Friday, September 16, 2011


బితుకుబితుకుమంటున్న ‘దేశ - భద్రత’:అనిల్ బట్


                    ముంబాయిపై 2008 నవంబర్ 26వతేదీన జిహాదీ బీభత్సకారులు జరిపినదాడుల నేపథ్యంలో మన సముద్రతీర రక్షక దళంలో ఉన్న లొసుగులు ఏమిటో ప్రపంచానికి వెల్లడయింది. పాకిస్తాన్ సైనిక సాయంతో, పాకిస్తాన్‌లోని బీభత్స ముఠాలు గ్రూపులు ఇచ్చిన శిక్షణలో పాల్గొన్న పదిమంది పాక్ తీవ్రవాదులు పశ్చిమ తీరం వెంబడే మన దేశంలోకి ప్రవేశించి ముంబాయిలో దాడులు చేసిన విషయం గమనార్హం. ముంబాయిలోనే గత జూలై 13న మళ్లీ జరిగిన దాడులు కూడ మన ప్రభుత్వం తీర ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టే విషయంలో ఇంకా ఏమీ నేర్చుకోలేదని, తీవ్రవాదుల ఆగడాలను, దాడులను నిరోధించేందుకు పటిష్ఠ చర్యలు ఏవీ తీసుకోలేకపోయిందని స్పష్టమవుతోంది. భారత నావికా దళం, తీర రక్షక దళం సంయుక్తంగా వేర్వేరు ప్రభుత్వ సంస్థలతో కలిసి తీరప్రాంతంలో రక్షణ చర్యలు చేపడుతున్నాయి. రక్షణకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ కమిటీ 2009 ఫిబ్రవరిలో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. భారత్ పశ్చిమ ప్రాంతంలోని సముద్ర జలాల్లో సంయుక్త నిఘాను కొనసాగిస్తున్నాయి.
వేర్వేరు ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా వస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఉన్న నిఘా సామర్థ్యాన్ని పెంచుకున్నప్పటికీ, ఇంకా లొసుగులను సరిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. సంయుక్తంగా చేపట్టిన తీరప్రాంత భద్రతా చర్యల నేపథ్యంలో అనేక లొసుగులు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర తీరప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనలను ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది - ‘్ఫదాయిన్’లు (తీవ్రవాదులు) హైజాక్ చేసిన పడవలను జుహూబీచ్, ఉత్తంజెట్టి, బద్వార్‌పార్క్‌ల వద్ద నిలిపివేయడం. హైజాక్ చేసిన పడవ సాయంతో రత్నగిరి పోర్ట్‌పై దాడి చేయడం. దాడి తర్వాత ఒక పడవ కనుపించకుండాపోవడం. ముంబాయిలో లంగరువేసిన వాణిజ్య నౌకను సముద్రదొంగలు, తీవ్రవాదులు హైజాక్ చేయడం. దబోల్‌పోర్ట్‌పై దాడి తీవ్రవాదులు చేయడం-వంటివి! ముంబాయి తీరప్రాంతంలోని సముద్రజలాల్లోకి విదేశాలకు చెందిన నౌకలు కొట్టుకు వచ్చాయి. దీని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం ఖర్చుతో కూడిన వ్యవహారమే కాకుండా సమయం కూడా వృథా అయింది. సముద్ర జలాల్లో ఏర్పాటు చేసిన రక్షణ చర్యల గురించి భారత రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోని పార్లమెంట్‌లో వేర్వేరు ప్రశ్నలకు గతనెల 3 న, 24 న సమాధానం చెప్పారు. ‘ఎమ్‌వి విజ్‌డమ్’, ‘ఎమ్‌టి పావిట్’ అనే వాణిజ్య నౌకలను ముంబాయి తీరప్రాంతంలో జూన్, జూలై నెలల్లో కనుగొన్నారు. ‘ఎమ్‌వి విజ్‌డమ్’ అనే నౌకను విప్పదీసి సముద్రంలో నిమజ్జనం చేయడానికి కొలంబో నుండి అలంగ్ ప్రాంతానికి తీసుకువచ్చారు. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడంతో తుదకు దీన్ని ముంబాయి బీచ్‌కు జూన్ 11 న తీసుకువచ్చారు. ముంబాయి కొలాబా కేంద్రం నుండి 14 మైళ్ల దూరంలో ఎమ్‌టి పావిట్‌ను సముద్ర జలాల్లో కొద్దివరకు మునిగి ఉన్న దశలో కనుగొన్నారు. భారత్‌కు చెందిన సిబ్బంది కనుగొన్న ఈ నావ దుబాయికి చెందిన ‘పావిట్ షిప్పింగ్ లైన్స్’ అన్న సంస్థదని తేలింది. ఇంజన్ చెడిపోయినందువల్ల జూన్ 30 న వదిలివేశారు. ఈ నావలోని 13 మంది భారతీయ సిబ్బందిని రాయల్ నాకాదళానికి చెందిన నౌక రక్షించి, ‘ఎమ్‌టి జాగ్‌పుష్ప’ నావలోకి చేర్చి గుజరాత్‌కు తరలించారు. ముంబాయిలోని సముద్రతీర సహాయ అనుసంధాన కేంద్రం- మేరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ - ఎమ్‌ఆర్‌సిసి- ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించి, సముద్రంలో లభించిన నౌక యాజమాన్యం (దుబాయ్‌లోని పావిట్ షిప్పింగ్ లైన్స్) తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే సదరు నౌక -ఎమ్‌టి పేవిట్- సముద్ర జలాల్లో పూర్తిగా మునిగిపోయిందని యుకె మేరిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమాచారం అందించిందని పావిట్ షిప్పింగ్ లైన్స్‌వారు మన సముద్రతీర సహాయ అనుసంధాన కేంద్రం వారికి తెలియచేసినారు. తీరప్రాంతంలో పరిస్థితి గురించి ప్రభుత్వ యంత్రాంగం అందించిన సమాచారాన్ని ఆంటోని పార్లమెంట్‌కు తెలియచేశారు. ఎమ్‌వి పావిట్ అనే నౌకను సకాలంలో గుర్తించకపోవడానికి రాడార్ వ్యవస్థకు అందుబాటులోలేని ప్రాంతంలో అది ఉండటమేనని పార్లమెంట్‌కు ఆంటోని తెలిపారు. వాతావరణపరిస్థితి కూడా బాగా లేకపోవడం వల్ల దాని జాడ తెలియలేదని, బ్యాటరీ పూర్తిగా నిరుపయోగంగా మారడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఈ నౌక ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం పనిచేయలేదని ఆంటోని వివరించారు. తీరప్రాంత రక్షక దళాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకున్నదని లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. గస్తీని ముమ్మరం చేయడంతో పాటు రక్షణ వ్యవస్థను సమర్థతగా రూపొందించడం తదితర అంశాలన్నీ రక్షక దళ పటిష్టంలో భాగమేనని వివరించారు. తీరప్రాంతంతో పాటు ద్వీపాలలో రక్షణ కార్యక్రమాలను వేర్వేరు శాఖలు సమన్వయంగా పర్యవేక్షిస్తాయని వెల్లడించారు. నేవీ, తీరరక్షక దళం, కోస్టల్ పోలీస్, కస్టమ్స్ తదితర శాఖలు కలిసి పనిచేస్తున్నాయని ఆంటోని వివరించారు. వేర్వేరు స్థాయిలలో ప్రభుత్వం ఈ అంశాలపై సమీక్ష చేస్తున్నట్టు వెల్లడించారు. రక్షణ వ్యవస్థను పర్యవేక్షించడంలో సహకరించేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా పటిష్టం చేశామని తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం తీరప్రాంతంతో సహా ద్వీపాలన్నింటిని రాడార్ వ్యవస్థ పరిధిలోకి తీసుకువస్తున్నామన్నారు. అంటే ఎక్కడ పరిస్థితిని పర్యవేక్షించాలన్నా రాడార్ వ్యవస్థ ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. రక్షణకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ 2009 ఫిబ్రవరి 16 న చేసిన సిఫార్సులను గత ఆగస్టు 3 న ఆంటోని పార్లమెంట్‌కు తెలిపారు. ఈ సిఫార్సుల వివరాలు ఇలా ఉన్నాయి. ముంబాయి, విశాఖపట్నం, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్‌లలో భద్రతా సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నేవీ, తీర రక్షక దళాలు సంయుక్తంగా ఈ కేంద్రాలను నిర్వహించాలి. జాతీయ స్థాయిలో కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్లు, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించేందుకు ఒక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేచాలి. నేవీ, కోస్ట్‌గార్డ్‌ల కార్యక్రమాలను ఈ విభాగాలు పర్యవేక్షించడంతో పాటు వీటిని అనుసంధానం చేస్తూ, పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యంత వేగంగా దూసుకు వెళ్లగల 80 పర్యవేక్షక విమానాలతో సహా వెయ్యి మంది సిబ్బందితో ‘సాగర్ ప్రహారి బల్’ అనే రక్షక, నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలి. నావికాదళ స్థావరాలను, విలువైన ఆస్తులను పరిరక్షించడం కోసం ఈ విభాగాన్ని వినియోగించాలి. భూ, ఆకాశ మార్గాల్లో రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తూ, యుద్దనౌకలను, వైమానిక దళాలను అవసరమైన మేరకు ఏర్పాటు చేయడం. తద్వార తీరప్రాంతాల్లో అభివృద్ధికి విఘాతం కలగకుండా చూడాలి. తూర్పు, పశ్చిమ తీరాల్లో నిరంతరం తీరప్రాంత రక్షక దళాలు కవాతు కొనసాగించాలి. సముద్రంలో రక్షణకు సంబంధించి మత్స్యకారుల్లో చైతన్యం కలిగించడం కోసం నేవీతో పాటు తీరప్రాంత రక్షక దళాలు కృషి చేయాలి. దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా ఆటోమేటిక్ కోస్టల్ రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి. మెరైన్ పోలీసు దళాలను పటిష్టం చేయాలి. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఈ విధంగా ఉండాలని క్యాబినెట్ కమిటీ స్పష్టం చేసింది. ఓడరేవులలోకి వచ్చే నౌకలు, వెళ్లే నౌకల వివరాలను నమోదు చేస్తూ, తీవ్రవాదుల చొరబాటుకు అవకాశం లేకుండా నౌకా కాయాన డైరక్టర్‌జనరల్ నేతృత్వంలో పర్యవేక్షక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ఓడరేవుల భద్రత కోసం పడవలపై నిరంతరం గస్తీ కొనసాగించాలి. అనుమానాస్పదంగా ఉండే నౌకలను తనిఖీ చేసిన తర్వాతనే పోర్టుల్లోకి అనుమతించాలి. అంతర్జాతీయ నౌకల రాకపోకలపై నిఘా ఖచ్చితంగా ఉండేలా చూస్తూ, ఇందుకోసం సెక్యూరిటీ కోడ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.
మత్స్యకారుల, సముద్రతీర పరిరక్షణ సమితి కింది చర్యలు చేపట్టాలి. చేపల పడవలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. నిర్ణీత ప్రాంతంలోనే చేపల వేట కొనసాగేలా చూడాలి. చేపల వేట సామూహికంగా ఉండేలా చూడాలి. సామాన్లను రవాణా చేసేందుకు చేపల పడవలకు అనుమతించకూడదు. రక్షణ చర్యలపై తీరప్రాంత గ్రామాల ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇవి ముఖ్యమైనవి. మహారాష్ట్ర 720 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ముంబాయి, కొత్త ముంబాయి, థానే, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలు తీరప్రాంతంలో ఉన్నాయి. ఈ తీర ప్రాంతంలో 16 ద్వీపాలు ఉండగా, వీటిలో ఆరు ద్వీపాల్లో జనం నివసించడం లేదు. ఇక్కడ రెండు భారీ ఓడరేవులు, 48 చిన్న ఓడరేవులున్నాయి. ఇక్కడ 21,500 యాంత్రిక పడవలు, 2,032 సాధారణ పడవలున్నాయి. దాదాపు 2,66,594 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి ఉన్నారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే సముద్రతీర భద్రతా వ్వవస్థలన్నింటినీ సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.

No comments:

Post a Comment