Tuesday, January 24, 2012

మంచి నాయకత్వం ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి సాధించగలదు__అబ్దుల్ కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్య 

పుస్తకాన్ని విడుదల చేస్తున్న అబ్దుల్ కలాం, నరేంద్ర మోడి

ఈ మధ్య మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో "పాలన - ప్రజా సేవ" అంశంపై ఉపన్యసించారు. ప్రపంచంలో ఏ దేశంలో నైనా మంచి నాయకత్వం ఉంటే ఆ దేశం అభివృద్ధి సాధించగలదు, అలాగే సమస్యలను ఎదుర్కొనటానికి, పరిష్కరించేందుకు ధైర్యంగా సిద్ధపడుతుంది. గతంలో పనిచేసిన పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పాయ్ సరియైన నాయకత్వం వహించారు, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడలేదు. దానితో దేశంలో, అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంపాదించుకొన్నారు.

గుజరాత్ లో నరేంద్ర మోడి కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము సరియైన ప్రణాళికలు రచించటమే  కాదు, వాటిని అమలు చేస్తున్నారు. ఈ మధ్య గుజరాత్ ప్రభుత్వం "గ్రామాలకు వ్యవసాయ సంబంధమైన సరియైన సమాచారము అందించటం, వ్యవసాయ భూములను పరిశీలించటం, భూసారమును ఆరోగ్యవంతంగా ఉంచటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సేంద్రియ వ్యవసాయము మొదలైన అంశాలను పరిశీలించి తగు సూచనలు చేయటం ఒక ఉద్యమంగా తీసుకొంది. "కృషి మహోత్సవం" పేరుతొ తీసుకొన్న ఈ కార్యక్రమం రాష్ట్రంలోని 18000 గ్రామాలకు పాలనా యంత్రాంగము, సుమారు లక్షమంది ఉద్యోగస్తులు గ్రామాలకు కదిలారు. ముఖ్యమంత్రి నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు,  తాలూకా స్థాయి ఉద్యోగస్తులందరూ కదిలారు. ఇది ప్రభుత్వం యొక్క పటిష్ట పాలనకు గుర్తింపు. గుజరాత్ ప్రభుత్వం e - పాలనకూడా ప్రవేశపెట్టింది. అన్ని స్థాయిలలో పారదర్శకమైన పాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి అది ఉపయోగపడుతున్నది. ఈ దేశంలో సి.సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.స్వామినాధన్, బి.శివరామన్, ఆకుపచ్చ విప్లవం సృష్టించారు. డిల్లీ మెట్రో చీఫ్ బి.శ్రీధరన్ లాంటి అనేకమంది వాళ్ళ క్షేత్రంలో సరియైన నాయకత్వం అందించారు" అని అబ్దుల్ కలాం కొనియాడారు.

 

--------------------------------------------------------------------------------------------------------------

Ancient Hindu Technology stuns world: Thousand year old Shiva Statue in solid bronze


Amsterdam, January 16: It was a complete surprise for the conservators and curators of Amsterdam’s Rijks Museum as they witnessed that the Shiva Nataraj statue was in solid bronze and also the aureole and the demon under Shiva’s feet are also solid.

This Dancing Shiva statue was X-rayed using high-energy digital radiation, along with the lorry transporting it, in the most powerful X-ray tunnel for containers of the Rotterdam customs authority, normally used to scan sea containers for suspicious contents. It is said to be the first research of its kind on a museological masterpiece.

At 153 cm x 114.5 cm, the Rijksmuseum’s Shiva is the largest known bronze statue from the Chola Dynasty (9th to 12th century) kept in a museological collection outside of India. Given its weight (300 kg), the statue has always been suspected of not being hollow, as has been common practice in Europe since the Greek Antiquity.



As part of an earlier investigation, an X-ray was taken of the statue in a Rijksmuseum gallery in 1999 while visitors were evacuated as a precaution against radiation. Unfortunately, the equipment used at the time (280 KeV) was not powerful enough to determine anything definitively. The Rotterdam X-ray tunnel of the Rotterdam customs authority offered a solution.

Hindu statesman Rajan Zed has applauded Rijksmuseum for its interest in Hindu artifacts. Zed, who is President of Universal Society of Hinduism, in a statement in Nevada (USA), urged the major museums of world to acquire more Hindu sculpture and art; dedicate permanent space to Hindu artifacts; and organize more exhibitions of Hindu art, sculptures, and architecture to make aware the present and future generations about their richness.

Rajan Zed argued that because of their richness and other factors, Hindu artifacts were becoming favorite of museums in America and the West. Many prestigious museums already owned Hindu sculptures and other artifacts and many were planning to acquire.

The Rijksmuseum renovation project has provided conservators and curators the opportunity to carry out in-depth research on special pieces from the Rijksmuseum collection, including this masterpiece from the Asian Art Collection. The statue was created ca. 1100 in South India. Each temple had its own set of bronze statues which were carried through the city during major temple festivals. This gives the statues their name: utsavamurti, which is Sanskrit for ‘festival images’. Chola bronzes were considered masterpieces of Indian bronze casting.

The sculpture can be seen as evidence that India has a glorious heritage of science and technology which is superior but unknown for the current World. Essentially Western world and Westernized Indians internalized colonial stereotypes that India was less rational and scientific than the West, India was world negating in its outlook, frozen in time and unable to advance without help from foreign invaders, India's civilization was mainly imported via invaders, except for its problems such as caste that were its own 'essences' and Indian society was socially backward hence dependent upon Westernization to reform its current problems. Recent revelation indicates that Hindu civilization was a master of all skilled crafts and also the craft of life.

Anna Ślączka, curator of South Asian Art, comments, ‘We had expected that the statue itself would prove to be solid, but it was a complete surprise to discover that the aureole and the demon under Shiva’s feet are also solid.’

The 12th-century Shiva Nataraja is on loan from the Vereniging van Vrienden der Aziatische Kunst (Association of Friends of Asian Art).

The appointment of the curator of South Asian Art, Anna Ślączka, was sponsored by Staal aan Zee, Tata Steel B.V., a named fund of the Rijksmuseum.

Courtesy : News Bharati
_________________________________________________________________________________

ఇండియా గేట్

అవినీతే రాజనీతి
- ఎ.కృష్ణారావు

పార్లమెంట్ సభ్యులను ఎప్పుడు చూసినా కేంద్ర మంత్రులను కలిసేందుకు ఏదో ఒక ప్రజా సమస్యను నివేదించేందుకు లెటర్ హెడ్‌లపై తోటి ఎంపిలతో సంతకాలు సేకరిస్తూ కనపడతారు. కాని నిజానికి ఎంపిలందరూ కేంద్ర మంత్రులను కేవలం ప్రజాసమస్యలపైనే కలుస్తున్నారా? గత సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కొందరు పార్లమెంట్ సభ్యులు ఒక ప్రజాసమస్యపై కలుసుకున్నారు. ఈ సమావేశం పూర్తి కాగానే ఇద్దరు ఎంపిలు మాత్రం తాము వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడాలంటూ ఉండిపోయారు.

ఈ ఇద్దరు ఎంపిలకు వ్యాపార ప్రయోజనాలున్నాయి. ఈ ఇద్దరు ఏమి మాట్లాడి ఉంటారో ఊహించాల్సిందే. అటు వారు కానీ, ప్రణబ్ కానీ ఆ విషయం బయటకు చెప్పే అవకాశం లేదు. జైరాం రమేశ్ కేంద్ర పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలకు లేఖ రాసి సంచలనం సృష్టించారు. అనేక మంది పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల పరిధిలో లేని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గురించి లాబీయింగ్ చేస్తున్నారని, తనపై ఒత్తిడి తెస్తున్నారని, తమ కంపెనీల తరఫున పైరవీలు చేస్తున్నారని ఆయన ఈ లేఖ రాశారు.

ఇలా చేయడం నైతిక నిబంధనలకు విరుద్ధమని తాను పలు సార్లు చెప్పానని, అయినా వారు వినడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జై రాం రమేశ్ రాసిన ఈ లేఖను ఉభయ సభల అధ్యక్షులు తమ తమ ఎథిక్స్ కమిటీ చైర్మన్‌లకు పంపారు. దానిపై పార్టీలో రచ్చ జరగడంతో ఆయన తన ఆరోపణలను వెనక్కు తీసుకోవల్సి వ చ్చింది. కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కునే ప్రయత్నం చేయదు కదా? ఆ తర్వాత పార్లమెంట్‌లోనూ, బయటా ఎంపిల లాబీయింగ్‌లు సాగుతూనే ఉన్నాయి.

జైరాం రమేశ్‌ను మాత్రం పర్యావరణ శాఖనుంచి గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. మీ ఎంపి ఏమిటి? ఎప్పుడు చూసినా పైరవీలతో మంత్రుల చుట్టూ తిరుగుతుంటారు? అని కొందరు మన రాష్ట్ర్ర ఎంపిల గురించి అడిగే వారు ఎప్పుడూ తారసిల్లుతూనే ఉంటారు. వ్యాపారవేత్తలుగా ఉన్న మన రాష్ట్ర ఎంపిలతో పాటు చాలా మంది ఎంపిలు పార్లమెంట్‌కు చెందిన అత్యంత కీలకమైన ఆర్థిక కమిటీల్లో సభ్యత్వాన్ని పొందుతారు. తద్వారా అనేక ప్రభుత్వ రంగ సంస్థల, విభాగాల, బ్యాంకుల అధిపతులు, అధికారులతో సంబంధాలను ఏర్పర్చుకోవడమే కాక, తమ అధికారాన్ని ఉపయోగించి పనులు చేయించుకునే అవకాశాలున్నాయి.

నాకు ఫలానా కంపెనీలో వాటాలున్నాయి. కనుక ఆ కేసును విచారించను.. అని ఆ కేసునుంచి తప్పుకున్న న్యాయమూర్తులు ఉన్నారు. న్యాయమూర్తులు తమ ఆస్తులను కూడా ప్రకటిస్తున్నారు. వారు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు వచ్చింది. అయితే ఎంపిలకు మాత్రం ఇలాంటి జవాబు దారీ ఏమీ లేదు. తమ వ్యాపార ప్రయోజనాలకు తమ పార్లమెంట్ సభ్యత్వాన్ని ఉపయోగించుకుంటున్న వారెందరో ఉన్నారు. అంటే వారు న్యాయమూర్తుల కన్నా ఘనులా? రోజురోజుకూ పార్లమెంట్‌లో ప్రవేశిస్తున్న వ్యాపారుల సంఖ్య ఎక్కువవుతోంది.

ఈ వ్యాపారులు ఎందుకు పార్లమెంట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు? కేవలం ప్రజాసేవకోసమేనా? లేక తమ వ్యాపారాలను, ఆస్తులను విస్తరించడం కోసమా? వ్యాపారవేత్తలకు ఎంపిలు కాకముందున్న ఆస్తి, అయిన తర్వాత సంపాదించిన ఆస్తి గురించి లెక్కలేమన్నా ఉన్నాయా? పార్లమెంట్ సభ్యులైన తర్వాత వ్యాపారాలు ప్రారంభించి ఆస్తులు పెంచుకున్న వారి గురించి చిట్టా ఏమైనా ఉన్నదా? చట్ట ప్రకారం వారు ప్రజాసేవకులే కనుక అధికార దుర్వినియోగం క్రింద, ఆదాయానికి మించిన ఆస్తులున్నందుకు చర్యలు తీసుకునే అవకాశం లేదా?

చాలా దేశాల్లో ఎంపిలు తమ వ్యాపార ప్రయోజనాలను తెలిపిన తర్వాత దానికి సంబంధించిన రిజిస్టర్‌ను సభాధ్యక్షులు నిర్వహిస్తారు. రాజ్యసభలో అలాంటి రిజిస్టర్ ఉంది కాని లోక్‌సభలో లేదు. తమ వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడే కమిటీల్లో ఉన్న కొందరు రాజ్యసభ ఎంపిల గురించి ఈ రిజిస్టర్‌లో వివరాలున్నాయి కాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాదాపు 92 మంది రాజ్యసభ ఎంపిలు తమ వ్యాపార ప్రయోజనాల గురించి వెల్లడించారు.

లోక్‌సభకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజులలోగా ఎంపిలు తమ ఆస్తులను ప్రకటించాలి. కాని ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు. నిజానికి ఎంపిలందరూ తమ, తమ కుటుంబ సభ్యుల వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులు, ఆసక్తులు, తమ వృత్తి, కంపెనీల్లో వాటాలు, తాము వివిధ కంపెనీల్లో నిర్వహిస్తున్న పదవులు, వివిధ మార్గాల్లో ఆర్జిస్తున్న మొత్తం, ఎంపిలుగా తీసుకున్న బహుమానాలు, ఆతిథ్యాలు, కన్సల్టెన్సీల గురించి వివరించిన తర్వాత పార్లమెంట్‌ను వారు తమ ప్రయోజనాలకు వాడుకోకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకునే యంత్రాంగాన్ని ఏర్పర్చాలి.

ముందు జాగ్రత్త చర్యగా వారు ఆర్థిక ప్రయోజనాలు పొందే కమిటీల్లో వారికి సభ్యత్వం ఇవ్వకుండా చూడవచ్చు. అంతేకాదు, తమ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంట్ ఓటు వేసినా, ప్రసంగించినా చర్య తీసుకునే అవకాశం ఉండాలి. ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియాలి. లేకపోతే ఎలాంటి ప్రజాప్రతినిధులను తాము ఎన్నుకున్నామో వారెలా గ్రహిస్తారు?

రాజ్యసభలో మాదిరి లోక్‌సభలో కూడా ఎంపిలు తమ ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించే రిజిస్టర్ ఏర్పాటు చేసే విషయంపై ఎథిక్స్ కమిటీ రాసిన లేఖకు అనుగుణంగా స్పీకర్ మీరాకుమార్ సానుకూలంగా స్పందించారు. మంగళవారం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మాణిక్ రావు గవిట్ ఈ విషయం చర్చించేందుకు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రిజిస్టర్ ఏర్పాటు విషయంపై స్పీకర్ ఆధ్వర్యంలోని రూల్స్ కమిటీ ఎలాంటి నిబంధనలను రూపొందించకపోవడంతో సమావేశాన్ని మార్చ్ నెలకు వాయిదా వేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ సమావేశం వాయిదా వేశామని, ఇప్పుడు ఎంపిల ఆర్థిక ప్రయోజనాలను గురించి చర్చించి రాజకీయంగా రచ్చ చేసుకోవడం దేనికని కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

అయినా రిజిస్టర్ ఏర్పాటు చే సిన తర్వాత ఎంపిలు తమ ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించడం తప్పనిసరి చేయకపోయినా, నైతిక నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే యంత్రాంగం ఏర్పాటు చేయకపోయినా దాని వల్ల ప్రయోజనం లేదు. పబ్లిక్స్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా కిషోర్ చంద్రదేవ్ ఉన్నప్పుడు తన కమిటీ పరిశీలించే ఏ అంశంలోనైనా కమిటీ సభ్యులకు వ్యాపార ప్రయోజనాలుంటే తెలియజేయాలని అందరు ఎంపిలకు సర్క్యులర్ పంపారు. ఈ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యాపారవేత్తలైన ఎంపిలు సభ్యులుగా ఉన్నారు. తమ ప్రాజెక్టులు, చెల్లింపులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని వారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రహ్మదత్‌ను ప్రశ్నించడం కిషోర్ చంద్రదేవ్ దృష్టికి వచ్చింది.

రాజకీయాలూ, నైతిక సూత్రాలకు రెండింటికీ అవినాభావ సంబంధం ఉన్నదని, రెండింటినీ వేరు చేయలేమని ఎథిక్స్ కమిటీ గురించి పార్లమెంట్ ప్రచురించే డాక్యుమెంట్లలో ఘనంగా చెప్పుకున్నారు. ప్రజాప్రతినిధులను ప్రజలు ఆదర్శంగా భావిస్తారు కనుక వారు నైతికంగా ఉత్తములై ఉండాలని ఎథిక్స్ కమిటీ ఆశిస్తోంది. నిజానికి నేర చరితులకూ, మాఫియా శక్తులకూ రాజకీయ శక్తులు ప్రోత్సాహాన్నిస్తున్నాయని మాజీ హోం సెక్రటరీ వోహ్రా ఆధ్వర్యంలో ఏర్పర్చిన కమిటీ 1995లో సమర్పించిన నివేదికను ఉభయ సభలు క్షుణ్ణంగా చర్చించిన తర్వాతనే పార్లమెంట్‌లో ఎథిక్స్ కమిటీలు ఏర్పాటు చేసింది.

మాజీ ప్రధాని చంద్రశేఖర్ చైర్మన్‌గా ఉన్న ఎథిక్స్ కమిటీ తన కారుకు నకిలీ పార్లమెంట్ లేబుల్ అంటించి పార్లమెంట్‌లోకి వచ్చి పట్టుబడ్డ ఒక ఎంపిని తీవ్రంగా అభిశంసించింది. ఓటుకోసం ముడుపులు తీసుకున్న, ఎంపి లాడ్స్ నిధులు దుర్వినియోగం చేసిన ఎంపిలపై తర్వాతి కమిటీల్లో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

విచిత్రమేమంటే ఎథిక్స్ కమిటీల్లో విచారణ జరిపే ఎంపిల్లో కూడా అవినీతిపరులుండడం. కామన్‌వెల్త్ క్రీడల్లో అక్రమాలకు పాల్పడ్డ సురేష్ కల్మాడీ కూడా ఎథిక్స్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయనపై సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కమిటీనుంచి ఉద్వాసన పలికారు. నిజానికి పార్టీలు ప్రాథమిక దశలోనే జల్లెడ బట్టి అవినీతిపరులకు, నేరస్థులకు వ్యాపారాలను పెంచుకునేందుకు రాజకీయాల్లో ప్రవేశించే వారికి సీట్లు ఇవ్వకపోతే పార్లమెంటరీ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

కాని అలా జరిగేందుకు అవకాశం లేదు. తాజాగా జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున నేరచరితులు, వ్యాపారవేత్తలు, కోట్లకు పడగెత్తినవారున్నారని వివిధ సంస్థలు వెల్లడించాయి. ధన బలం, కండబలం, కులబలం ప్రధానమైన ఓటు బ్యాంకు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమవుతుందా?

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
 

No comments:

Post a Comment