Sunday, January 22, 2012

 ( కాకతీయులు ఏలిన ఓరుగల్లు....సాహితీ చరితలో సువర్ణాక్షరాల పుట్టిల్లు. వరంగల్ ఓ థ్రిల్. మూడు నగరాల త్రివేణి సంగమ సమానం .( వరంగల్, హనంకొండ, కాజీపేట ) అల్లాంటి వరంగల్ ఘనత...కాలగర్భం లో కలిసిపోనుందా ? ఈ నాటి ఆంధ్ర జ్యోతి వార్త మీ కోసం. వరంగల్ గురించి మీకు తెలుసా ? కాకతీయ వైభవం, చారిత్రాత్మక కట్టడ విశిష్టత మీకు తెలిస్తే , మాకు తెలియజేయండి. ధరిత్రి లో , చరిత్రకు ఎక్కినా ఏ పుణ్య స్థలం..మరుగున పడిపోకూడదు. ఇది మా ఆకాంక్ష !!! www.manrobo.com manrobocreations@gmail.com
) కోట గర్భంలో కాకతీయ మహా నగరం!
రాజా ప్రాసాదాల అన్వేషణలో పరిశోధకులు
జాతీయ పురాతత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ
ఖిలా వరంగల్‌లో భారీగా తవ్వకాలు
వరంగల్, జనవరి 21 : అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన నేల.. వెలకట్టలేని 'కోహినూర్' పుట్టినిల్లు.. కాకతీయ సామ్రాజ్యం. క్రీ.శ. 1150 నుంచి 1323 వరకు వర్ధిల్లిన కాకతీయులు తరతరాలకు చెరగని నైపుణ్యాలను అందించారు. ఓరుగల్లు రాజధానిగా పాలించిన రాజులు నిర్మించిన అనేక కట్టడాలు నేటికీ వరంగల్ జిల్లాలో దర్శనమిస్తాయి. ఇంతకీ కాకతీయ రాజులు ఎక్కడ నివసించారు? వారి రాజ ప్రసాదాలు ఏమయ్యాయి? ఖిలా వరంగల్ అంతర్భాగంలో కాకతీయ మహానగరం ఉందా? ఇలాంటి అనేక అంశాలపై పరిశోధనకు జాతీయ పురాతత్వ శాఖ సమాయత్తమైంది.

భూమిలో కప్పబడి పోయిందా?
సిరి సంపదలతో తులతూగిన కాకతీయ నగరం భూ అంతర్భాగంలో దాగి ఉండే అవకాశం ఉందని పురాతత్వ శాఖ భావిస్తోంది. అయితే మహ్మదీయ దండయాత్రల్లో శిథిలమైందా? ప్రకృతి వైపరీత్యాలతో భూమిలో కప్పబడిపోయిందా? అనే కోణాల్లో పరిశోధిస్తున్నారు. వరంగల్ కోటలో జరిపిన తవ్వకాల్లో ఇప్పటికే ఓ దేవాలయాన్ని వెలికితీశారు. ఈ కోట గర్భంలోనే చారిత్రక నగరం ఉండవచ్చని పరిశోధకుల అంచనా.

ఆనవాళ్ల కోసం ప్రయత్నాలు
వరంగల్ కోటలో కాకతీయ తోరణాలున్న ప్రాం తంలో తవ్వకాలు జరిపినా రాజుల నివాస ఆధారా లు లభించలేదు. ప్రస్తుతం తోరణాల నుంచి శంభునిగుడివరకు తవ్వనున్నారు. మరోవైపు ఖుష్ మహల్ ఎదురుగా శృంగారబావిని ఆనుకొని ఉన్న 8ఎకరాల విస్తీర్ణంలోనూ తవ్వకాలకు సిద్ధమవుతున్నారు. విశాలమైన ప్రహరీ పునాది ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తుండగా ఇది రాజసౌధానికి సంబంధించినది కావచ్చని భావిస్తున్నారు.

రాజ ప్రాసాదం, రాణి వాసం, పరిపాలన భవనాల ఆనుపానులు గుర్తించడానికి తవ్వకాలు చేపట్టనున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ఖిలా వరంగల్ ప్రాంతంపై నిరుడు నిర్వహించిన ఏడాదే శాటిలైట్ సర్వే ఆధారంగా ఇక్కడి జనాభా, నివాసాలు, ఖాళీ స్థల విస్తీర్ణం, పునరావాస వ్యయం తదితరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించినట్లు సమాచారం.

నివాస ప్రాంతాలే ఆటంకం
కోట విస్తీర్ణంలో ఐదు శాతమే పురాతత్వ శాఖ అధీనంలో ఉంది. మిగిలిన ప్రాంతంలోని పడమర, తూర్పు మధ్య కోటలు గ్రామాలుగా ఏర్పడ్డాయి. ఇదంతా పురావస్తుశాఖ ఆధీనంలోకి వస్తేనే పూర్తిస్థాయిలో తవ్వకాలు జరుపవచ్చు. అయితే ఆవాసాలను ఖాళీ చేయించడం అసా ధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్థానికులను ఒప్పించగలిగితేనే విస్తృత పరిశోధన వీలవుతుందంటున్నారు.

ప్రామాణిక గ్రంథమే లేదు..
కాకతీయ రాజులు వ్యవసాయానికి పెద్దపీట వేశారు. నీటి పారుదల రంగంలో వారి నైపుణ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వారి దూరదృష్టికి అద్దం పడుతుంది. రామప్ప, లక్నవరం, పాకాల, భద్రకాళి, ఘనపురం చెరువులు, ఇతర జలాశయాలే ఇందుకు నిదర్శనం.

ఇంకా అనేక విశేషాల గురించి కథలుగా చెప్పుకోవడమే తప్ప వీటి గురించి ప్రామాణిక గ్రంథం ఒక్కటీ లేదు. రాష్ట్రంలోని అనేక చారిత్రక కట్టడాలపై భారతీయ పురాతత్వ సంస్థ ఒక సిరీస్‌ని ప్రచురించినా కాకతీయ సామ్రాజ్య విశేషాలు తెలిపేదంటూ ఒకటి లేకపోవడం శోచనీయం. కోటలోని శిలాశాసనాలను విశ్లేషించి కాకతీయ విజ్ఞాన సంపదను వెలికితీయాల్సి ఉంది.

ఖిలా వరంగల్‌లో జాతీయ సెమినార్
కాకతీయ చారిత్రక సంపదను వెలికితీయడంపై ప్రత్యే క శ్రద్ధ కనబరుస్తున్నట్లు పురాతత్వ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ కన్నబాబు తెలిపారు. కాకతీయ రాజుల నివాస ప్రాంతాలను కనుగొని, వారి విశేషాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

No comments:

Post a Comment