అమ్మకు అల్టిమేటం!
తెలంగాణ ఇవ్వకపోతే తుఫానే
సోనియాకు టీ-ఎంపీల హెచ్చరిక
హోంమంత్రి తప్పుడు ప్రకటనలు చేశారు
ముఖ్యమంత్రి మమ్మల్ని జైలుకు పంపారు
మేము తలచుకుంటే కిరణ్ సర్కారు ఉండేది కాదంటూ లఖాస్త్రం
న్యూఢిల్లీ, డిసెంబర్ 13 : తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కాకుండా అభివృద్ధి మండలి, ప్యాకేజీ లాంటివి ప్రకటిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని హెచ్చరిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. అధ్యక్షురాలు సోనియాగాంధీకి మంగళవారం ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. తుఫాను ముందు ప్రశాంతత లాంటిదే నెలకొన్నదని, తగిన నిర్ణయం తీసుకోకపోతే తుఫాను రాక తప్పదని హెచ్చరించారు. సీఎం తమను జైలు పాలు చేశారని తమ లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు.
అధినేత్రి సలహా మేరకే.. సభాకార్యకలాపాలు అడ్డుకోకుండా కేవలం ఆమె దృష్టిని ఆకర్షించేందుకు లాంఛనంగా నిరసనలు తెలుపుతున్నామని, అంత మాత్రాన సమస్య ప్రాధాన్యత తగ్గిపోయినట్లు కాదని వారు స్పష్టం చేశారు. డిసెంబర్ 9న తాము నల్ల బ్యాడ్జిలను ధరించి పార్లమెంట్ వెలుపల ధర్నాలు చేయడం ద్వారా ఆ రోజుకున్న ప్రాధాన్యతను వెల్లడించామని తెలిపారు. పది మంది తెలంగాణ ఎమ్మెల్యేలు తలుచుకుంటే అసెంబ్లీలో పరిణామాలు మరోలా ఉండేవని, కీలకమైన విశ్వాసపరీక్ష రీత్యా సంఘర్షణను నివారించేందుకే తాము వారికి నచ్చజెప్పామని వివరించారు.
తెలంగాణకోసం ఎంత ఉద్యమిస్తున్నా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీకోసం నిలబడ్డారన్న విషయాన్ని ప్రశంసించాలని సోనియాకు తెలిపారు. డిసెంబర్ 9న హోం మంత్రి ప్రకటనను తాను అంగీకరించలేదని రోశయ్య చెప్పడం, కిరణ్ సర్కార్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అరెస్టు చేయడం, వందలాది విద్యార్థులను జైలు పాలు చేయడం, కాంగ్రెస్‌తో పాటు నాలుగు పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పలేదని హోంమంత్రి చిదంబరం చెప్పడంతోనే తాము పార్లమెంట్‌లో నిరసన తెలుపాల్సి వచ్చిందని టీ ఎంపీలు సోనియా దృష్టికి తీసుకువచ్చారు. రైల్‌రోకోనాడు రైల్వే మంత్రిత్వ శాఖ రైళ్లను నిలిపివేసినప్పటికీ తప్పుడు ఆరోపణలతో, దుర్మార్గమైన సెక్షన్ల క్రింద ముగ్గురు ఎంపీలను ఎందుకు జైలుకు పంపాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా తమ అభిప్రాయం చెప్పలేదని చిదంబరం ఎలా అంటారని ప్రశ్నించారు. ఇది ఆంధ్రా పెత్తందారుల కుట్రలో ఒక భాగం మాత్రమేనని ఆరోపించారు. ప్రాంతీయ మండలిని ఆమోదించే ప్రసక్తే లేదని, అలాంటి ప్రతిపాదనలేవైనా ఉంటే ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తూ వారు ఆజాద్‌కు సోమవారం లేఖ రాయడం తెలిసిందే.
కాగా, తెలంగాణ ఎంపీలు కేకే, పొన్నం, రాజయ్య తదితరులు మంగళవారం.. పీసీసీ చీఫ్ బొత్సతో కూడా మంతనాలు జరిపారు. తెలంగాణ ప్రాంత ఆవేదనను సోనియా, ఆజాద్‌ల దృష్టికి తీసుకురావల్సిందిగా కూడా వారు బొత్సను అభ్యర్థించారు. పరుషమైన పదజాలాన్ని ఉపయోగించవద్దని బొత్స వారిని కోరినట్లు తెలిసింది

___________________________________________________________________________
నూరేళ్ల నవ ఢిల్లీ
మనమేమో ఇక్కడే ఉండిపోదామనుకున్నాం, ఈ నగరమేమో ప్రేమశోకపు దుర్భిక్షంలో ఉన్నది.
ఏం తిని బతుకుదాం మనం?- మొగల్ ఉద్యానం వంటి ఢిల్లీనగరంలో వీచిన చివరి వసంతానికి పరవశించి, ఆ వెనువెంటనే సోకిన బీభత్స శిశిరానికి గుండెపగిలిన కవి గాలిబ్ కవిత అది. ప్రథమ భారత స్వాతంత్య్రసంగ్రామం పతాకసన్నివేశం ఢిల్లీలో రక్తసిక్తమవుతున్నప్పుడు గాలిబ్ అక్కడే ఉన్నాడు. మూకుమ్మడి ఊచకోతలను, మహాప్రాసాదాలు కొలువు తీరిన రహదారుల విధ్వంసాన్ని, వందలాది ఉరిశిక్షలను అతను చూశాడు. ఎందుకు ఢిల్లీ అంతగా క్షతగాత్రమయింది?
ఎందుకంటే, అప్పుడది భారతీయుల రాజధాని, స్వేచ్ఛ కోరుకుంటున్న, సామ్రాజ్యవాదిని తరిమివేయాలని పోరాడుతున్న భారతీయ ప్రజల, పాలకుల రాజధాని. ఆనాడు తెల్లవాడి రాజధాని కలకత్తా. భారతదేశంలోని మహాసామ్రాజ్యపు అవశేషాల మీద బ్రిటిష్ ఫిరంగి అంతిమ యుద్ధం చేసినప్పుడు, ఢిల్లీ తెల్లవాడికి శత్రు నగరం. అది పాత ఢిల్లీ. ఒక పురానా ఖిలా.
ఇప్పుడు శతాబ్దం పూర్తి చేసుకున్న ఢిల్లీ వేరు. ఇది న్యూఢిల్లీ. పాత ఢిల్లీని ధ్వంసం చేసినవాడే దీన్ని నిర్మించాడు. పంచమజార్జి పట్టాభిషేకం సందర్భంగా 1911 డిసెంబర్ 12వ తేదీన, స్వయంగా జార్జిచక్రవర్తే, ఢిల్లీ బ్రిటిష్ ఇండియాకు కొత్త రాజధాని అవుతుందని ప్రకటించారు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి ఏడోనిజాముతో సహా దేశంలోని సంస్థానాధీశులందరూ హాజరయ్యారు. ఈ ఉత్సవం కోసం విశాలమైన స్థలంలో గుడారాలతో ఒక చిన్నపాటి నగరాన్నే నిర్మించారు. పదిహేనో తేదీన వైస్రాయ్ భవనానికి (ప్రస్తుత రాష్ట్రపతి భవన్ కు) శంకుస్థాపన చేయడం ద్వారా జార్జి న్యూఢిల్లీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అప్పటిదాకా బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా ఉన్న కలకత్తా తూర్పుతీరంలోని బెంగాలీ నగరంగా మాత్రమే మిగిలిపోయింది. పట్టాభిషేకం సందర్భంగా న్యూఢిల్లీ ప్రకటన జరిగేవరకు, రాణీగారికి కూడా ఆ విషయం తెలియదని అంటారు. కలకత్తా నుంచి రాజధానిని మార్చడం వల్ల బెంగాలీల ఆత్మాభిమానం దెబ్బతిని, ఉద్యమాలు మొదలవుతాయేమోనని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. 1905లో మతప్రాతిపదికన బెంగాల్‌ను విభజించి చేతులు కాల్చుకున్న సామ్రాజ్యవాదులు 1911లోనే తిరిగి రెండు బెంగాల్‌లను కలుపుతూ తప్పు దిద్దుకుంది. ఆ తరువాతనే రాజధాని మార్పిడి ప్రకటన జరిగింది.
ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి భవనం, దానికి దగ్గర్లోని నార్త్ సౌత్ బ్లాక్‌లు, రాజ్‌పథ్, విదేశీ రాయబారుల కార్యాలయాలుండే ప్రాంతం- అన్నీ కలిపి న్యూఢిల్లీ. దీన్ని బ్రిటిష్ వాస్తుశిల్పి సర్ ఎడ్వర్డ్ లుట్యెన్స్ పర్యవేక్షణలో నిర్మించారు. కొత్తగా నిర్మితమైన న్యూఢిల్లీలో రహదారులు, నివాసప్రాంతాలు క్రమపద్ధతిలో, అందంగా కనిపించడానికి కారణం నవీన పద్ధతుల్లో నగరాన్ని నిర్మించడమే. అయితే, మొత్తం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల్లో న్యూఢిల్లీ ఒక జిల్లా మాత్రమే. దీని మొత్తం విస్తీర్ణం 47 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కొత్తఢిల్లీ, పాత ఢిల్లీ, హర్యానా, యుపి సరిహద్దుల్లోని శివారు ప్రాంతాలు అన్నీ కలిపి నేటి ఢిల్లీ మహానగరంగా ఉన్నది.
ఇప్పటి దేశరాజధాని విస్తరించిన చోట ఒకప్పుడు ఆరావళీ పర్వతశ్రేణి ఉండేది. ఇప్పుడు ఆ పర్వతాలు ఢిల్లీలో అక్కడక్కడా గ్రీన్‌బెల్ట్‌లలో కనిపిస్తాయి. ఇక ఢిల్లీ నగరం భూగర్భంలో అనేక మహారాజ్యాల రాజధానులు నిద్రాణమై ఉన్నాయి. పాండవుల కాలం నాటి ఇంద్రప్రస్థం అదే అంటారు. మహాభారతం సంగతి పక్కన బెడితే, 12 వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం దాకా ఎనిమిది రాజ్యాలకు ఢిల్లీ రాజధానిగా ఉండింది. మంగోలులు, టర్క్‌లు, మొగలులు, ఆప్ఘన్‌లు మొదలుకొని బ్రిటిష్‌వారి దాకా దీన్నిరాజధానిగా చేసుకున్నారు.
గత వెయ్యేళ్ల కాలంలో ఢిల్లీనగరం ఎన్నో యుద్ధాలు చూసింది, ఎంతో రక్తపాతాన్ని అనుభవించి, ఎన్నోసార్లు నేలమట్టమయింది. పద్నాలుగో శతాబ్దం చివర్లో తామర్లేను దాడిచేసినప్పుడు ఒకే రోజున ఢిల్లీలో వేలాది మంది ఊచకోతకు గురయ్యారు. దేశవిభజన సందర్భంగా ఢిల్లీ నగరం అంతా పాకిస్థాన్ నుంచి వచ్చిన లక్షలాది శరణార్థుల శిబిరాలతో నిండిపోయింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన హత్యాకాండలో వేలాదిమంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఎన్నో వేడుకలను, ఎన్నో విషాదాలను కడుపులోపెట్టుకున్నది ఢిల్లీనగరం.
న్యూఢిల్లీ నూరోపుట్టినరోజును కేంద్ర ప్రభుత్వం కానీ, చివరకు ఢిల్లీ ప్రభుత్వం కానీ అధికారికంగా జరపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్తఢిల్లీ పుట్టుక, నిర్మాణం అన్నీ వలసవాద పాలనతో ముడిపడి ఉండడం వల్లనే ప్రభుత్వాలు ఈ దూరం పాటించాయా? నిజంగా మన ప్రభుత్వాలకు ఇంకా అంత జాతీయభావన మిగిలి ఉన్నదా? ఇప్పుడు చేస్తున్నదీ, పాలిస్తున్నదీ అంతా పాత, కొత్త తెల్లదొరల దారిలోనే అయినప్పుడు, ఆ దొరతనం మూలాలను గుర్తుచేసుకోవడానికి సిగ్గెందుకు? అని ప్రశ్నించేవాళ్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. నూరేళ్ల పండగ నిజమే కానీ, నగరం పుట్టిన సందర్భానికి పండగ చేయాలా, చేస్తే ఎట్లా చేయాలి- అన్న వాటిపై సందిగ్ధత ఉన్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విలేఖరులు అడిగినప్పుడు చెప్పారు. నిజమే, స్వతంత్రభారతానికి న్యూఢిల్లీ చిహ్నం అవుతుందా? ఎందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఇంకా ఎర్రకోట నుంచే జరుపుకుంటున్నాము?
చరిత్రలో ముగిసిపోయిన ఘట్టాలను స్మరించుకుంటున్నప్పుడు, వర్తమానంలో వాటి కొనసాగింపులు కూడా గుర్తుకు వస్తాయి. వలసపాలన నిజంగానే ముగిసిందా? పాతఢిల్లీని ధ్వంసం చేసి, చివరి భారతీయ పాలకుడిని రంగూన్ జైలుకు ప్రవాసిగా పంపి, అదే చోట, వలసవాద శిల్పకళావైభవంతో నూతన నగరం నిర్మించుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ బ్రిటన్‌కు కూడా పెద్ద వైభోగమేమీ లేదు. ప్రపంచీకరణ యుగంలో, పరాధీనత, పెత్తనమూ రెండూ మారువేషాలలో విశ్వవ్యాప్తంగా విస్తరించాయి. ఢిల్లీకి కొనసాగింపుగా విస్తరించిన నోయిడా, యమునా నదిని ఆసాంతం మింగేసిన కాలుష్యమూ, భూములనుంచి రైతులను పారదోలి నిర్మించిన ఫార్ములావన్ మైదానమూ, రాచవీధుల్లో వాహనాల్లో తిరుగుతూ అత్యాచారాలు చేసే నవసంపన్న యువతరమూ- ఢిల్లీలో కొత్త 'రాజ్'కు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఢిల్లీ ఒక్కదానికే కాదు. ప్రతి చారిత్రక నగరానికీ ఒక పాతనగరం ఉన్నది. ప్రేమాదుఃఖమూ లేని దుర్భిక్షం అలుముకునే ఉన్నది.

No comments:
Post a Comment