమీన్ రైతులో వారం వారం ‘కూనిరాగాలు’ శీర్షికతో ‘కాలమ్’ నిర్వహించేవాడు. ‘కూనిరాగాలేమిటి? కూనరాగాలనాలి’ అని విమర్శించిన మ.కో.రె. (కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామిరెడ్డి)ను దబాయించి, తిట్టి, తిట్టించుకోగల గుండె ధైర్యం బంగోరెకి మటుకే ఉండేది. మనలో మన మాట- మకోరెకు బంగోరె మీద అవ్యాజమైన ప్రేమ!

1962లో నేలనూతల శ్రీకృష్ణమూర్తి (ఎన్‌ఎస్‌కె.) ‘విక్రమసింహపురి మండల సర్వస్వం’ సిద్ధం చేస్తున్నారు. అందులో బంగోరె నెల్లూరు పాతకాలపు సత్రాలు, వీధులు, పత్రికలు వంటి ఎన్నో విషయాలమీద వ్యాసాలు రాశాడు. ఇందుకోసం స్థానిక పత్రికా సంపుటాలన్నీ గాలించి, పరిశోధించాడు. ఒంగోలు వెంకటరంగయ్య స్థానిక చరిత్ర రచనలో బంగోరెకు మార్గదర్శకులు. ఆ రోజుల్లో బంగోరె నెల్లూరు వర్ధమాన సమాజం (గ్రంథాలయం) కార్యదర్శి. ఎందరెందరో పండితులు వచ్చి ఉపన్యసించేవాళ్లు. శ్రీశ్రీ ఆరుద్రవంటి వారితో బంగోరెకు స్నేహాలు, పరిచయాలు ఏర్పడ్డాయి. నెల్లూరులో బంగోరె ఆత్మీయ మిత్రుల్లో ఎన్.ఎస్.కె., కెవిఆర్, మకోరె, వేదం వెంకట్రామన్ వంటి పండితులుండేవాళ్లు. రాఘవన్, ఎస్‌ఎస్‌కె తను కలిసి అనువదించిన సుబ్రహ్మణ్యభారతి కథ ‘చంద్రిక’ను ప్రచురించాడు. సంచలనాత్మక వార్తలు ఇవ్వడం, పరిశోధనాత్మక జర్నలిజం మీద బంగోరెకు మక్కువ. ఆరుగురో, ఏడుగురో మిత్రులు ఆనందకుమారస్వామి జన్మదినం జరుపుకోడం వంటి వ్యాసాలు జమీన్ రైతు పాఠకుల్లో చాలా కుతూహలం కలిగించేవి.

1967 అనుకుంటా, నెల్లూరు సమీపంలో మైపాడు సముద్రతీరంలో చంద్రిక, కళారాణి అనే ఇద్దరు కాలేజీ విద్యార్థినులు హత్యకు గురయ్యారు. బంగోరె పోలీసులతో సమానంగా పరిశోధించి జమీన్‌రైతులో రాశాడు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఈ కేసును రిపోర్టు చేస్తూ బంగోరె కృషిని అభినందించింది.

బంగోరెకు విద్యార్థి దశనుంచి పుస్తకాల పిచ్చి. కొంత కాలం బుచ్చిబాబు పిచ్చి. బుచ్చిబాబుతో ఉత్తర ప్రత్యుత్తరాలు. కొంతకాలం ఖలీల్ జిబ్రాన్ ‘ప్రొఫెట్’, కొంతకాలం ‘మాలపల్లి’, ‘కన్యాశుల్కం’.... ఎప్పుడూ చేతిలో ఒక పుస్తకంతో కన్పించేవాడు.

1970-71లో మద్రాసులో అమెరికన్ కాన్సలేట్‌లో అమెరికన్ రిపోర్టర్‌లో ఉద్యోగం.. శని, ఆదివారాలు తన పరిశోధనలకు అవకాశం. సెలవు దినాల్లో జి.ఓ.ఎం.ఎల్, కనిమెరా, ఎంఆర్‌ఓ (ఇప్పుడు తమిళనాడు ఆర్కైవ్స్)లలో సావకాశంగా గంటల తరబడి సీరియస్‌గా పరిశోధనకోసం చదివే అవకాశం లభించింది. అందుకేనేమో పనిచేయ కుండా జీతాలు తీసుకునే విశ్వవిద్యాలయాల ఆచార్యుల మీద, అధ్యాపకులమీద, ముఖ్యంగా తెలుగుశాఖ వారి మీద అతనికి , పట్టరానంత కోపం.

ఒక్కోసారి నాకనిపిస్తుంది - బంగోరె అనే ‘రాక్షసుడు’ అరపరానంత జ్ఞానాన్ని సంపాదించి, దాన్ని వాడుకోకుం డానే అర్ధంతరంగా నిష్ర్కమించాడని! అతను పోయిన చాల సంవత్సరాలకుగాని అతని విరాట్‌స్వరూపం నా మనసులో సాక్షాత్కరించలేదు.

- డాక్టర్ కాళిదాసు పురుషోత్తం

బ్రౌన్ జాబులు, తెలుగు జర్నలిజం చరిత్ర (1832 నుంచి 1857 దాకా) బంగోరె మౌలికమైన పరిశోధన. తెలుగు జర్నలిజం తొలినాళ్ళ వివరాలెన్నో తవ్విపోశాడు. ఈ పుస్తకంమీద నా అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పమన్నాడు. అప్పటికి ఇద్దరం ప్రాణస్నేహితులం, నాకున్న అవగాహనతో జాబు రాసి నా సందేహాలు, ప్రశ్నలు తెలియజేశాను. ఈ సందర్భంలో బంగోరె నాకు రాసిన ఉత్తరంలో కొన్ని భాగాలు-

నాయనా, డా. కా. పు.
ఏదో రెండు తప్పులు చెప్పావు. నా స్టై ల్ బాగలేదన్నావు. ఇందుకు నేనేమని సమాధానం చెప్పేది. నాజుకుగా నత్తిగా నంగిగా నలిపి నలిపి చెప్పడం నాతత్వం కాదు. వేసట-అనే పదం గూర్చి ఏదో నసిగావు. ఏం తప్పా! నేటి తర్జుమా వార్తలు, దగుల్బాజీ రిపోర్టింగ్ విధానం వీటిని చూస్తే మామూలుగా భావుకులనేవారికి కల్గే అవస్థను ఆ బళ్లారి పాఠకుడు 130 ఏళ్ల క్రితం వేసట, అరుచి, అనే పదాలతో వర్ణించాడు. ఇటువంటి చులకన భావాన్ని గురించి టోన్‌డౌన్ చేసి చెప్పడానికి అంతకుమించిన పదం కనపడ్డంలేదు. డెలిబెరేట్ గానే వాడాను ఆ పదాన్ని. నా ఆ డెలిబరేట్‌నెస్‌ను గుర్తించావు గానీ హర్షించలేకపోయావు.
ఇక - జర్నలిజం చరిత్రలో మహాభారతం ముద్రణ గొడవేమిటి- అన్నావు చాలా సిల్లీగా. అయినా ‘నా పుస్తకం పేరు’ జర్నలిజం చరిత్ర’ అని ఎవరు చెప్పారు.

‘బ్రౌన్‌జాబులు-జర్నలిజం చరిత్ర 1832-1857’ - ఈ బ్రౌన్ పరిధిలోనూ, ఈ కాలపరిధిలోనూ మహా భారతం 18 పర్వాల ముద్రణకు ప్రాధాన్యం లేదంటావా? పైగా వర్తమానతరంగిణి ఎడిటర్ పువ్వాడ వెంకటరావు బ్రౌన్‌కి వ్రాసిన నాలుగు జాబుల్లోనూ ప్రధాన విషయం, ప్రధానసూత్రం మహాభారతముద్రణ- పర్వాల వారీగా జరిపిస్తున్న ముద్రణ. అంతేగానీ, దూరాన్వయం, దురాన్వయం వంటివి ఇందులో ఏకోశానాలేదు. మీ వంటి తెలుగు పండితుల చేతుల్లో ఇవే జాబులు పడివుంటే - ఈ విషయాలు, సూక్ష్మాలు స్ఫురించి ఉండవు. ఆ ప్రశ్నలు ఉదయించవు. అటువంటి చర్చే వచ్చి ఉండదు.

అయినా, థ్యాంక్స్. ధైర్యంగా, నీ దృష్టిలో తప్పులనుకొన్నవి చెప్పావు. అదే పదివేలు. అవి నీ దృష్టి లోపాలుగానీ నా తప్పులు కావు. అవునా?

-బంగోరె
*****************************************************

No comments:

Post a Comment