Tuesday, October 4, 2011




మహాత్మా బిరుదును తిరస్కరించిన హజారే


మహాత్మా బిరుదును తిరస్కరించిన  హజారే


*************************************X*******************************************************


కాంగ్రెస్‌కు ఓటేయొద్దు: అన్నా హజారే



పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జనలోక్‌పాల్ బిల్లును ఆమోదించకుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు లక్నో వేదికగా దీక్ష చేపడతానని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే తెలిపారు. జనలోక్‌పాల్ బిల్లు ఆమోదించకపోతే వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయొద్దని ప్రజలను కోరతానని చెప్పారు. హర్యానాలో హిసార్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 13న జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటేయొద్దని హజారే పిలుపునిచ్చారు. ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను జైలుకు పంపి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తప్పుచేశారని అన్నారు.


******************************X***********************************
ఇది కరువు దసరా!
పల్లె సీమల్లో అలముకున్న చీకట్లు.. పట్నాల్లో కానరాని హుషారు
వర్షాభావం, కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు.. రైతు దిగాలు
పండుగ పూట పప్పన్నం లేకున్నా.. పస్తులు ఉండకుంటే చాలన్న దుస్థితి
సగటు జీవిని భయపెడుతున్న నిత్యావసర వస్తువుల ధరలు
మండుతున్న వంట నూనెలు..
చెట్టెక్కిన చింతపండు, పప్పుబెల్లాలు
పిల్లలకు కొత్త బట్టలు కరువు..
ఇళ్లలో పిండి వంటలు బరువు
బ్లాక్‌లోనూ వంట గ్యాస్ దొరకదు

బంధువుల ప్రయాణాలూ భారం.. ఇళ్లలో సందడే లేని వైనం
వాన చినుకు చాలలేదు.. కరెంటు అసలే రాదు.. మోటారు నడవదు.. పైరుకు నీరు పారదు.. పొలం ఎండిపోతోంది.. పెట్టుబడి మట్టిలో కలిసిపోతోంది.. కొండచిలువలా అప్పు కళ్లెదుట కనిపిస్తోంది.. రైతు గుండె అవిసిపోతోంది! ఎండుతున్న పొలంలో కూలీకి పని లేదు.. పని లేకపోతే కూలీ లేదు! కరెంటు కోతలతో మిల్లులు మూతపడ్డాయి.. పరిశ్రమలు నిలిచిపోయాయి.. కార్మికులకు దినసరి వేతనాలూ కరువయ్యాయి! పెద్ద రైతూ.. చిన్న రైతూ.. రైతు కూలీ.. కార్మికులు... ఎవరి చేతిలోనూ పైసా లేదు! అందరిలోనూ కొండంత దిగులు గూడుకట్టుకుంది! అందరి ఇంటా పూట గడవటమే కనాకష్టంగా మారింది!

ఇక దసరా పండుగ ఎలా ఉంది అంటే.. వారి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి!!
దసరా అంటే పది రోజుల పండుగ. ఎక్కడెక్కడి కుటుంబ సభ్యులంతా కలిసే పండుగ.. ఇల్లంతా బంధువులు సందడి చేసే పండుగ.. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు తొడిగే పండుగ.. ఇంటినిండా పిండి వంటల పండుగ.. కోళ్లు, వేటలు కోసుకుని వండుకునే పండుగ! కానీ.. ఈ ఏడాది వర్షాభావం, కరెంటు కోతలతో ముంచుకొచ్చిన కరువు, ఏటికేడాది పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడిని దసరా పండుగకు దూరం చేశాయి! ఈసారి బంధువులకు పిలుపు లేదు.. ఊళ్లకు ప్రయాణాలు లేవు.. పిల్లలకు కొత్త బట్టలు లేవు! పప్పు బెల్లాల రేట్లు చుక్కల్లో ఉన్నాయి.. పరమాన్నం, పప్పన్నం దేవుడెరుగు.. పండగపూట భార్యాబిడ్డలను పస్తు పెట్టకుండా ఉండాలన్నా.. పది రూపాయలు అప్పుపుట్టే దారీ లేదు! ఇదీ ఈ దసరా పండుగకి మన రాష్ట్రంలో ముఖ్యంగా పల్లెసీమల్లో కనిపిస్తున్న దుస్థితి!!!
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: కోరలు చాస్తున్న కరువుతో పాటు నింగినంటుతున్న ధరల కారణంగా.. రాష్ట్రంలో ఈసారి దసరా పండుగ కళ తప్పింది. పనులు లేక, కూలీలు, జీతాలు లేక సగటు జీవి ఉసూరుమంటున్నాడు. గత ఏడాది పంట చేతికందక, అందిన పంటకు గిట్టుబాటు ధర దక్కక ఇప్పటికే రైతు బక్కచిక్కి ఉన్నాడు. ఇప్పుడు చేలో ఎండుతున్న పైరును చూడలేక... ఇంట్లో పండుగ చేసుకోలేక... ఇంటా బయటా ఎక్కడా ఉండలేని దైన్యం అన్నదాతది. పెరిగిన ఎరువుల ధరలతో ఇప్పటికే పెట్టుబడులు అధికమయ్యాయి. అప్పులు రెట్టింపయ్యాయి. ప్రకృతికి తోడు ప్రభుత్వమూ పగపట్టినట్లుంది. వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతల కారణంగా ఎండిపోతున్న పంట చేతికి వస్తుందన్న ఆశ ఆవిరైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగవుతున్న వరి, పత్తి తదితర పంటలు 50 శాతానికి పైగా విస్తీర్ణంలో ఎండిపోయే దశకు చేరుకున్నాయి. రైతన్న కంట కన్నీరు పారుతోంది. ఈ పరిస్థితుల్లో పండు గేంది? అని నిర్వేదంగా వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రభావం అన్ని వర్గాలపైనా చూపుతోంది.

అందరిదీ ఒకే మాట... ‘పంటలు పండి రైతు చేతికి అందితే అందరూ సంతోషంగా ఉండేవారు. అదిలేనప్పుడు సంతోషం ఎలా ఉంటుంది?’ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పండుగ కొనుగోళ్లు సగానికిపైగా పడిపోయాయి. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు వెలవెలబోతున్నాయి. వస్త్రాలపై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) పెంచటంతో వాటి ధరలు విపరీతంగా పెరగటం కూడా పండుగ బిజినెస్ పడిపోవటానికి ఒక కారణమని వ్యాపారులే చెప్తున్నారు. కొత్త బట్టలు కుట్టించుకునే వారు తగ్గిపోవటంతో టైలర్లు కూడా దిగులుపడుతున్నారు. అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న చిరుద్యోగులకు పండుగ భారంగా పరిణమించింది. వంట గ్యాస్ ధర పెరగటంతో పాటు పండుగ కొరతతో చాలా చోట్ల బ్లాక్‌లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపును సాకుగా చూపుతూ ఇప్పటికే బస్సుల్లో టికెట్ల ధరలు పెరిగాయి. తెలంగాణలో సకల జనుల సమ్మె నేపథ్యంలో వేతన జీవులు జేబులు వెతుక్కుంటున్నారు. అయినా ఉద్యమం కోసం త్యాగం చేయటానికి సిద్ధమేనంటున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రయాణికులు అదనపు భారం మోయాల్సి వస్తోంది. పండుగపూట ప్రయివేటు ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారు. హైదరాబాద్ వెళ్లాలంటే ఒక్కొక్కరికి సాధారణ చార్జీ కన్నా రూ. 150 నుంచి రూ. 600 వరకూ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. పండుగ అంటే ఒక వ్యక్తి చేసే ప్రయాణం కాదు. ఒక కుటుంబం కదలివచ్చేది. పండుగ ఖర్చుల కోసం దాచుకున్న పదీ పరకా డబ్బు పెరిగిన చార్జీలకే ఆవిరైపోతోంది. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఇక వంట నూనెలు, పప్పు దినుసుల వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా వ్యాట్ పోటు కారణంగా విపరీతంగా పెరిగిపోవటంతో.. పండుగ పిండి వంటలపై కూడా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కందిపప్పే కాదు చివరకు చింతపండు ధర కూడా చివుక్కుమనిపిస్తోంది. పండుగకు పప్పన్నం కూడా కష్టమవుతోంది.

పిల్లల నోరు తీపి చేసే ఆశా లేదు!

పెరిగిన పప్పు, బెల్లాల ధరలతో దసరా పండుగ రోజున పరమాన్నం వండుకుంటామా అనేది అనుమానమే. బెల్లం కొనాలంటే కిలో రూ. 45 పలుకుతోంది. పండుగ రోజు పిల్లల నోరు తీపి చేద్దామనుకున్నా.. పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాము. పేద కుటుంబాలకు పనిలేకుండా పోయింది. రైతు బాగుంటే కూలీల పరిస్థితి బాగుంటుంది. పది రూపాయలు అప్పయినా దొరుకుతుంది. అప్పు చేసైనా పండుగ చేసుకుందామంటే అప్పు ఇచ్చే వారు లేరు.
- మున్నం వెంకటేశ్వరమ్మ, రెడ్డిపాలెం, మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

జీతం రాలేదు.. అయినా బాధలేదు!

గతంతో పోలిస్తే ఈసారి పండుగలకు భిన్నమైన వాతావరణం ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సకల జనుల సమ్మెలో పాల్గొనటం వల్ల జీతాలు అందలేదు. అయినా బాధ లేదు. ప్రజల మనోభావాలను గౌరవించామనే తృప్తి మిగిలింది. బతుకమ్మ, దసరా పండుగలను ఉద్యమ స్ఫూర్తితోనే జరుపుకుంటాం. ప్రతి ఉద్యోగి ఇదే విధమైన ఆలోచనవిధానంతో ఉన్నారు. అందువల్లే సమ్మె ఉధృతంగా సాగుతున్నది.
- ఊడెం వేమారెడ్డి, ఉపాధ్యాయుడు, కోదండరాంపల్లి, గజ్వేల్ మండలం (మెదక్ జిల్లా)

తంగేడు పూలైనా అమ్ముదామని వచ్చా!

పోయిన సారి దసరాకు ఇంట్లో అందరం కొత్తబట్టలు కుట్టించుకుని, పప్పలు చేసుకొని సంతోషంగా గడిపాం. కానీ ఒక 15 రోజుల నుంచి పత్తి, కంది చేలు ఎండిపోవటంతో కూలీ పనులు దొరకటం లేదు. ఎప్పుడూ కూలికి పోయే పొలం అతను కూడా పంటచేను ఎండిపోయింది అప్పుకూడా ఇవ్వలేనన్నాడు. కానీ పండగ ఎలాగైనా చేయాలి కదా! ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి? పిల్లలకు బట్టలు కొనాలి. పండగ కూడా దగ్గరకొస్తుంటే.. చేతిలో డబ్బులు లేవు. ఇక చేసేది లేక చెట్ల వెంట, పుట్ల వెంట తిరిగి ఈ తంగేడు పూలు కోసుకొచ్చా. బతుకమ్మ పండగకు ఈ పూలు పట్నంలో అమ్మి కొన్ని డబ్బులు సంపాదిస్తే పండగకు పిల్లలకు ఏమైనా కొనొచ్చు, ఏమైనా పిండివంటలు చేసి పెట్టొచ్చనే ఇలా వచ్చా. బతకమ్మ పండగ అయిపోతే ఈ పూలు అమ్మటానికి కూడా ఉండదు. అటు కూలీ లేక, ఇటు ఏ వ్యాపారం చేయలేక మా బతుకులు ఏమైతాయో అర్ధం కావట్లేదు.
- సత్యమ్మ, ఎంవెంకటాయపాలెం, ఖమ్మం మండలం (ఖమ్మంజిల్లా)

ఇంట్లో ఖర్చులకు కూడా ఇబ్బంది...

ఇదివరకు పండుగకు వారం ముందే కొత్తబట్టలు కొనుక్కొని, యాటపోతులు తెచ్చి ఇంటిముందు కట్టేసుకునేటోళ్లం. నేను, నా భార్య, ముగ్గురు కొడుకులు అందరం ఎవుసం మీదే ఆధారపడి బతుకుతున్నం. మూడున్నర ఎకరాల్లో వరిపొ లం, ఎకరంనర భూమిలో పత్తి, ఎకరం మిర్చి తోట వేశా. పం టకు వేద్దామంటే ఎరువే లేదు. నీళ్లు పెడదామంటే కరంటు లేదు. ఇప్పటికే రూ. 60 వేలకు ఎక్కువే పెట్టుబడి పెట్టిన. కండ్ల ముందే పెంచుకున్న పంట చచ్చిపోతుంటే గుండె చెరువు అవుతోంది. ఇంట్లో ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నం. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో పండుగేంటి?
- బోడ బాలు, రైతు, బోడ తండా, మహబూబాబాద్ మండలం (వరంగల్ జిల్లా)

పూజ సామగ్రి కూడా కొనలేను...

దసరా వస్తోందంటే పొట్టేళ్లు కొట్టి ఇంటికి బంధువులను పిలిచేవాడ్ని. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు, నాకు, నా భార్యకు కలసి పండుగ బట్టలకు రూ. 10 వేలు ఖర్చు చేసేవాడిని. ఇప్పుడు కొత్తబట్టలు కొనాలంటే రూ. 15 వేలైనా కావాలి. కానీ.. కనీసం ఇంట్లో పూజకు కావాల్సిన సామాగ్రి కూడా కొనలేని పరిస్థితి. నాలుగెకరాల్లో వేరుశనగ వేశా. రూ. 40 వేలు అప్పు చేశాను. దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అప్పు తీర్చే మార్గమూ లేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. పండుగ సంతోషం మాకు లేదు.
- పూల వెంకట్రమణ, ములకలచెరువు, చిత్తూరు జిల్లా

పశువుల మేతకూ కరువే!

తొమ్మిదెకరాల్లో వేరుశనగ వేశా. రూ. 90 వేలు పెట్టుబడి పెట్టా. 40 రోజులు గా వర్షం లేదు. కాయపట్టే దశలో పంట ఎండిపోయింది. ఇదివరకే రెండు లక్షల అప్పు ఉంది. ఇప్పుడు మొత్తం అప్పు రూ. 2.90 లక్షలయింది. ఈ అప్పు ఎలా తీర్చాలో! పెట్టిన పంట మొత్తం భూమిలో కలిసిపోయింది. కనీసం పశువులకు మేత కూడా దక్కలేదు. ఇక భార్యా పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వటమా?
- ఈశ్వర్‌రెడ్డి, తాటిచెర్ల, అనంతపురం రూరల్ మండలం




**************************************************************************

2జి కుంభకోణంమేం ఒప్పుకోం

Wed, 28 Sep 2011, IST    vv
చిదంబరంపై దర్యాప్తుకు నో
సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదన
కేంద్రం తీరుపై సిబిఐ అభ్యంతరం
2జి కుంభకోణంమేం ఒప్పుకోం
న్యూఢిల్లీ : 2జి స్పెక్ట్రమ్‌ కేసులో ప్రభుత్వం హోం మంత్రి చిదంబరానికి అండగా నిలబడింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సిబిఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. ఇందుకు తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన అప్లికేషన్‌పై 'ఎలాంటి ఆదేశాలు జారీ చేయనవసరం లేదు' అని సీనియర్‌ న్యాయవాది పి.పి.రావు కోర్టులో అన్నారు. జస్టిస్‌ జి.ఎస్‌.సింఘ్వి, ఎ.కె.గంగూలీలతో కూడిన ధర్మాసనం ఎదుట కేంద్రం తరపు న్యాయవాదిగా పి.పి.రావు తన వాదన వినిపించారు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సుబ్రమణ్య స్వామి కోరారు.
కోర్టులో తన వాదనలు వినిపించిన సిబిఐ కేంద్రం వైఖరిపై అభ్యంతరాన్ని తెలిపింది. సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పత్రాలను విచారణ ఏజన్సీ పరిశీలించి కోర్టుకు స్థాయి నివేదిక ఇవ్వాలన్న కేంద్రం తీరుపై సిబిఐ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 'సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. సిబిఐ ఇండిపెండెంట్‌ సంస్థ' అని సిబిఐ న్యాయవాది, సీనియర్‌ న్యాయవాది కె.కె. వేణుగోపాల్‌ అన్నారు. సిబిఐ చిదంబరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుందన్న భావనను మీడియాలో ఒక సెక్షన్‌ సృష్టించిందని అన్నారు. సుప్రీంకోర్టులో తన అప్లికేషన్‌కు, ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న తన ఫిర్యాదుకు మధ్య తేడాను గమనించాలని సుబ్రమణ్య స్వామి కోరారు. ఏ కేసులోనైనా సిబిఐ విచారణకు ఆదేశించే అధికారం విచారణ కోర్టుకు లేనందున తాను సుప్రీంకోర్టుకు వచ్చానని చెప్పారు. తాను అందజేసిన పత్రాల ఆధారంగా చిదంబరం పాత్ర ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతున్నానని ధర్మాసనం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, ఈ కేసులో రెండు ఛార్జిషీట్లు దాఖలైన అనంతరం విచారణ పర్యవేక్షణకు సుప్రీంకోర్టు అధికారాన్ని ప్రశ్నించిన కేంద్రం 2జి కేసు ప్రస్తుతం విచారణ కోర్టు, సిబిఐకి వదిలిపెట్టాలని పేర్కొంది. 'సిబిఐ తన విధులు నిర్వర్తించడం లేదు అనడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదు' అని రావు ధర్మాసనంతో అన్నారు. ఈ కేసులో తాను కేవలం కేంద్రం తరపున మాత్రమే హాజరయ్యానని, ఏ ఒక్క వ్యక్తి తరపున హాజరు కాలేదని రావు వివరణనిచ్చారు. 'నేను ఎవ్వరి తరపున హాజరుకాలేదు. కేంద్రం తరపున హాజరయ్యాను' అని చెప్పారు.
సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన అప్లికేషన్‌ ప్రత్యేక జడ్జి ఒ.పి.సైని దగ్గర పెండింగ్‌లో ఉందని, ఈ పిటిషన్‌ను విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని అన్నారు. ఈ నెల 22వ తేదీన జరిగిన ఆఖరి విచారణలో స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు సంబంధించి సిబిఐ టెలికమ్యూనికేషన్‌ విభాగాన్ని నిందించిన విషయం తెలిసిందే. సుబ్రమణ్యస్వామి పిటిషన్‌పై సిబిఐ విచారణకు ఆదేశించరాదని కూడా ధర్మాసనాన్ని కోరింది. రేడియో తరంగాలను వేలం వేయరాదన్న నిర్ణయానికి అప్పటికి ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం బాధ్యులు కాదని సిబిఐ అప్పుడు పేర్కొంది.

**************************************************************************

Monday, October 3, 2011




బంగారు బతుకై రావే బతుకమ్మ!
naresh , October 4 , 2011
 
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉ య్యాలో...’ అంటూ తెలంగాణ ఆడపడుడులు బతుకమ్మలు ఆ డుతున్నారు. తెలంగాణ పల్లెపల్లె, పట్టణాలు, నగరాలు ‘ఏ మేమి పూవ్వప్పునే గౌరమ్మ... ఏమేమి కాయప్పునే గౌరమ్మ’ అంటూ చల్లంగ చూడమని వేడుకుంటున్నాయి. గత ఎనిమిది రోజులుగా తెలంగాణ బతుకమ్మ పాటై, బతుకు పాటై ఆడుతోంది. మహాలయ అమావాస్యతో మొదలైన సందడి, నేడు తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మను ఎత్తుతోంది.

ఎంగిలిపూలతో మొదలు...

ఏటా మహాలయామావస్యనాడు బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. బతుకమ్మను తీయాలంటే ముందు ఎంగిలిపూలను గంగమ్మకు అర్పించాలి. తెల్లారక ముందే మగాళ్లు చేలు, చెలకలు, గుట్టలు, పుట్టలు దేవులాడి రుద్రాక్ష పూలను తీసుకొస్తారు. ఆడాళ్లు రుద్రాక్షలను నోటితో ఊది ‘ఎంగిలిపూలను’ నీళ్లలో వదులుతారు. వాడకట్టులోని ఆడాళ్లంతా బతుకమ్మలాడి ఇంటికి వచ్చేదాకా మగాళ్లు రక్షణగా నిలవాలి. అసలు బతుకమ్మ పండుగ అలాగే మొదలై ందని అంటారు. ఏడుగురన్నదమ్ముల ఏకైక చెల్లెల్ని వదినలు రాచిరంపాన పెడితే భరించలేక ఆమె ఇల్లు విడిచిపోయిందట. ‘ఎక్కడున్న సల్లంగ బతుకమ్మా!’అని దీవించుకుంటూ ఆ ఏడుగురన్నదమ్ములు చెల్లెల్ని వెతుకుతూ తిరిగారని ప్రతీతి. అప్పటి నుంచి మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారిందట.

సిబ్బితో బతుకమ్మ...

తంగేడు, గునుగు తదితర పూలను ఏరుకుని తెచ్చి వెదురుతో చేసిన సిబ్బిలో అలంకరించిన బతుకమ్మను మధ్యలో ఉంచి చుట్టూ తిరుగుతూ మహిళలు లయబద్ధంగా పాటలు పాడతారు. మహిళలంతా ఒక్కటై ఆడి, పాడి జరుపుకునే బతుకమ్మ పండుగ కష్టసుఖాలను పంచుకునే వేదికా అవుతుంది. అందుకే బతుకమ్మ పాట కష్టసుఖాల కలబోత అయింది. శ్రమజీవుల బతుకు పాటైంది. పౌరాణిక, చారిత్రక వనితల జీవితాల అవలోకనమైంది. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు బతుకమ్మ పోరు పాటైంది. బతుకమ్మ తెలంగాణ ప్రజాజీవితానికి, సంస్కృతికి అద్దమైంది.

సద్దుల బతుకమ్మ...

తొమ్మిదవ రోజు మహిళలు ఇత్తడి తాంబాళంలో ఎవరి స్తోమతకు తగినట్టుగా వారు బతుకమ్మలను పేరుస్తారు. పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి, అగరుబత్తులు వెలిగించి, తలపెకైత్తుకుని ఊరి చెరువు గట్టుకు బయలుదేరుతారు. మహిళలు బృందాలుగా బతుకమ్మలను మధ్యలో ఉంచి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చీకటిపడేదాకా ఆడి, పాడి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. తరువాత పలారాలు ఒకరికొకరు పంచుకుని, అక్క డే ఆరగించి, చెరువు నీళ్లు తాగి, గౌరమ్మ పాటలు పాడుకుంటూ ఇళ్లకు తిరిగి వస్తారు.

-మహమ్మద్ ఫజుల్ రహమాన్ హుస్నాబాద్, కరీంనగర్‌జిల్లా
(నేడు సద్దుల బతుకమ్మ వేడుక)






అటు విన్నపం ఇటు విధ్వంసం
kcr-pmరాష్ట్రంలో ఒక వంక రాళ్లు..ఢిల్లీలో మరోవంక వేడికోళ్లు.. సోమవారమంతా ఢిల్లీలో పోటాపోటీ భేటీలు..ఒక వైపు టీ-కాంగ్రెస్‌ నేతలు..మరో వైపు తెలంగాణా ఉద్యమ నేతలు.. ప్రధాని వద్ద పంచాయతీ.. స్పష్టమైన హామీ కోసం వీరిపట్టు.. హామీ విషయంలో ప్రధాని బెట్టు.. అంతా తెలుసు.. అందరితో మాట్లాడతా.. త్వరలో చూద్దాం... ఇదీ మన్మోహన్‌ పడికట్టు పదాల సమాహారం. రెండు బృందాలకూ ఇదే సమాధానం. బైటికొచ్చాక టీ-కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి నిర్లిప్తతా పైకి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆచితూచి మాట్లాడారు. నిర్దిష్ట కాలపరిమితి చెప్పండని అడిగినా ప్రధాని ఆ విషయం ప్రస్తావించలేనని మాత్రం ఒక్క ముక్కలో బోలెడు అర్థాన్ని విడమరచి చెప్పారు. ే


nlgfireకసీఆర్‌ బృందం తరఫున ేకసీఆర్‌ తొలుత ఆచితూచి మాట్లాడినా ఆయనలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. మెుత్తం మీద ేకసీఆర్‌ ఢిల్లీ టూర్‌ ఎలాంటి స్పష్టమైన హామీ లభించకుండా ముగిసింది. వీరి డిమాండ్లలో ఏ ఒక్కదానికీ ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చిన దాఖలాలు లేవు. టీ-కాంగ్రెస్‌ నేతలు మింగలేకా కక్కలేకా మల్లగుల్లాలు పడితే తెరాస నేతలు మాత్రం ప్రధానితో చర్చలు విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. తాము ఇంతక్రితం ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ అమలు అవుతుందని స్పష్టం చేశారు. సమ్మె ఆగదన్నారు. అంతే కాదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ేకసీఆర్‌ చెప్పారు.





ఇక అంతా చీకటే

ఆధికారికంగా కరెంటు కోతలు

హైదరాబాద్, అక్టోబర్ 3: సమ్మె దెబ్బతో ఆంధ్రకు అంధకారం అలముకుంది. విద్యుత్ సంక్షోభం ముదిరిపోవటంతో చేతులెత్తేసిన సర్కారు అధికారికంగా విద్యుత్ కోతలను ప్రకటించింది. రాజధాని హైదరాబాద్‌లో నాలుగు గంటలు, జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్ధల్లో ఆరు గంటలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఎనిమిది గంటలు కోతలు విధించాలని ట్రాన్స్‌కో సిఎండి అజయ్‌జైన్ ఆదేశించారు.
ఇక గ్రామాల్లో పట్టపగలే చీకట్లు కమ్ముకోనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విద్యుత్ ఉండదు. కానీ సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకూ విద్యుత్ సరఫరా ఉంటుంది. పరిశ్రమలకూ గడ్డుకాలం తప్పడం లేదు. వారానికి మూడు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించారు. విద్యుత్ సరఫరా అయ్యే మిగిలిన నాలుగు రోజుల్లో సాయంత్రం సమయాల్లో విద్యుత్ కోతలు పరిశ్రమలకు అమలు చేస్తారు. ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలకు విద్యుత్ పరంగా అవరోధాలున్నా, ఆరు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకునేందుకు డిస్కాంలు చర్యలు తీసుకుంటున్నాయి.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను ఏడు నుంచి ఆరు గంటలకు తగ్గించారు. ట్రాన్స్‌కోతోపాటు నాలుగు డిస్కాంలలో విద్యుత్ సరఫరా పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కంట్రోలు రూంలను ఏర్పాటు చేశారు. ఏపి ట్రాన్స్‌కోలో కంట్రోలు రూం 040-23399401 లేదా 23399402కు ఫిర్యాదులు చేయవచ్చు. వ్యవసాయరంగానికి వచ్చే 20 రోజులపాటు మాత్రమే రోజుకు ఆరు గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలను భారీ ఎత్తున అమలు చేస్తున్నందు వల్ల పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు డిస్కాం అధికార్లు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈమేరకు ట్రాన్స్‌కో సిఎండి అజయ్ జైన్ డిస్కాం అధికార్లను ఆదేశించారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సకల సనుల సమ్మె వల్ల ఆశించినట్టుగా జరగటం లేదు. బొగ్గు ఉత్పత్తి 34 వేల ఎంటికి పడిపోయింది. గత నెల 13నుంచి ఇప్పటి వరకు 17 లక్షల ఎంటి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సింగరేణిలో కూడా బొగ్గు నిల్వలు 7.7 లక్షల ఎంటి నుంచి 1.7 లక్షల ఎంటికి తగ్గాయి. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 272 ఎంయుకు చేరుకుంది. కాగా రాష్ట్రంలో 230 ఎంయు విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దాదాపు 35నుంచి 40ఎంయు విద్యుత్ లోటు ఏర్పడింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో వచ్చే 20రోజులకు మాత్రమే విద్యుదుత్పత్తికి అవసరమైన నీటి నిల్వలున్నాయి. వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సీజన్ చివరి రోజుల్లో విద్యుత్ సమస్య ముదురుతుంది. ఈనెల 2న రికార్డు స్ధాయిలో 47 ఎంయు విద్యుత్ కొరత ఏర్పడింది. గత సెప్టెంబర్ నెలలో 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారు. రోజుకు 1100 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కొరత తలెత్తింది. తమిళనాడు, కేరళ నుంచి వచ్చే విద్యుత్ కూడా నిలిచిపోయింది. అక్టోబర్ నెలలో విద్యుత్ కొనుగోలుకు 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఆశించిన రీతిలో త్వరితగతిన బొగ్గు థర్మల్ ప్రాజెక్టులకు చేరుకోవడం లేదు. రామగుండం ఎన్టీపిసిలో 2600 మెగావాట్ల విద్యుదుత్పత్తిలో సగానికి సగం పడిపోయింది. విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ ప్రాజెక్టులో ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. అదనంగా 1.7 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను కేటాయిస్తామని కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టుల కెపాసిటీ 2495 మెగావాట్లు. కాగా గ్యాస్ విద్యుదుత్పత్తి సగానికి సగం 1385 మెగావాట్లకు పడింది. దీంతో చాలినంత గ్యాస్ లేక ప్రాజెక్టులు అరకొరగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అదనంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఇంతవరకూ సానుకూలంగా స్పందించలేదని విద్యుత్ నిపుణులు పేర్కొన్నారు. ఎవరికీ కేటాయించని విద్యుత్ నుంచి 185 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం కేటాయించింది. ఇదొక్కటే కొద్దిలో కొద్దిగా ఊరట కలిగిస్తోంది. ఇది కూడా ఐదు వందల మెగావాట్ల వరకూ కేటాయించే అవకాశం ఉన్నా, కేంద్రం ఈ విషయంలో రాష్ట్రం పట్ల తాత్సార వైఖరితో ఉందని తెలుస్తోంది. పవర్ గ్రిడ్ విస్తరణ కారిడార్ తాల్చార్- కోలార్ నుంచి రోజుకు పది గంటల పాటు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ లభిస్తోంది.











మా ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో..!
ప్రధాని నోట విస్మయకరమైన మాట
తెలంగాణ నేతలకు వింత అనుభవం

ప్రధానిని కలిసిన కాంగ్రెస్, జేఏసీ నేతలు
టైం కావాల్సిందేనన్న మన్మోహన్
తెలంగాణపై దక్కని ఊరట
పరిష్కారంపై లభించని నిర్దిష్ట హామీ
3ప్రాంతాలకూ ఆమోదయోగ్య పరిష్కారం
అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కసరత్తు
ఒకరికి అనుకూలంగా ప్రకటన చేస్తే
మరో ప్రాంతం నుంచి సమస్యలు
ఒక పరిష్కారంతో మరో సమస్య రావద్దు
భాగస్వాములందరినీ సంప్రదించాలి
ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి
నేతలకు మన్మోహన్ హితబోధ
తాము సంతృప్తి చెందలేదన్న కేసీఆర్
సకల సమ్మె ఆగదని స్పష్టీకరణ
9,10,11 తేదీల్లో ఉధృతంగా రైల్‌రోకో
"తెలంగాణ సమస్య పరిష్కారానికి మాకు కొంత సమయం కావాలి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున సకల జనుల సమ్మెను విరమించండి. సమస్యకు పరిష్కారం కావాలంటే మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఎవరూ నష్టపోలేదనే రీతిలో (విన్-విన్ సిచ్యువేషన్) అది ఉండాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే, అంతకు ముందు భాగస్వాములు (స్టేక్ హోల్డర్స్) అందరినీ ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేయాలి కదా!''
-కేసీఆర్ నేతృత్వంలోని జేఏసీ నేతలతో ప్రధాని.


"ఒక ప్రాంతానికి అనుకూలంగా ప్రకటన చేస్తే.. మరొక ప్రాంతంలో సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలోనూ ఇలాగే ప్రకటనలు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక సమస్యను పరిష్కరించి మరొక సమస్యను సృష్టించుకోకూడదు. మూడు ప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అందుకే సమయం తీసుకుంటోంది. మా నిర్ణయం మూడు ప్రాంతాల ప్రజలనూ సంతృప్తి పరుస్తుంది.''
-కాంగ్రెస్ తెలంగాణ నేతలతో ప్రధాని.


న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : తమ గోడు చెప్పుకొందామని ప్రధానమంత్రి మన్మోహన్ దగ్గరకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వింత అనుభవం ఎదురైంది. తెలంగాణ సంక్షోభాన్ని సత్వరమే పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరడానికి వారు వెళ్లగా.. "కేంద్ర ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో ఉంది (స్టెబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్న్‌మెంట్ ఈజ్ ఎట్ స్టేక్)'' అని ప్రధాని వ్యాఖ్యానించడంతో వారు విస్తుపోయినంత పనైంది. సకల జన సమ్మె నేపథ్యంలో ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ జేఏసీ నేతలు సోమవారం విడివిడిగా ప్రధాని మన్మోహన్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని తెలంగాణ అంశంపై గతంలో ఎన్నడూ లేనంత చొరవతో మాట్లాడారు. అదే సమయంలో 'మరింత టైం కావాల'న్న కాంగ్రెస్ అధిష్ఠానం మాటనే ఆయన కూడా వినిపించారు. అంతకు మించి ఏ హామీ ఇవ్వలేదు. దీంతో ప్రధాని నుంచి ఏదో ఒక గట్టి మాట వస్తుందనుకున్న తెలంగాణ నేతల ఆశ నెరవేరలేదు. దాంతో సకల జన సమ్మె కొనసాగుతుందని.. ఈ నెల 9, 10, 11 తేదీల్లో రైల్‌రోకో ఉంటుందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు.

మొదట టి.కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం ప్రధానిని కలిశారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. వారి వాదనను సావధానంగా విన్న ప్రధాని 'కేంద్ర ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో ఉంది' అంటూ నర్మగర్భంగా వారి ఎదుట వ్యాఖ్యనించారు. అంతలోనే... 'మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అస్థిరతకు కారణమైన వాళ్లమవుతాం' అని ఆయన పేర్కొన్నారు. 'తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం ప్రకటించకపోయినా, ఎప్పటిలోగా పరిష్కారం లభిస్తుందో చెప్పండి.

వారమో, నెలో, ఆరు నెలలో.. ఇలా ఎప్పటి లోగా నిర్ణయం తీసుకునే అవకాశముంటే అదే విషయాన్నే ప్రకటించండి'' అని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టినప్పుడు... 'మూడు ప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కోసమే, కాంగ్రెస్ సమయం తీసుకుంటోంది'' అని ప్రధాని చెప్పారు. 'మీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన చేయించి, సకల జనుల సమ్మెను విరమింపజేయాల'ని నేతలు కోరినప్పుడు.. మన్మోహన్ తమ వైఖరిని మరింత విశదపరిచారు. 'గతంలోనూ ఇలాగే ప్రకటనలు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నాం.

ఒక ప్రాంతానికి అనుకూలంగా ప్రకటన చేస్తే.. మరొక ప్రాంతంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక సమస్యను పరిష్కరించి మరొక సమస్యను సృష్టించుకోకూడదు' అని ప్రధాని స్పష్టంచేశారు. ఇక సాయంత్రం తెలంగాణ జేఏసీ నేతలు తనను కలసినపుడు కూడా నిర్దిష్టమైన హామీ ఇవ్వడానికి ప్రధాని నిరాకరించారు. సమస్య పరిష్కారానికి సమయం కావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సకల జనుల సమ్మె, తెలంగాణ తక్షణ ఏర్పాటు ఆవశ్యకత, తీసుకోవాల్సిన చర్యల గురించి కోదండరాం తదితరులు వివరిస్తున్నప్పుడు ప్రధాని జోక్యం చేసుకుని... 'మేం ఏమేం చేస్తున్నామో ఈయనకు అన్నీ తెలుసు' అని కేసీఆర్‌ను చూపిస్తూ పేర్కొనడం విశేషం.

జేఏసీ నేతల వాదనను ఆలకిస్తూనే ప్రధాని.. వారికి హితబోధ కూడా చేశారు. 'సమస్యకు పరిష్కారం కావాలంటే మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఎవరూ నష్టపోలేదనే రీతిలో (విన్-విన్ సిచుయేషన్) అది ఉండాలి. ఈ సమస్యపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే, అంతకు ముందు భాగస్వాములు (స్టేక్ హోల్డర్స్) అందరినీ ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేయాలి కదా!'' అని ప్రధాని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రధాని తీరుపై జేఏసీ ఆగ్రహం.. నిరాశలో టి.కాంగ్రెస్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ అంశాన్ని కేంద్రం ఇప్పట్లో పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదన్న అభిప్రాయం జేఏసీ నేతల్లో వ్యక్తమవుతోంది. సమ్మెను మరింత ఉధృతం చేయడం ద్వారానే సర్కారుకు గుణపాఠం నేర్పాలని వారు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఢిల్లీ వచ్చిన కేసీఆర్.. చివరకు రిక్తహస్తాలతోనే తన బృందంతో హస్తిన వదలిపెట్టక తప్పడంలేదు.

సమస్య పరిష్కారం అంత సులభం కాదని, త్వరపడి నిర్ణయించి జాతీయ స్థాయిలో కూడా సమస్యల్ని తె చ్చిపెట్టుకోలేమని కాంగ్రెస్ నేతల బృందానికి ప్రధాని వివరించడంతో.. కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. తెలంగాణపై ఏం జరుగుతుందో అధిష్ఠానం తమను విశ్వాసంలోకి తీసుకొని చెప్పకపోవడం, మరో వైపు తమ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తోచకపోవడం టీ కాంగ్రెస్ నేతలను సైతం అగమ్య గోచర స్థితిలో పడవేసింది.

రాజీనామా చేసి తమతో పాటు ఉద్యమించాలంటూ జేఏసీ నేతలు చే స్తున్న ఒత్తిడిని కాంగ్రెస్ తెలంగాణ నేతలు తట్టుకోలేకపోతున్నారు. రాజీనామాలు చేసే విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలు, విభేదాలు వ్యక్తం కావడంతో గందరగోళం ఏర్పడింది. కేసీఆర్, జేఏసీ చెప్పిన మాటవినాలా? అధిష్ఠానానికి సహకరించాలా? అన్న మీమాంసలో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు ఉన్నారు. నిర్ణయం రానిదే ఢిల్లీ వదలబోమని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఒట్టి చేతులతోనే ఇంటిదారి పట్టవలిసి వస్తోంది.

జైపాల్ ఆవేదన.. ప్రధానితో భేటీ కాగా.. జేఏసీ నేతలు తన ఇంటికి కూడా వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించడం, తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఖిన్నుడయ్యారు. అధిష్ఠానం తమను విశ్వాసంలోకి తీసుకుని ఒక లైన్ ఇస్తే అది తాము అవలంబించేందుకు వీలుంటుందని, తాము కూడా ప్రజలకు ఏమి చెప్పాలో తేల్చుకోలేకపోతున్నామని జైపాల్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది.

అయితే కేసీఆర్ కలిసి వెళ్లిన కొద్దిసేపటికి జైపాల్ కూడా తన మంత్రిత్వ శాఖకు చెందిన విషయాలను చర్చించేందుకు ప్రధానమంత్రిని కలుసుకోవడం గమనార్హం. ఓఎన్జీసీ చైర్మన్, వేదాంత ఒప్పందం తదితర అంశాలతో పాటు తెలంగాణ అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.

దసరా అనంతరం సంప్రదింపులు వేగవంతం మరో వైపు తెలంగాణపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఎలాగూ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నందువల్ల ఒత్తిళ్ళకు లొంగకుండా తమ పంథాలో తాము నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దసరా అనంతరం తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కదలికలు ఉంటాయని తెలుస్తోంది.

తమ ప్రక్రియలో భాగంగా సీనియర్ నేతలతో కలిసి రాష్ట్రానికి ఒక బృందాన్ని పంపడం, కాంగ్రెస్ వైఖరిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం వంటి చర్యలు అమలవుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ వర్గాల ప్రకారం దసరా నుంచి దీపావళి లోపే సీడబ్ల్యూసీ సమావేశం, ఆ వెంటనే అఖిల పక్ష సమావేశం జరుగుతాయని తెలుస్తోంది. ఏమైనా రాష్ట్ర రాజకీయ, సామాజిక వ్యవస్థపై కమ్మిన కారు మేఘాలు ఈ నెలాఖరులోపు తొలగిపోతాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

Saturday, October 1, 2011







హైదరా'జాదూ'
భాగ్యనగరికి గులాంనబీ మూడు ముళ్లు
ఏదిఏమైనా కేంద్రపాలిత ప్రాంతమే!

ఆంధ్రప్రదేశ్ సమస్యకు విభజనే పరిష్కారం
అణచివేతతో తాత్కాలిక ప్రశాంతతే
రాజధానితో సీమాంద్రుల బంధాన్ని తెలంచలేం!
నివేదికలో కీలకాంశాలు
సత్వర నిర్ణయాలకు సోనియా ఆదేశం
మినీ కోర్ కమిటీ భేటీ
దసరా తర్వాత అఖిల పక్షం
న్యూఢిల్లీ, అక్టోబర్ 1 : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానంలో మథనం కొనసాగుతోంది. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాలనే యోచనతో ముందుకు కదులుతోంది. తెలంగాణ సమస్యపై అంతిమ నిర్ణయం తీసుకునేముందు... జాతీయ, ప్రాంతీయ స్థాయి పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయ దశమి తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని 'మినీ కోర్ కమిటీ' తీర్మానించింది.

శుక్రవారం కోర్ కమిటీ భేటీలో జరిగిన చర్చల ఆధారంగా, నిర్దిష్టంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యతను సోనియా గాంధీ సీనియర్ నేత ప్రణబ్‌కు అప్పగించారు. సమస్య ప్రాధాన్యం దృష్ట్యా నిర్దిష్ట నిర్ణయాలను తీసుకుని సత్వరం తనకు నివేదించాలంటూ సోనియా ఆదేశించారు. దీంతో... నవరాత్రి పూజల కోసం పశ్చిమ బెంగాల్ వెళ్లాలనుకున్న ప్రణబ్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆజాద్ కూడా తన హైదరాబాద్ పర్యటనను ఆదివారానికి మార్చుకున్నారు. ప్రణబ్ అధ్యక్షతన ఆంటోనీ, ఆజాద్, సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ చర్చలు జరిపారు.

ఆ తర్వాత ప్రణబ్ తాము తీసుకున్న నిర్ణయాలను ఒక నోట్ ద్వారా సోనియాకు నివేదించినట్లు తెలిసింది. కాంగ్రెస్ తన నిర్ణయాలను ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అఖిలపక్ష సమావేశంతోపాటు కేంద్ర ప్రతినిధులను హైదరాబాద్‌కు పంపి రాజధానికి సంబంధించిన అంశాల గురించి అధ్యయనం చేయించాలని కూడా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా దసరా తర్వాత తెలంగాణపై ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో కదలికలు ఊపందుకుంటాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

హైదరాబాద్ చుట్టూ ఆజాద్...
రాష్ట్రానికి చెందిన మూడు పార్టీల నేతలతో చర్చించి అధిష్ఠానానికి సమర్పించిన నివేదికలో గులాంనబీ ఆజాద్ మూడు పరిష్కార మార్గాలు సూచించినట్లు తెలిసింది. ఈ మూడు హైదరాబాద్ కేంద్రంగానే తిరగడం ఒక విశేషమైతే... హైదరాబాద్‌ను పూర్తిగా తెలంగాణలో అంతర్భాగంగా పేర్కొనకపోవడం మరో విశేషం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు కలిసి మెలిసి ఉండడం సాధ్యపడదని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే రాష్ట్ర విభజన తప్పదని ఆజాద్ తన నివేదికలో స్పష్టం చేశారు.

ఇరు ప్రాంతాల వారికి తమ తమ ప్రాంతాల్లో పరిపాలనకు సంబంధించిన నిర్ణయాధికారాలు అప్పజెబితే వారు విడిపోయినా కలిసి ఉంటారని, రెండు రాష్ట్రాలుగా ఉన్నా ప్రజా జీవనం గతంలోలాగే ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. "తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజాందోళనలను అణిచివేయడం ద్వారా పరిష్కరించవచ్చనే అభిప్రాయం సరికాదు. తాత్కాలికంగా ప్రశాంతత ఏర్పడినా, సమస్య మళ్లీ రగులుతుంది. విభజన తర్వాత సీమాంధ్ర ప్రత్యేకంగా ఒక బలమైన, సుసంపన్నమైన రాష్ట్రంగా అభివృద్ది చెందగలదు.

అయితే... హైదరాబాద్‌పై అక్కడి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాల్సి ఉంది'' అని తెలిపారు. "హైదరాబాద్ గత 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతోంది. ఈ నగరంతో సీమాంధ్రులు తమ బంధాన్ని తెంచుకోవడం అంత సులభం కాదు. అందువల్ల, హైదరాబాద్‌పై ఇరుప్రాంతాలకు సంతృప్తికరమైన ఒక ఫార్ములాను రూపొందించాల్సిన అవసరం ఉంది'' అని ఆజాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు సిఫారసులు చేస్తూ, వాటి పరిణామాలను కూడా విశ్లేషించారు. అవేమిటంటే...

1) తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి. పాలనా సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. కానీ...హైదరాబాద్‌ను 'ఉమ్మడి రాజధాని'గా తాత్కాలికంగా మాత్రమే అనుమతిస్తామని తెలంగాణ వాదులు అంటున్నారు. కాలక్రమంలో తమకు సొంత రాజధాని కావాలనే డిమాండ్ సీమాం«ద్రుల నుంచే వస్తుంది. అందువల్ల, సీమాంధ్ర వేరే రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

2) రాష్ట్రాన్ని విభజించి... ఇరు రాష్ట్రాలకు వేర్వేరు ప్రత్యేక రాజధానులు ఏర్పాటు చేయాలి. అప్పటిదాకా తాత్కాలికంగా హైదరాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకునేందుకు రెండింటికీ అవకాశమివ్వాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించినట్లు భవిష్యత్తులో అవసరమైతే హైదరాబాద్‌కు కూడా ఆ హోదా ఇవ్వొచ్చు.

3) తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటించాలి. సీమాంధ్రకు ప్రత్యేక రాజధానితో రాష్ట్రం ఇచ్చేయాలి. అదే సమయంలో... హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలి.

రాష్ట్రంలో తెలంగాణకంటే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని... కానీ, అక్కడ తెలంగాణలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితులు లేవని ఆజాద్ పేర్కొన్నట్లు తెలిసింది. తెలంగాణపై ఒక ఫార్ములా అనుసరించేటప్పుడు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కూడా సూచించారు. ఆజాద్ చేసిన ప్రతిపాదనల్లో దేనిలోనూ హైదరాబాద్ తెలంగాణకు పూర్తిగా సొంతం కాకపోవడం గమనార్హం! తల తెగినప్పటికీ హైదరాబాద్‌ను వదులుకోం అంటున్న తెలంగాణ నేతలు ఇందుకు అంగీకరిస్తారా?

ఆజాద్ మూడు ముచ్చట్లు
1) తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి. పాలనా సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్‌ను యూటీ చేయాలి. 2) రాష్ట్రాన్ని విభజించాలి. ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక రాజధానులను ఏర్పాటు చేయాలి. అప్పటిదాకా తాత్కాలికంగా హైదరాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకునేందుకు రెండింటికీ అవకాశమివ్వాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించినట్లు భవిష్యత్తులో అవసరమైతే హైదరాబాద్‌కు కూడా ఆ హోదా ఇవ్వొచ్చు. 3) వేరే రాజధానితో సీమాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి. హైదరాబాద్‌ను పరిపాలనా కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. అదే సమయంలో... హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలి.

విరమించండి ప్లీజ్!
సకల సమ్మెపై నేడు(ఆదివారం) ఆజాద్ అభ్యర్థన? 


ఆదివారం రాష్ట్రానికి వస్తున్న ఆజాద్ సమ్మె విరమణ దిశగా కేంద్రం తరఫున ఒక విన్నపం చేసే అవకాశం ఉంది. "సంప్రదింపులు చివరి అంకంలో ఉన్నాయి. మరికొంత సమయం మాత్రమే పడుతుంది. కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుంటుంది. సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె వివరించండి'' అని ఆజాద్ కేంద్రం తరఫున అభ్యర్థించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మన్మోహన్ కూడా ఇదే తరహా అభ్యర్థన చేయవచ్చని కూడా చెబుతున్నారు.






మౌనమే సమాధానం

మాటకు మాట ప్రతీకారం కాదు - మౌనమే దానికి సమాధానం'






గాంధీ వారసులూ.. గాడ్సేయులూ...

  • నేడు గాంధీజీ 142వ జయంతి
నేడు మహత్మా గాంధి 142వ జయంతి. గాంధీజీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది దేశభక్తి, బ్రిటిష్‌ వలస పాలకులపై పోరాటం, స్వాతంత్య్ర సంగ్రామమూ, మత సామరస్యం, దేశ స్వావలంబన, అత్యున్నత నైతిక ప్రమాణాలు, గ్రామ స్వరాజ్యం, అంటరానితనం మొదలైన విషయాలలో ఆయన సాగించిన రాజీలేని పోరాటాలు.
దేశభక్తుల, స్వాతంత్ర సమరయోధుల ఫొటోలను చూపించినా గుర్తుపట్టలేని దుస్థితిలో నేడు మన సమాజం ఉందని కొన్ని సర్వేలలో తేలిందనేది కఠోర వాస్తవం. స్వప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప విశాల ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు నేడు గుర్తింపును కోల్పోయే స్థితి రావడం నిజంగానే చాలా బాధాకరం.
గాంధీజీ మత సామరస్యాన్ని కాపాడటం కోసం, లౌకికవాదాన్ని రక్షించటం కోసం విశేష కృషి చేశారు. ఆ క్రమంలోనే ప్రేరేపిత హిందూ మతోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. దేశంలో కొన్ని స్వార్థపర శక్తులు రెచ్చగొట్టిన మత విద్వేషాలను చల్లార్చి, మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా గట్టిగా నిలబడ్డారు గాంధిజీ. మతం పేరిట సాగే మారణహోమాన్ని నివారించడానికి గాంధీజీ స్వయంగా అనేక ప్రాంతాలను పర్యటించారు. అనేక దీక్షలు చేపట్టారు. చివరకు 1947 ఆగస్టు 15న, దేశం యావత్తూ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటే, గాంధీ మాత్రం నాటి దేశ విభజన వల్ల చెలరేగుతున్న మత ఘర్షణల పట్ల బాధతో ఆ సంబరాలకు దూరంగా ఉండిపోయారు. మన దేశం స్వాతంత్య్రం సాధించడంలో కీలకమైన, విశేష కృషి చేసిన గాంధీ, ఆ కల సాకారమయినవేళ, మత సామరస్యం లేని స్వాతంత్య్రం వల్ల ఫలితం లేదని, అది దేశాన్ని మరోసారి ప్రమాదంలోకి నెడుతుందని నాడే హెచ్చరించారు. ఆరెస్సెస్‌ లాంటి హిందూ మత ఛాందస శక్తులు అధికారంలోకి వచ్చేందుకు 1947 నుంచి అనేక ప్రాంతాలలో మత ఘర్షణలను రెచ్చగొడుతూనే ఉన్నాయి. ముస్లిం ఛాందసులు కూడా వీటికి ఊతం ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జాతీయ సమగ్రతా మండలికి కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం మన దేశంలో 2009లో 791 మత ఘర్షణలు చోటు చేసుకోగా 119 మంది హత్యకు గురయ్యారు. అలాగే 2010లో 658 మత ఘర్షణలు జరగగా 111 మంది హత్య గావించబడ్డారు. 2005 నుంచి 2010 వరకు యేటా సగటున మన 130 మంది చొప్పున ఈ మత ఘర్షణలకు బలవుతూ వచ్చారు.
దేశ రాజకీయ యవనికపై కన్పించే కొన్ని అనాగరిక, ఛాందస, రాజకీయ శక్తులు, వాటి కుట్రలే దీనికి ప్రధాన కారణం. ఎంతో ఘనమైన మన స్వాతంత్య్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని ఈ మతోన్మాదశక్తులు, తాము అధికారంలోకి రావడం కోసం ప్రజల మధ్య మతం పేరిట వైషమ్యాలను నిరంతరం ఎగదోస్తూనే ఉన్నాయి. 1947 నుండి దశాబ్దాలుగా మన దేశంలో పాలకవర్గాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో పేదరికం, ఆకలి, నిరుద్యోగం పెరిగిపోతున్నాయి. రకరకాల అసమానతల ఫలితంగా సామాజిక అశాంతి, అసంతృప్తి పెరిగాయి. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని మతోన్మాదశక్తులు ప్రక్కదారి పట్టిస్తున్నాయి. దోపిడీ విధానాలతో నలిగిపోతున్న ప్రజలకు, తమ సమస్యలకు కారణం అన్య మతస్తులని ఈ మతోన్మాదులు విష ప్రచారం చేస్తున్నారు. 1950వ దశకం నుండి 1980 దశకం వరకు స్థానిక అంశాలపై మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఈ శక్తులు, 1980 నుండి దేశవ్యాపిత స్వభావం గల అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. దీనికి పరాకాష్ట మనదేశ లౌకిక చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన ఆరెస్సెస్‌, విహెచ్‌పి, బిజెపి మొదలైన హిందూ మతోన్మాద శక్తుల ఆధ్వర్యంలో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసమే. దీనికి కొనసాగింపుగా మనదేశంలో అనేక మత ఘర్షణలు జరిగాయి, నేటికీ జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ గుజరాత్‌లో గోద్రా అనంతరం సాగిన నరమేధం. ఈవిధంగా హిందూ మతోన్మాదశక్తులు తాము పెరుగుతూ మైనారిటీ ఛాందసన శక్తుల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. దీనికి ఉదాహరణలు మాలెగావ్‌, మక్కా మసీదు, అజ్మీర్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్లే. దేశంలో లౌకిక విలువల పరిరక్షణకు గాంధీజీ సాగించిన కృషిని ఆదర్శంగా తీసుకుని ఈ మతోన్మాదశక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముంది.
బ్రిటీష్‌ వారి దోపిడీ, వలస పాలనకు వ్యతిరేకంగా కూడా గాంధీ తీవ్రంగా పోరాడారు. ఉప్పులాంటి అతి సాధారణ అంశంలో బ్రిటీష్‌ వారి వైఖరికి వ్యతిరేకంగా గాంధీ దండి సత్యాగ్రహం నిర్వహించారు. పత్తి విపరీతంగా లభించే మనదేశంలో రాట్నాన్ని ఒక పెద్ద చిహ్నం (సింబల్‌)గా మార్చుకుని విదేశీ వస్త్ర బహిష్కరణలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా మన గ్రామాలు స్వయం సమృద్ధితో కూడిన గ్రామ స్వరాజ్యాలుగా ఎదగాలని ఆయన కలలుకన్నారు. బ్రిటిష్‌ వారిని తరిమేశాము. ఇప్పుడు ప్రపంచబ్యాంకు ఐఎంఎఫ్‌ డబ్ల్యుటిఓ రూపంలో నయా ఉదారవాద విధానాలు మనదేశ సార్వభౌమత్వంపై దాడి చేస్తున్నాయి. ప్రపంచబ్యాంక్‌ ఆదేశిత ఉదారవాద ఆర్థిక విధానాలు చేపట్టి మన దేశ ఆర్థిక స్వావలంబనను సామ్రాజ్యవాద దేశాలకు తాకట్టు పెడుతున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ, చేతివృత్తులు మొదలైన అనేక రంగాలలో స్వావలంబనకు మన పాలకులే తూట్లు పొడుస్తున్నారు. ఉప్పు, పప్పు లాంటి నిత్యావసర వస్తువుల వ్యాపార రంగంలోకి వాల్‌మార్ట్‌ లాంటి బహుళజాతి సంస్థలను ఆహ్వానించడం అత్యంత సిగ్గుచేటైన విషయం. రక్షణ, విదేశాంగ విధానం తదితర రంగాల్లోకి విదేశీ బముళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. ఆనాడు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని నిర్వహిస్తే ఈనాడు దానికి భిన్నంగా మన పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇది మహత్తర స్వాతంత్ర పోరాట స్ఫూర్తికే విరుద్ధం. గాంధీజీ బోధించిన విలువలను సమాధి చేయడమే. ఈవిధంగా 1948లో గాంధీజీని హిందూ మతోన్మాదులు భౌతికంగా హత్య చేస్తే, గాంధీ వారసులుగా చెప్పుకునే కాంగ్రెస్‌ పాలకులు నూతన విధానాల పేరుతో నేడు ఆయన ఆశయాలకు నిలువునా పాతరేశారు. ఈవిధంగా గాంధిజీ, ఆయన విలువలు రెండు రకాలుగా హత్యగావించబడుతున్నాయి. ఇదొక చారిత్రక విషాదం.
గాంధిజీ జీవితంలో మరో కీలకమైన ప్రమాణం నైతిక విలువల విషయంలో ఆయన అనుసరించిన వైఖరి. గాంధిజీ పాటించిన వ్యక్తిగత నైతిక ప్రమాణాలను ఆయనను రాజకీయంగా విభేదించే సుందరయ్య, ఇఎంఎస్‌ లాంటి కమ్యూనిస్టు యోధులు పాటిస్తే, ఆయన వారసులు మాత్రం ఈ ప్రమాణాలను తుంగలో తొక్కడంలో పోటీలు పడుతున్నారు. అవినీతి, అంటరానితనాన్ని వ్యతిరేకించడం, మద్యపానాన్ని నిరసించడం, అహింస మొదలైన నైతిక విలువలను పాటించడంలో ఆయన శిఖరప్రాయంగా నిలిస్తే, ఆయన వారసులు నేడు వరుస కుంభకోణాలలో మునిగి తేలుతున్నారు. తన వారసులలో ఈ విలువల పతనాన్ని గమనించిన గాంధీజీ 1948లోనే కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా రద్దు చేసి, స్వచ్చంద సంస్థగా మార్చమని కోరారు.
నేటికి గౌరవం, విలువ పొందుతున్న ఆయన కృషిలో మరో ముఖ్యమైన అంశం - సమస్యల సాధనకై ఆయన అనుసరించిన పోరాట రూపం. అదే సత్యాగ్రహం - అహింసాయుత పద్ధతిలో శాంతియుతంగా చేసే నిరాహారదీక్ష. నరేంద్రమోడి లాంటివారు ఈ దీక్షలకు దిగి వాటి పవిత్రతకు కొంత కళంకం తెచ్చినా, ఇప్పటికీ నిరాహారదీక్ష అనేది శక్తివంతమైన ఆయుధంగా ప్రాధాన్యతను కలిగి ఉంది. అలాగే వైరి పక్షాల నడుమ చేపట్టే చర్చలు, అలాగే సహాయ నిరాకరణ, పికెటింగ్‌, ధర్నా, జైల్‌భరో, శాసనోల్లంఘన వంటి విభిన్నమైన ఆయన పోరాట రూపాలు నేటికి ఆదరణ కలిగి వున్నాయి. మన దేశంలోనే గాక ప్రపంచవ్యాపితంగా ఇవి గుర్తింపు పొందాయి. అమెరికాలో 'వర్ణ వివక్ష'కు వ్యతిరేకంగా మార్డిన్‌ లూధర్‌కింగ్‌, దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయ దురహంకారాలకు వ్యతిరేకంగా నెల్సన్‌ మండెలా మొదలైన అంతర్జాతీయ ప్రముఖులు ఈ రూపాలను పాటించారు. సాయుధ పోరాటాన్ని గాంధిజీ సమర్థించకపోయినా, సమస్యల వివిధ దశలు, వివిధ స్వభావాలను బట్టి వివిధ పోరాట రూపాలను అందరూ ఆమోదించేవే. అలాగే శత్రువులకి వ్యతిరేకంగా పోరాడే ప్రజల మధ్య ఐక్యతకు ఆయన చాలా ప్రాధాన్యతనిచ్చేవారు.
(రచయిత జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి)










మరిన్ని చర్చలు

  • అందరినీ కలుపుకొనిపోవాల్సి ఉంటుంది
  • మీడియా సంయమనం పాటించాలి : ఆజాద్‌
  • ఆందోళనపై అవగాహనుంది : ప్రణబ్‌
  • రెండో రోజూ ముఖ్యనేతల ప్రత్యేక భేటీ
ప్రత్యేక తెలంగాణా సమస్య పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో మరిన్ని చర్చలు అవసరమని కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. ఈ సమస్యపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం లేదా సమస్యను పరిష్కరించడం కష్టమైన విషయమని వ్యాఖ్యానించారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో తెలంగాణా అంశంపై వరుసగా రెండో రోజూ కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌ మినహా మిగిలిన కోర్‌ కమిటీ సభ్యులైన ప్రణబ్‌ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, అహ్మద్‌పటేల్‌ శనివారమిక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారుగా గంటసేపు సాగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆజాద్‌ కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'తెలంగాణా విషయంలో మీడియా తమ ఇష్టానుసారంగా ఊహాగానాలు ప్రసారం చేయడం సరికాదు. నేను నిన్న కొన్ని తెలుగు టీవీ చానళ్ళు చూశాను. ప్రతి చానలూ తమతమ సొంత అభిప్రాయాలను ప్రసారం చేసింది. తెలంగాణా విషయంలో మేము ఏదైనా నిర్ణయం తీసుకొని, ప్రకటించే వరకూ ఇటువంటి కట్టుకథలు ప్రసారం చేయవద్దని కోరుతున్నాను. మరింత అయోమయానికి ఆస్కారం లేకుండా ఉండేందుకు నేను కొన్ని విషయాలు వెల్లడించాలని భావిస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో గత రెండు నెలలుగా నేను చర్చలు జరిపాను.
అందరి అభిప్రాయాలూ తెలుసుకున్నాను. ఇప్పుడు మేము ఇతరుల అభిప్రాయాలూ తెలుసుకోవాల్సి ఉంది. తెలంగాణా సమస్యపై వెంటనే నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. మేము అందరినీ కలుపుకొనిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్ణయం లేదా పరిష్కారం కష్టం. రాష్ట్ర పార్టీ నేతలతో చర్చలు పూర్తయ్యాయి. జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు చర్చలు జరపాల్సి ఉంది. అవసరమైతే కొందరు రాష్ట్ర నేతలతోనూ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇది ఒక్కరోజులో పరిష్కారమయ్యే సమస్య కాదు. ఒక దశ చర్చల ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని ప్రక్రియలు ఇప్పుడు ప్రారంభమౌతాయి. తెలంగాణా కాంగ్రెస్‌ నేతలతోనూ ఈ విషయం నేను స్పష్టంగా చెప్పాను' అని ఆజాద్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులడిగిన ఏ ప్రశ్నలకూ ఆయన సమాధానమివ్వలేదు.
మా పార్టీవారు నిత్యం సంప్రదిస్తున్నారు : ప్రణబ్‌
భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ కూడా క్లుప్తంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణా సమస్యపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించగా 'ప్రస్తుతం చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న కోర్‌ కమిటీలో చర్చించాం. నేడు కూడా కొందరు నేతలం చర్చించాం. మరిన్ని చర్చలు అవసరం. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనపైనా, సమస్యపైనా మాకు అవగాహన ఉంది. మా పార్టీ నేతలూ మాతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి మరికొంత సమయం పడుతుంది' అని ప్రణబ్‌ పేర్కొన్నారు.
రెండు అంశాలపై చర్చ !
శనివారం ప్రత్యేకంగా సమావేశమైన కోర్‌ కమిటీ సభ్యులు ప్రధానంగా రెండు అంశాలపై చర్చించినట్లు సమాచారం. సకల జనుల సమ్మె విరమణ కోసం కాంగ్రెస్‌ అధిష్టానం ఏదో ఒక సానుకూల ప్రకటన చేయాలని తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా సానుకూల ప్రకటన వస్తే సమ్మె విరమించడానికి ఢిల్లీలోనే ఉన్న కెసిఆర్‌ శిబిరం కూడా సిద్ధంగా ఉందన్న వాదన విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మె విరమణ కోసం తక్షణం కాకపోయినా కొద్ది రోజుల్లో ఏదైనా ప్రకటన చేయవచ్చా, లేదా అన్న అంశంపై కోర్‌ కమిటీ నేతలు చర్చించినట్లు సమాచారం. ఆదివారం ఆజాద్‌ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణకు ఎటువంటి మార్గదర్శనం చేయాలన్న అంశంపైనా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాలన, శాంతిభద్రతలు, ఎమ్మెల్యేల రాజీనామాలు, తదితర అంశాలపై అనుసరించాల్సిన వైఖరిని ఈ పర్యటన సందర్భంగా రాష్ట్ర నేతలకు ఆజాద్‌ వివరించనున్నారు.