ఏకమైతేనే ఏకాంత ం
జీవితం భారంగా అనిపించినప్పుడు, నిరంతరంగా తన మనసును ఎవరో ఒకరు గాయం చేస్తూనే ఉన్నారనిపించినప్పుడు మనసు ఏమనుకుంటుంది? అందరికీ దూరంగా వెళ్లిపోయి, ఎక్కడైనా ఏకాంతంగా ఉండిపోవాలని ఆరాటపడుతుంది. కానీ, మనుషులకు దూరంగా వెళ్లిపోతే ఎవరికైనా ఏకాంతం లభిస్తుందా అంటే అసలు సిసలైన ఏకాంతం మనుషులతో మమేకం అయినప్పుడే లభిస్తుందంటున్నారు నిపుణులు.ఆ వివరాలేమిటో పరిశీలిస్తే...
నీలో నువ్వు కుంచించుకుపోతే ఒంటరితనం. నీలో నువ్వు విస్తరిస్తే ఏకాంతం. బంధాలన్నీ తెగిపోయి, లేదా తానే తెంచేసుకుని, తనలో తాను కుదించుకుపోతే ఒంటరితనం. బంధాల సారాన్నంతా పిండుకుని, ఆ సారంలోని చేదును తొలగించి తీపిని పొదువుకుంటూపోతే అది ఏకాంతం. ఏకాంతం ఎక్కడినుంచో రాదు. అది నీలోనే అంకురిస్తుంది. కాకపోతే అది అంకురించడానికి అనువైన వాతావరణం అంతరంగంలో ఉండాలి. ఇతరుల్లో నువ్వు కలిసిపోయి, ఇతరులను నీలో కలిపేసుకున్నప్పుడే ఆ వాతావరణం నెలకొంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో లోపాన్ని చూస్తూ అలా అందరికీ దూరమైపోతే మిగిలేది ఏకాకితనమే. లోపాల్నీ, సామర్థ్యాల్నీ సమానంగా స్వీకరిస్తూ, అందరితోనూ కలిసిపోయినప్పుడే ఏకాంతం. ఆ స్థితికి మనసును సన్నద్ధం చేసుకోవడం ఎలా మరి?
నీతో నువ్వు కలసి.... రోజూ ఎందరితోనో నువ్వు మాట్లాడతావు. కానీ, నీతో నువ్వు మాట్లాడవు. రోజూ ఎందరి గురించో ఆలోచిస్తావు. నీ గురించి నువ్వు ఆలోచించవు. ఎదుటి వారి లోపాలను పసికట్టి, ఎంత చ క్కగానో విశ్లేషిస్తావు. విమర్శిస్తావు. కానీ, నీ లోపాలను నువ్వు గుర్తించవు. వాటిని విశ్లేషించవు. నీ మనసు నిరంతరం నీ వెంటబడి వస్తూనే ఉంటుంది. కానీ, దాని గురించి నీకేమీ పట్టదు. నీ ఉద్యోగ, వ్యాపారాల ప్రవాహాల్లో నిరంతరం అలా కొట్టుకుపోతుంటావు. సమాధానం లేని ప్రశ్నలేవో నిన్ను అనుక్షణం దహించివేస్తుంటాయి. ఎక్కడైనా దూరంగా వెళ్లి కొంత కాలం ఏకాంతంగా ఉండిపోతే ఎంత బావుండునా అనిపిస్తుంది. అలా ఏకాంతంగా ఉండాలనుకుంటూనే చాలా సార్లు ఏకాకితనంలోకి జారిపోతారు ఆకాశం లోకి చూస్తూ చూస్తూ మనసు శూన్యంలోకి జారిపోతుంది.
ఎక్కడిదీ ఏకాకితనం?.... " సహజంగా ఏకాంతాన్ని కోరుకునే మనిషి ఏకాకితనాన్ని ఏమాత్రం భరించలేడు. అయినా, కొన్ని సందర్భాల్లో ఆ వైపే మొగ్గుతాడు. మనుషులంతా తనపట్ల అమానుషంగా ప్రవ ర్తిస్తున్నారని ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉండిపోవాలనుకుంటాడు. అలా ఒంటరిగా ఉండిపోయే ఏర్పాట్లు చేసుకున్నా, ఆ స్థితికి తట్టుకోలేక మళ్లీ సమూహంలోకి వచ్చిపడతాడు. కేవలం సమూహంలోకి వచ్చిపడినంత మాత్రాన ఒంటరితనం పోదు. సాటి మనుషులతో పూర్తిగా మమేకమైపోవాలి.
అది సాధ్యం కానప్పుడు మళ్లీ ఒంటరితనమే వెంటాడుతుంది.'' అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. ఒంటరితనం మనకు చేరువైతే దాన్నించి ఎక్కడికో దూరంగా పారిపోవాలనుకుంటాం. చివరికి అంతశ్చేతనలో కూడా మనసు ఒంటరితనాన్ని నిరోధించడానికి లేదా అధిగమించడానికే ప్రయత్నిస్తుంది. నిజానికి ఇదంతా ఒక వృధా ప్రయాస మాత్రమే. ఒంటరితనం మనలో కలిగిస్తున్న భయాన్ని పరిశీలించకుండా దాని మూల స్వభావాన్ని గ్రహించకుండా దాన్ని నిరోధించడానికి సిద్ధమైతే వైఫల్యమే మిగులుతుంది. నిజానికి అణచివేయడం లేదా అలక్ష్యం చేయడం ద్వారా ఒంటరితనపు బాధ ఎప్పుడూ తొలగిపోదు. నువ్వొక లక్ష్యంతోనే సాగిపోతుండవచ్చు.
నీ విజయమంతా విజయపరంపరలోంచే సాగిపోతుండవచ్చు. నీకు ఎన్నో విస్తృతాధికారాలే ఉండవచ్చు. నీకు అపారమైన విషయ పరిజ్ఞానమే ఉండవచ్చు. అయినా ఒంటరితనం బాధ నిన్ను సలుపుతూనే ఉంటుంది. నీ మార్గంలోని అవరోధాలను అధిగమించే మార్గాలు తెలియనంత కాలం, నిన్ను దహించే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పనంత కాలం ఒంటరి తనం నిన్ను వేధిస్తూనే ఉంటుంది.ఒంటరితనపు గుహలోకి ప్రవేశించి నలుమూలలా నిశితంగా పరిశీలించే వరకు ఒంటరితనపు వాస్తవ రూపమేమిటో దానికి కారణమైన మూలాలేమిటో బోధపడదు.
ఆలోచనలు అలా ఉంటే... అందరికీ దూరమైపోయానని, అందరినుండీ వేరైపోయాననే భావన రావడమే అసలైన ఒంటరితనం. నిజానికి మన మాటలు, చర్యల్లో మనల్ని సంకుచిత పరిచేవే ఎక్కువ. మన ఆలోచన లు పైకి ఎంతో లోతుగా కనిపించినా వాటిలో చాలావరకు మనుషులు పరస్పరం విడిపోవడానికి దోహదం చేసేవే. ప్రతి పనినీ నీదీ నాదనే పేరుతో వేరువేరుగానే చూస్తున్నారు. సంఘాల పేరుతోనో, మతాల పేరుతోనో, దేశం పేరుతోనో విడిపోతూనే ఉన్నారు. ఇలా ఏదో ఒక నెపంతో ఏవో చర్యలకు పాల్పడుతున్నారు. ఈ చర్యలతో క్రమక్రమంగా అందరికీ దూరమై చివరికి ఏ చర్యాలేని ఒంటరితనానికి చేరుకుంటాడు.
మొత్తంగా ఒక చేష్టలుడిగిన స్థితిలో కలిగే భావనే ఒంటరితనం. చర్య, అన్నిటికీ వేరైపోయిన మనసు ఒక తీవ్రమైన అభద్రతా భావానికి లోనవుతుంది. అభద్రతా భావంలో అందరూ శత్రువుల్లా కనపడతారు. ఒక దశలో ఈ శత్రువుల్ని ఎదుర్కోవడానికి మళ్లీ ఒక చర్య మొదలవుతుంది. అభద్రతా భావంలో మొదలైన చర్యలు పైకి ఎంత ఉదాత్తంగా కనిపించినా అవన్నీ అతనికి సంకుచిత త్వానికి కవచాలు మాత్రమే.తనకు తానే దూరమైపోయి, ఇతరులే తనను దూరం చేశారని భావించడం తనకెవరో హాని తలపెట్టినట్లు ఆత్మరక్షణా ప్రయత్నాలు చేయడం ఇవ న్నీ, ఒంటరి తనపు భయాన్ని రెట్టింపు చేస్తాయి.
ఎవరినుంచి పారిపోవడం?..... శూన్యం నుంచి, ఒంటరితనం నుంచి పారిపోవాలని చూసే వ్యక్తి నిజానికి వాటికి వేరేమీ కాదు. అవ న్నీ అతడే. శూన్యం, ఒంటరితనం అతని ఆలోచనల్లో ఉదయించిన భావరూపాలే. వాస్తవానికి ఎవరూ తమనుంచి తాము పారిపోలేరు. అందువల్ల తమను తాము అర్థం చేసుకోవడం ఒక్కటే ఎవరైనా చేయగలిగేది. తానే తన ఒంటరితనమని, తానే తన శూన్యమని గ్రహించాలి. అలా కాకుండా వాటిని తనకు వేరుగా భావించినంత కాలం అతడు తీవ్రమైన భ్రమల్లో అంతులేని వైరుధ్యాల్లో పడిపోతాడు. నేనే నా ఒంటరితనమని, నా ఆలోచనా ధోరణే నా ఒంటరితనానికి కారణమని ఎప్పుడైతే. స్పష్టంగా అనుభవంలోకి వస్తుందో అప్పుడే ఒంటరితనం నుంచి అతడు బయటపడతాడు.
"ఏకాకితనాన్ని నిర్మూలించే ఏకైక మార్గం ఏకాంతమే.'' అంటాడు ప్రముఖ మానసిక వేత్త పాల్ టిలిచ్. ఏకాంతం పరిపూర్ణమైనది. విడదీయరానిది. ఎవరైనా తన లోని విడిపోయే తత్వాన్ని సరిగ్గా పసిగట్టగలిగినప్పుడే, తన ఏకాకితనం నుంచి ఏకాంత స్థితికి చేరకుంటారు . తెగిపోయిన తన అవయవాల కోసం తపించినట్లు, తెంచేసుకున్న తన అనుబంధాల్నీ, దూరం చేసుకున్న తన వాళ్లందరినీ తిరిగి కలుసుకునేందుకు తపించిపోతాడు. ఆ తపనే మనిషిని ఏకాకితనం నుంచి అద్భుతమైన ఏకాంతానికి నడిపిస్తుంది. ఆ ఏకాంతమే మనలోని అత్యంత శక్తివంతమైన ఆలోచనా పటిమను ఆవిష్కరిస్తుంది.
ఏకాంతం ఒక అద్దాల గది
- ఏకాంతం కేవలం అందరికీ దూరంగా విడిగా ఎక్కడో కూర్చోవడం వల్ల రాదు. నిన్ను వెంటాడే భయాందోళనల కారణాలేమిటో పనికట్టగలగాలి. వాటిని అధిగమించే మార్గాలు అన్వేషించి, వాటి ద్వారా అధిగమించాలి.
- ఏళ్ల పర్యంతంగా సమాధానం లేకుండా మనలో పడి ఉన్న ప్రశ్నలేమిటో పరిశీలించుకోవాలి. ఆ ప్రశ్నలకు తాముగా సమాధానం చెప్పలేకపోతే, అనుభవ జ్ఞుల సహకారంతో ఆ సమాధానాలు సముపార్జించుకోవాలి.
- అందరూ తమకు దూరమైపోతున్నారని భావించే వారే ఎక్కువ. కానీ, తామే వారిని దూరం చేసుకుంటున్నామేమో అన్న సందేహం రావాలి. అదే నిజమైతే, అందుకు సంబంధించిన తమ లోపాల్ని సరిదిద్దుకోవాలి.
- ఒక ఏకాంత స్థితికి చేరుకున్నప్పుడు కొత్త ఆలోచ నలకు, కొత్త చర్యలకు శ్రీకారం చుట్టాలి. లేదంటే ఆ ఏకాంతం తిరిగి ఏ చర్యలూ లేని ఏకాకితనానికి నడిపించే ప్రమాదం ఉంది.
- ఏకాంతం ఒక అద్దాల గది లాంటిది. అందులో నీలోని అన్ని ముఖాలూ కనిపిస్తాయి. నీలోని లోపాలు గమనించడానికీ, నీ శక్తి యుక్తుల్ని పదును పెట్టుకోవడానికీ గొప్ప వేదికని గ్రహించాలి. డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చింతపంటి
ట్రాంక్విల్ మైండ్స్, రోడ్ నం:36,
జూబిలీ హిల్స్,హైదరాబాద్

No comments:
Post a Comment