|
_________________________________________
సందర్భం
కీర్తి వారసత్వం: కిస్సా కుర్సీ కా
- కె. శ్రీనివాస్
కడుపున పుడితేనే వారసులవుతారని మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పలేదు. మానసపుత్రులూ దత్తపుత్రులూ అంటూ రకరకాల వారసులుంటారని అవి చెప్పాయి. ఆస్తులూ భూములూ ఒక్కోసారి రాజ్యాలూ తండ్రులనుంచి కొడుకులకు, చాలా అరుదుగా కూతుళ్లకు సంక్రమించడం ఆనవాయితీయే. పెద్దకొడుకు అంత ప్రయోజకుడు కాకపోతే, వారసత్వం కోసం కొడుకుల మధ్య పోరాటం జరిగితే, అందులో సమర్థుడైనవాడినే ప్రజలు సమర్థించడం అరుదేమీ కాదు. కానీ, ప్రజాస్వామ్యయుగంలో నేతల ప్రతిష్ఠ, జనాకర్షణల వారసత్వం కోసం జరిగే పోరాటం అంత సూటిగా కత్తియుద్ధాలతో సాగదు.
పార్టీలు, సంస్థలు చీలిపోయినప్పుడు కూడా ఉమ్మడివారసత్వంలో ఎవరి వాటా ఎంత అన్న వివాదంలో, ఆఫీసు భవనాల కోసం ఎన్నికల గుర్తుల కోసం జెండాల కోసం కోర్టుల్లో వ్యాజ్యాలు నడిచినప్పటికీ, నిర్ధారణ మాత్రం ప్రజాక్షేత్రంలో జరిగిపోతుంది. పెద్దల నీడలో పెరిగి, వారి మార్గాన్నే కొనసాగించేవారికి వారసత్వంలో సమస్యలేమీ రాకపోవచ్చును కానీ, తిరుగుబాటు చేసి వారసత్వాన్ని గ్రహించాలనుకునేవారు మాత్రం సమాజం ఆమోదం కోసం చాలా ప్రయాస పడవలసి వస్తుంది. ఎన్ని యుద్ధాలు చేసి గద్దెనెక్కినవారు సైతం ఏదో ఒక పరంపరతో తమను తామే అనుసంధానించుకోకుండా పరిపాలనాహక్కును పొందడం కష్టం.
స్టాలిన్ అనంతరం సోషలిస్టు రష్యాలో అధికారాన్ని చేపట్టిన నికితా కృశ్చెవ్, తనకు ప్రజామోదం కోసం తెలివైన మార్గం అనుసరించాడు. స్టాలిన్‌ను దోషిగా, సొంత ప్రజల మీదనే అణచివేతను, నిర్బంధాన్ని సాగించిన నియంతగా నిలబెట్టదలచుకున్న కృశ్చెవ్, లెనిన్‌ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. లెనిన్‌ను కీర్తించి, పార్టీ పరమాధికారాన్ని అంగీకరించి, కృశ్చెవ్ తనను తాను నిలబెట్టుకున్నాడు. విప్లవమార్గాన్ని పరివర్తనామార్గంగా మార్చి కూడా నిలబడగలిగాడు. అయితే, సోవియట్ సమాజం మితిమీరిన స్టాలిన్‌విమర్శను సహించలేకపోయింది.
కృశ్చెవ్ అనంతరం వచ్చిన వారసులు లెనిన్ భజనను కొనసాగిస్తూ, స్టాలిన్‌పై మాత్రం మౌనాన్ని పాటించారు. చైనాలో పరిస్థితి వేరు. మావో మరణానంతరం కొద్దిసంవత్సరాలకే అధికారంలోకి వచ్చిన డెంగ్ సియావో పెంగ్- మావోను విమర్శించినప్పటికీ, పూర్తిగా ఆయనను విసర్జించగలిగే పరిస్థితి లేదు. రష్యాకు లెనిన్ ఎంతో, చైనాకు మావో కూడా అంతే. కాకపోతే, కృశ్చెవ్‌కు స్టాలిన్ విలన్ అయినట్టు, డెంగ్‌కు మావో అనుయాయులైన 'గ్యాంగ్ ఆఫ్ ఫోర్' విలన్లు. సమస్త అవాంఛనీయ సంఘటనలకూ ఆ నలుగురినీ పాపాల భైరవులను చేసి, మావో వ్యక్తిపూజను మాత్రం కొనసాగించాడు.
సాంస్కృతిక విప్లవ కాలంలో మావో వ్యక్తిపూజ విపరీత స్థాయిలో జరిగిందంటారు కానీ, అందులో వ్యక్తి ఆరాధనతో పాటు, సిద్ధాంత జపం కూడా ఉండేది. మావో సిద్ధాంతాలకూ, ఆయన వ్యక్తిత్వానికీ అభేదం పాటిస్తూ ఆకాశానికెత్తేవారు. డెంగ్ మావో సిద్ధాంతాలను పక్కనబెట్టి, ఆయన విగ్రహాలకు మాత్రం పూజలు కొనసాగించారు. నిజమైన అర్థంలో మావో వ్యక్తిపూజకు పాల్పడింది డెంగే. మావో జీవితకాలంలో ఆయనతో పోరాడిన వ్యక్తే అయినప్పటికీ, డెంగ్‌కు ఆమోదం లభించడానికి మావోను కీర్తిస్తూ ఉండడమే. డెంగ్ కంటె నాలుగాకులు ఎక్కువ చదివిన ప్రస్తుత చైనా నాయకత్వం కూడా మావో గొడుగు కిందనే తమ ఉనికిని నిలబెట్టుకుంటున్నది.
రాజీవ్‌గాంధీ చనిపోయిన తరువాత మన దేశంలో కూడా అటువంటిదే ఒక సందర్భం వచ్చింది. సాధారణ ఎన్నికల రెండు దశల మధ్య రాజీవ్ హత్య జరిగింది. ఫలితంగా, పూర్తిగా ఓడిపోవలసిన కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రధానపార్టీగా అవతరించింది. సోనియాగాంధీ వారసత్వానికి వెంటనే ఆమోదం సిద్ధించే పరిస్థితి లేదు. ప్రధాన పదవిని ఆశించగలిగిన పెద్దమనుషులు కాంగ్రెస్‌లో చాలా మందే ఉన్నారు. అందరి పోటీ మధ్య తటస్థవ్యక్తిగా పి.వి.నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆయన మనసులో ఏముందో కానీ, నెహ్రూకుటుంబ పాలనకు కళ్లెం వేద్దామనుకున్నారు.
ఇందిరను, రాజీవ్‌ను కీర్తిస్తూనే, సోనియాగాంధీని పక్కనబెట్టారు. అవిశ్వాసాలనుంచి గట్టెక్కడానికి చిన్న పార్టీల నుంచి మద్దతు కూడగట్టుకున్నారు. అడపాదడపా సోనియాను కలుస్తూనే, ప్రభుత్వ వ్యవహారాలనుంచి ఆమెను ఎడంగా ఉంచారు. ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ కసరత్తు కొనసాగించారు. మైనారిటీ ప్రభుత్వం, రాజీఅభ్యర్థిగా ఎంపికైన ప్రధాని, ఆర్థికసంస్కరణల ప్రారంభం- ఇవన్నీ కలసి- పీవీ ప్రభుత్వానికి నిజమైన ప్రజామోదం ఉన్నదా లేదా అన్న సందేహానికి తావులేకుండా చేశాయి. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ నేత అయి ఉండడం, రాజీవ్ హయాందాకా మంత్రివర్గంలో ఉండడం- ఆయనను ప్రధాని పీఠంపై చూడడానికి అభ్యంతరం లేకుండా చేసి ఉండవచ్చు.
1995లో ఎన్టీయార్‌ను దింపేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు- మరో రకమైన పరిస్థితి. పరిపాలనలో, పార్టీ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యం రీత్యా పార్టీలో సొంత బలం కూడగట్టుకున్నప్పటికీ, తిరుగుబాటుకు అనుకూలమైన భావ వాతావరణాన్ని కూడా సృష్టించుకున్నప్పటికీ, ఎన్టీయార్‌ను తప్పించి అధికారంలోకి రావడం ఒకరకంగా సాహసమే. ఎన్టీయార్ మరణించిన తరువాత వారసత్వం కోసం తగువులాడుకోవడం వంటిది కాదిది. ఆయనను పదవీభ్రష్ఠుడిని చేసి గద్దెనెక్కడం. అప్పటివరకైతే, శాసనసభ్యుల బలంతో కొనసాగవచ్చు, కానీ, ప్రజల ముందుకు వెళ్లినప్పుడు ఎన్టీయార్ జనాకర్షణను ఎదుర్కొనడం సాధ్యమా? - ఈ ప్రశ్న 1995లో చంద్రబాబుకు వచ్చే ఉండాలి.
1996 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్టీయార్ అస్తమించడంతో, ఆయన వారసురాలిగా లక్ష్మీపార్వతిని ప్రజలు గుర్తిస్తారన్న భయం కూడా ఆయనకు కలిగే ఉండాలి. అయితే, వారసత్వ స్థాయికి తగినదానినని నిరూపించుకోలేక లక్ష్మీపార్వతి ప్రజల చేతిలో భంగపడడం చంద్రబాబు దారిని సుగమం చేసింది. అయినా, ఆయన తన అధికారానికి మూలం ఎన్టీయార్ పరంపరలోనే ఉన్నదని చెప్పుకోక తప్పలేదు. చివరి సంవత్సరాలలోని సంఘటనలను పక్కనబెట్టి, ఎన్టీయార్ ప్రతిష్ఠకు తానే వారసుడినని స్థిరపరచుకోగలిగారు.
అయితే, ఇప్పటికీ, 1995 నాటి సంఘటనలు చంద్రబాబును అప్పుడప్పుడు చిరాకుపెడుతూనే ఉంటాయి. ఎన్టీయార్ మరణానంతరం ఆయనను విమర్శించడం కాంగ్రెస్ విరమించుకున్నది. ఎన్టీయార్ ప్రతిష్ఠకు రాజకీయ రంగంలో ఇంకా ఎంతో విలువ మిగిలే ఉన్నది. ఎన్టీయార్ ఒక కుమార్తె కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రి కూడా అయ్యారు, అల్లుడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఎన్టీయార్ ఆశయాలకు వారసుడు వైఎస్సార్ మాత్రమేనన్న వాదనలూ మొదలయ్యాయి. అవసరమైనప్పుడు ఎన్టీయార్ కుమారుడినో, మనవడినో ప్రచారంలోకి దింపే పని తెలుగుదేశం చేస్తూనే ఉన్నది.
రాజశేఖరరెడ్డి విషయంలో కాంగ్రెస్ పడుతున్న అవస్థ వర్ణనాతీతం. రెండోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజయవంతంగా ప్రతిష్ఠించిన రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన తరువాత, 'వారసత్వ హక్కు' కోసం ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి ప్రయత్నించినప్పుడు- ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సంకటం ఎదురయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయాలకు కారణం సోనియా ప్రతిష్ఠనా, వైఎస్సార్ జనాకర్షణా అన్న చర్చా జరిగింది. అధిష్ఠానం ఇచ్చిన స్వేచ్ఛతో సొంత బలగాన్ని అసెంబ్లీలో, బయటా పెంచుకున్న రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా తయారయ్యారు.
వైఎస్సార్ విధేయత జగన్ బలం రూపంలో పరివర్తన చెందుతున్నప్పుడు- రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠను సొంతం చేసుకుంటూనే జగన్‌ను అడ్డుతొలగించుకోవడమెట్లానో అధిష్ఠానం ఆలోచించడం మొదలుపెట్టింది. జగన్ అకృత్యాలు ఒకటొక్కటి బయటపడడం మొదలుపెట్టాక, వాటిలో వైఎస్సార్ ప్రమేయం స్పష్టంగా కనిపించసాగాక- ఒకరిని కాదని మరొకరిని ఎట్లా సొంతం చేసుకోవాలో తెలియలేదు. వైఎస్సార్‌ను కూడా నిరాకరించే ధైర్యం లేదు. 2009లో రాజశేఖరరెడ్డి గెలిపించిన ప్రభుత్వమే ఇప్పుడూ అధికారంలో ఉన్నది. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణలో వైఎస్ పాత్ర కూడా బయటపడితే, దాన్ని స్వీకరించగలిగే శక్తి కాంగ్రెస్ కు ఉన్నదా అన్నది ప్రశ్న.
2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనానికి కారణం సోనియానా, వైఎస్సా అన్న అనుమానం అధిష్ఠానానికే ఉన్నట్టున్నది. లేకపోతే, వైఎస్ వారసత్వం అన్యాక్రాంతమైపోతే కాంగ్రెస్‌ను గెలిపించుకోగలమా అన్న అనుమానం వారికి రానక్కరలేదు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్రకాంగ్రెస్‌లో జనవిశ్వాసం పొందగలిగిన సమర్థుడైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోతే, అది ప్రతిపక్షాలకే ఉపయోగపడుతుంది. ఈ రెండున్నరేళ్లలో కిరణ్‌కుమార్ అటువంటి పేరుతెచ్చుకోగలరా? వైఎస్ ప్రతిష్ఠ వారసత్వానికి ఏ విలువా లేకుండా చేయగలరా? అన్నవి ప్రశ్నలు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్ చుట్టూ జరిగిన దాగుడుమూతలు చూస్తే, రాష్ట్ర కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సదసత్సంశయం ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది.

____________________________________________________________________________________________________
Saturday, October 15, 2011
REANGS - VICTIMS OF RELIGIOUS PERSECUTION IN MIZORAM
They are popularly known in the North East as Reangs. They are the non-Christian tribe, whose original name is Bru. They inhabited the southern parts of the Christian dominated state of Mizoram. Being non-Christian in a Christian state had its price. Repeatedly subjected to persecution at the hands of the Mizo population as well as the political dispensation the Reangs - or the Bru people - were finally hounded out of the state during prolonged communal strife in 1997. It is 14 years since they had become refugees in their own land. Escaping from the marauders thousands of Reangs - men, women and children - fled into the neighbouring state of Tripura. For the last 14 years they have been living there in 7 different relief camps. A total population of nearly 35,000 these Reang refugees today lead a pathetic life. Internally Displaced Persons - IDPs - are supposed to be the responsibility of the Union Government. However the Government at the Center is too busy placating the gun-weilding terror groups in the North East and it has no time for these hapless Reang refugees. The Tripura State Government tries to do its little but that is grossly insufficient for the thousands of Reangs. They live in most inhospitable mountainous region in the North Tripura distrct along the Mizoram border. There is no water or electricity facility. Thousands of thatched huts dot hill after the hill in the region. Obviously there are no schools or hospitals. For living they depend mostly on the forests in the region. Able men and women venture into the forests and fetch firewood or teak and sell it in the nearby town to make some earning. But that too is not possible during mansoon months and in any case very few among the refugees can endure such physical labour under such had conditions. The ration that they get is shockingly low - Rs. 5 per day and 450 gms of rice per day for elders and half of it for the children. How on earth can anyone survive with Rs. 5 a day? A total of around 35,000 people survive on that meagre ration in these inhospitable jungles today. There are seven camps in total. Details of the refugee population in the camps are as follows: Camp Families Persons 1. Nayasinha Pada 3052 17668 2. Asha Pada 982 5000 3. Hazachera 770 3000 4. Kaisaka Pada 599 3800 5. Khakchang Pada 208 1300 6. Hansa Pada 312 1925 7. Naisau Pada 231 1500 The travails of these Reangs began the day they demanded a separate Autonomous District Council for them in Mizoram. Sometime in the middle of 1997 organisations like the Young Bru Association (YBA) and Bru Social Cultural Organisation (BSCO) started talking about this Council. No sooner had this demand reached Mizo organisations the retaliation began. Groups like Young Mizo Association (YMA) and Mizo Zyalai Powl (MZP), a local Christian Mizo group, started threatening the Bru people to withdraw the demand for autonomous council. Thereafter began the assault on the hapless minority Reangs. Their houses were attacked and ransacked, burnt down, looted, cattle were killed, elders were harassed, women folk abused and all this happened in front of the Government which chose to turn a blind eye. It is a known fact that several such autonomous councils exist in the states of the North East for various tribes. In that sense there was nothing unconstitutional about the demand of the Reangs. In fact there was a reason behind Reangs making this demand. For a long time they had been facing acute hardships at the hands of the majority Mizos in the areas where they traditionally lived. This discrimination reached its crescendo when the lists containing the names of the Bru people as voters had been mysteriously burnt down in a fire accident. In the subsequent re-enumeration names of hundreds of Bru people were deliberately omitted. This forced the Bru leaders to go in for the demand of autonomous council in order to protect and preserve their identity. Yet they had to face the brunt of the Mizo people and run away into the neighbouring state of Tripura seeking refuge. For the last 14 years they have been living in the jungles of the Kanchanpur sub-division of Tripura North district. Tripura Government under Sri Manik Sarkar does extend a lot of support to these refugees. In June this year a devastating fire had destroyed the thatched huts of these refugees in the densely populated Nayasinh Pada refugee camp. 24 Reangs lost their lives while thousands became home and hearthless. The Tripura State Government immediately arranged for relief and rehabilitation. District Collecter Ms. Soumya Gupta camped in the forest for ten full days to ensure that the refugees are properly rehabilitated. When I visited the camp in August this years the refugees were full of gratitude for the Government and especially the District Collecter. What struck me the most was that in the meagre rations that they receive the Reangs have saved enough money collectively to build two temple - one for Bhagwan Shiva and the other for Bhagwan Ram. They were building those temples through their own contributions and voluntary labour. The District Administration is arranging for schools, water, rough roads etc. However the central issue of their repatriation remains unanswered. The Central Government shows least interest in the plight of these refugees. Various international agencies too visit them from time to time but do little. For example representatives of the European Union visited the camps after the fire disaster. Many promises ensued. But nothing ever reached them. Their leaders understand that they shouldn't expect anything from these international bodies as they are non-Christians and their tormentors are Mizos. Whatever help they get is from the Tripura State administration and organisations like the Vanvasi Kalyan Ashram only. Even after the recent fire accident also the Kalyan Ashram has arranged for substantial relief material to help the victims. Apathy of the Central Government and reticence of the Mizoram Government make solution to the problem of the Reangs difficult. Last year the Mizoram Government succeeded in dividing the Reang leadership and buy over a section of the leaders. It came up with a oral repatriation plan according to which the people who return to Mizoram would be provided Rs. 80,000. Representatives of the Central Government force the refugees to accept the offer and return to Mizoram. However the Reang leadership is genuinely concerned about this offer. Firstly it is just an oral offer. Secondly except the meagre sum of Rs. 80,000 the Mizoram Government is not giving any other assurance to these people. For example they want to go back to the constituencies and districts where they can create enough numerical strength to ensure their own safety. But the Government refuses to allow them to change their native district or constituency. The Reangs know nothing exists in their native villages for them. They had to flee those villages precisely because they lacked any support. Now they are being forced to go back to the same places. The Government is not even assuring return of their old property. That means they have to go back and work as labour in the very fields which perhaps they owned some 20 years ago. The Reang leaders want a proper repartiation and resettlement plan. It should be properly written and documented. Talks for drafting this plan should be held in a free and fair manner. So far the tripartite talks between the Mizoram Government, Central Government and the Reang leaders used to take place in Aizwal only. In an intimidating atmosphere in Aizwal the Reangs fear that they can't get justice. The talks should take place in Agartala or Guwahati so that there can be free and frank discussion. The political rights of the Reangs need to be safeguarded in any such agreement failing which the entire community would loose its identity. Failure of the governments for years in finding a solution to their pathetic plight led to some Bru youngsters turning to the gun. They had a brush with terrorism through Bru National Liberation Front (BNLF) which made matters worse. While those who opted for the gun had been won over by the Mizoram Government through various offers and an MoU, those who wanted a peaceful and democratic settlement faced the brunt of it by way of sidelining of the real problem that the refugees face. Reangs are another case of religious persecution after the Kashmiri Pandits. Both have been persecuted for being a religious minority in their respective states. But there is a major difference. The world knows about the plight of the Pandits. They have some rights in their state in which the majority of them live. Although refugees for almost same period the Reangs have not been successful in selling their story to the outside world. Hence they suffer.... mostly silently in a remote corner of our country.
__________________________________________________________________________________________________
మల్లెమాల ఇక లేరు
రెడ్డిగారికి చిన్నప్పటినుంచే పఠనాసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివారు. అభ్యుదయ రచయిత శ్రీశ్రీ అంటే తనకి వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ రచనలన్నా ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఆ క్రమంలోనే కవిత్వం, పద్యం, పుస్తకం..ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. ఆయన తన ఇంటిపేరునే కలం పేరుగా (మల్లెమాల) మార్చుకుని ఎన్నో రచనలు చేశారు. కవితలు రాశారు. ఆయన రాసిన పద్యకవితలు..మహారచయిత విశ్వనాథ సత్యనారాయణ మెప్పు సైతం పొందాయి. ‘ఇది నా కథ’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను విడుదల చేశారు. అయితే అది వివాదాస్పదమైంది. ఇంటా, బయటా వచ్చిన ఒత్తిళ్లతో ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా నిలిపేశారు.
1966లో ‘కన్నెపిల్ల’ అనే అనువాద చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో ‘భార్య’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీర్‌తో ‘శ్రీ కృష్ణ విజయం’, చలం హీరోగా ‘ఊరికి ఉపకారి’, శోభన్‌బాబు హీరోగా ‘కోడెనాగు, నాయుడుబావ, రామబాణం, కృష్ణ హీరోగా ‘ఏకలవ్య’, రామకృష్ణ హీరోగా ‘దొరలు-దొంగలు’ నారాయణరావు హీరోగా ‘ముత్యాల పల్లకి’ నిర్మించారు. 1966 నుంచి 1987 వరకు అంటే రెండు దశాబ్దాలపాటు కౌముది పిక్చర్స్ పతాకంపై 25కు పైగా చిత్రాలను జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మించారు.
స్వయంగా సహజకవి అయిన ఎం.ఎస్.రెడ్డి దాదాపు ఐదువేలకు పైగా కవితలు, పాటలు, పద్యాలు రాశారు. తన సినిమాలలో తాను రాసిన పాటలు ఉపయోగించుకునేవారు. ఎక్కువగా ఆయన పాటలకు సత్యం మాష్టారు ట్యూన్లు కట్టేవారు. బాల రామాయణం చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు. ‘అంకుశం’ చిత్రంలో ఆయన చేసిన ముఖ్యమంత్రి పాత్ర నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది.
2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈయన తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మల్లెమాలకు పేరుంది. ఇటీవలే ఆయన ‘ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ పలు వివాదాలు సృష్టించింది. తన ఆత్మకథలో పలువురు సినీప్రముఖులపై సూటిగా విమర్శించి సంచలనం సృష్టించారు.
ఎవరికీ అపకారం చేయని వ్యక్తి. ముక్కుసూటి మనిషి. ఆయన నిష్ర్కమణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.
-డా.అక్కినేని నాగేశ్వరరావు
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ..నిర్మాత ఎం.ఎస్.రెడ్డి మృతిపట్ల తీవ్ర విభ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం గొప్ప వ్యక్తిని సినీపరిశ్రమ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పరిశ్రమకు అన్నీ తానే అయి తలో నాలుకలా మెలిగేవారు. చివరి రోజుల్లో ఏ బాదరబందీ లేని వ్యక్తిగా స్వర్గస్తులైన గొప్ప వ్యక్తి. మల్లెమాల ధన్య జీవి.
-డా డి.రామా నాయుడు
‘పల్నాటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు స్వయంగా పాటలు రాశారు. పరిశ్రమ నేడు పెద్ద దిక్కును కోల్పోయింది.
-కృష్ణ, విజయనిర్మల దంపతులు
ఉత్తమ నిర్మాత, కవి, దార్శనికుడు మల్లెమాల. తెలుగుదనం ఉట్టిపడేలా కవిత్వం రాశారు. రెడ్డిగారి మరణం విచారం కలిగించింది.
-బిజెపి నేత వెంకయ్య నాయుడు
పరిశ్రమలో నన్నెంతగానో ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిని కోల్పోయాను. ఇది పెద్ద విషాదం. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
-కృష్ణం రాజు
మల్లెమాలకు అభిమానిని. తనో అద్భుత కవి. ‘భైరవద్వీపం’ సినిమా చూసి రాకుమారి అంటే ఇలా ఉండాలి అని అభినందించారు.
-రోజా
No comments:
Post a Comment