|
____________________________________________
ఆచార వ్యవహారాలు ఎందుకు?
ఆచార వ్యవహారాలు శాంతి/ ప్రశాంతత కోసమా? లేక జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడడానికా? శాస్త్రపరంగా, సంపూర్ణ అవగాహనతో ఆచారాలను నిర్వహిస్తే అవి మనకి తప్పక మేలు చేస్తాయి. కానీ ఈ ఆచారాలన్నీ కూడా మన బాగు కోసం ఏంచేయాలో మనకి తెలియనప్పుడు చేసేవే. (పూర్వం) సాధారణంగా మనుషులు ఒక అజ్ఞానావస్తలో ఉన్నప్పుడు చేసినవే ఈ ఆచారాలు.
సమాజంలో నివసించే మనుషుల బుద్ధి పరిపూర్ణంగా పరిపక్వం చెందితే ఇక ఈ ఆచారాలెందుకు? ఇది ఒక ప్రాచీన సాంకేతిక విజ్ఞానం. ఇది ఇప్పుడు కాలావశేషం అయిపోయింది. అంటే ఇక పనికిరాదన్నమాట. ఆధునిక యుగంలో ఈ ఆచారాలన్నీ ఎలా వెర్రి తలలెత్తాయంటే కేవలం మనశ్శాంతి కోసం మనుషులు పదివేల మందిని పోగుచేసి ఒక యాగమో, హోమమో చేస్తారు. మనశ్శాంతి కావాలంటే ఇంత ప్రయాసపడే అవసరం లేదు. మనతో మనం కాసేపు గడిపి చిన్న చిన్న పనులు చేస్తే చాలు. ఇరవై నాలుగు గంటల్లో కొద్ది క్షణాలు మీతో మీరు గడపండి. కొంత సాధన చేయండి. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. అంతేకానీ దీనికోసం మనిషి పదివేల రూపాయలు ఖర్చుపెట్టే అవసరం లేదు.
ఆ మధ్య గుజరాత్‌లో భూకంపం వచ్చినపుడు లక్షమందికి పైగా మరణించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను అడిగేవారు. సద్గురు దేవుడికి మనుషులపై కోపం వచ్చిందా? ఆగ్రహాన్ని ఇలా వ్యక్తపరిచాడా? అని, ఇది అర్థంలేని సిద్ధాంతం. భూకంపం అంటే భూదేవి కాస్త ఒళ్లు విరుచుకుంది, అంతే. దానికి ఇన్ని అర్థాలను ఎందుకు ఆపాదించాలి? భారతదేశంలో జనాభా సంఖ్య విపరీతంగా ఉంది కాబట్టి ఏ కొద్దిపాటి ప్రమాదమైనా లక్షమంది మరణిస్తారు. ప్రపంచమంతటా భూకంపాలు రోజూ వస్తూనే ఉంటాయి.
ఎక్కడో ఏదో నిర్మానుష్యమైన ఎడారిలో వస్తే ఎవరూ మరణించరు కదా? అదొక సమస్య కాదు. కొద్దిపాటి ప్రకంపనలు కాలిఫోర్నియా రోజు అనుభవిస్తుంది. అయినా ఏమీ కాదే? (అక్కడే కాదు అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన జపాన్ లాంటి దేశంలో రోజూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఇటీవల కాలంలో సునామీ వలన సంభవించిన 8.9 రిక్టర్ స్కేల్ భారీ భూంకంపం గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. దానికి ముందే రాసిని వ్యాసం ఇది) అయినా ఎవ్వరూ మరణించరు ఎందుకంటే భవన నిర్మాణంలో వారికి సరైన సాంకేతిక అవగాహన, అటువంటి ప్రదేశాలలో నివసిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివేకం వారిలో మెండుగా ఉన్నాయి. కానీ భారతీయులం అటువంటి ఏమీ చేయము. పైకి చూస్తూ బతికేస్తాము, అన్నిటికీ ఆ భగవంతుడున్నాడని అంటాము. ఈ దేశం ఇంకా భగవంతుడి చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోకి తీసుకుంటేనే ఈ గందరగోళం తగ్గుతుంది.
ఈ సంఘటన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో భూకంపం రాకుండా కోస్తా ఆంధ్రలో ఎవరో ఒక యాగం చేశారని విన్నాను. లక్షమందికి పైగా ఈ యాగానికి హాజరయ్యారని తెలిసింది. ఈ యాగం ఇక్కడెందుకు చేస్తున్నాడని అడిగాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సమస్య భూకంపం కాదు, తుపాన్లు, ఏటా ఈ తుపాన్లు పంటల్ని బలి తీసుకుంటున్నాయి. అటువంటి తుపానులను ఎవరైనా యాగాలతో ఆపగలిగితే వారికి మోకరిల్లుతాను. భూకంపాల బెడద పెద్దగా లేని ఆంధ్రప్రదేశ్‌లో ఈ యాగాలు చేసే అవసరం ఉందా?
ఆ మధ్య తమిళనాడులో పోస్టర్లు చూశాను. 'మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా తక్షణం నా దగ్గరకి రండి' అని. పాతికవేలతో ఆచారవ్యవహారాలూ నిర్వహిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయట. అందరి సమస్యలు పరిష్కారమవుతాయట. మీవి తప్పించి, ఆర్థిక సమస్యలను తీర్చే సామర్ధ్యం ఉంటే భారత ఖండాన్ని గట్టెకించమనండి చాలు. అనవసరమైన కార్యకలపాలతో ఇప్పటికి చాలా సమయం, శక్తీ వృథా చేశాము. మన దేశానికున్న అతి పెద్ద సమస్య ఇది. అవసరమైనది తప్ప మరేదైనా చేయడానికి మనం సిద్ధం. ఇదే మన సమస్య. ఇది చాలా ప్రమాదం సుమా. ప్రమాదమంటే ఎక్కడో ఏదో బాంబు విస్పోటమో కాదు. సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తూ ఉంటే అది ప్రమాదమే కదా?
50 శాతానికి పైగా ప్రజానీకం "అన్నమో రామచంద్రా!'' అంటోంది. ఒక సగటు భారతీయుడి శుష్కించిన శరీరం చూస్తే తగిన పోషణ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రమాదమే కదా? 30 కోట్ల పైగా జనాభా రోజు కూలీ రూ.100 లోపే. ఇంతకంటే భారీ విపత్తు మరొకటి ఉందా? ఒక బాంబు విస్ఫోటంలోనో భూకంపంలోనో కొన్ని వేల మంది మరణిస్తారు. నిజమే ఇది అత్యంత శోచనీయం. ఇంతమంది జనాలను పేదరికం పట్టి పీడిస్తుంటే నిస్సహాయంగా చూస్తూ కూర్చుంటామా? తప్పకుండాఏదో ఒకటి చేసి తీరాలి. కానీ ఏదైనా పెద్ద బాధ్యత మన భుజాలపై వేసుకునే ముందు మనని మనం బలపరచుకోవాలి. ఎంత బలంగా ఉండాలంటే బయట పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు కుప్ప కూలిపోకూడదు.
చెక్కు చెదరకూడదు. అందుకే ఇలాంటి బలశాలులు కావాలంటే మిమ్మల్ని మీరు కొంత శ్రమింప చేసుకోవాలి. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి. స్థైర్యపరచుకోవాలి. లేకపోతే ఈ లోకం మిమ్మల్ని కబళించి వేస్తుంది.

No comments:
Post a Comment