Friday, September 9, 2011


హిందువులపై జిజియా పన్ను

గత ఏప్రిల్ నెలలో పాకిస్తాన్లోని వోరాక్ ఝాయ్ లో నివసిస్తున్న సిక్ఖులపై తాలిబన్లు 2 కోట్ల రూపాయల జిజియా పన్ను విధించారనే వార్త పత్రికలలో వచ్చింది. ఈ సంఘటన హిందువుల ఆత్మాభిమానాన్ని గాయపరచింది.
  • ముస్లిముల మత గ్రంథాల ప్రకారం ఒక ముస్లిం రాజ్యంలోని ముస్లింలందరూ సైనికులే. వారి రక్షణ సహజ సిధ్ధంగా రాజుల అధీనంలో వుంటుంది. కానీ భారతదేశంలోని ముస్లిం రాజ్యాలలో హిందువులు సైనికులుగా పరిగణింప బడరు. కాబట్టి వారి రక్షణ నిమిత్తం తప్పనిసరిగా జిజియా పన్ను కట్టాలి. (అంటే ఇది పూర్తిగా మతపరమైన పజ్జు. దొంగలు వచ్చి ఇంటిని దోచుకొని, నెత్తిమీద కుర్చుని మీకు రక్షకులం, మీరు మాకు పన్నులు కట్టండి అన్నట్లుంది.
  • సైన్యంలో చేరిన మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జిజియా పన్ను నుండి మినహాయింపు ఉంది.
  • స్త్రీలు, పిల్లు, ముసలివారు, సంయులు, అంగవైకల్యం గలవారు, సమాజంలో బలమైన స్థానం కలిగి ఉన్న బ్రాహ్మణులకు ఈ పన్ను నుండి మినహాయింపు ఉంది.
  • జిజియా పన్ను కట్టినప్పటికీ హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులే.
ఫిరోజ్ తుగ్లక్ (1351-1388) కాలంలో బ్రాహ్మణులపై కూడా ఈ పన్నును విధించడం జరిగింది. పుతుహల్-ఏ-ఫిరోజ్ షాహీ గ్రంథం ఆధారంగా ఇతని కాలంలో హిందువుల్ని వారి ఆదయ వనరుల ఆధారంగా మూడు తరగతులుగా విభజించి 10, 20, 40 తంకాలజిజియా పన్నును కఠినంగా వసూలు చేసినట్లు తెలుస్తున్నది. మొఘలుల కాలంలో ఈ పన్ను బాబర్ నుండి చివరి రాజు వరకు వసూలు చేయబడింది. ఒక అక్బరు కాలంలోనే 1564 లో రద్దు చేయబడి వసూలు చేయబడలేదు. గ్రామాలలో వసూలు చేసే "ఖరజ్" పన్నుతో పాటుదీనిని వసూలు చేసేవారు. రాజ్యానికి వచ్చే సాలుసరి ఆదాయంలో ఈ పన్ను 15%. దీనివలన నటి హిందువు దుస్థితి ఎలాంటిదో గ్రహించవచ్చు.
శ్రీ వాస్తవ అభిప్రాయం ప్రకారం ముస్లిం రాజులు భారత దేశాన్ని అక్రమించడంలోని ముఖ్య ఉద్దేశ్యం ఇస్లాంని వ్యాప్తి చేయడం. ఈ విషయాన్నీ రహస్యంగా ఉంచుకుని చట్టాల రూపంలో జిజియా పన్నును భారత దేశంలో ప్రవేశ పెట్టారని లోతుగా ఆలోచిస్తే మనకు పై విషయం బోధపడుతుంది. జిజియా పన్ను చెల్లించలేని పేదలు, బలహీనులు, ఇస్లాంలోకి మారతారు. ముస్లింలకు నామమాత్రంగా విధించే "జకాత్" పన్ను చెల్లిస్తారు. ఇస్లాం వ్యాపిస్తుంది. లేదంటే అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువుల ద్వారా అధిక ఆదాయం లభిస్తుంది.
త్రిట్టర్ అభిప్రాయం ప్రకారం జిజియా పన్ను చెల్లించడం హిందువులు అవమాన కరంగా భావించారు. అధిక సంఖ్యాకులు గల హిందువుల నుండి వ్యతిరేకత వచ్చింది. బలమైన మొఘలు చక్రవర్తుల కాలంలో మాత్రమే ఇది సమర్థవంతంగా అమలు చేయబడింది.
ముఖ్యంగా ఔరంగజేబ్ కాలంలో, అటు తరువాత రద్దు చేయబడింది. మళ్లీ ఇప్పుడు జిజియా సైతాన్ తాలిబాన్ రూపంలో ఆవహించి అవమానకర స్థితిలో ఓరాన్ గ్రామస్థులతో 2 కోట్ల రూపాయలు కట్టించింది. ఎదిరించిన వారి ఇండ్లను ధ్వంసం చేయించింది. వారి మత నాయకులూ నిర్బందింప బడ్డారు. జూన్ మాసంలో తాజాగా వాయువ్య రాష్ట్రంలోని బట్టగ్రం జిల్లాలో హిందువులను 60 లక్షల రూపాయలను జిజియా పన్ను రూపంలో చెల్లించాలని తాలిబన్లు హుకుం జారీ చేసినట్లు అక్కడ నివసిస్తున్న ప్రకాష్ అనే వైద్యుడు తెలియచేశాడు. ఇదే ఇలా రొజురొజుకూ పెరుగుతుఉనే ఉంది.
ఏ ఒబామా, ఐక్యరాజ్యసమితి వీరిని ఆదుకోలేదు. వోట్ల కోసం ముస్లింలను విపరీతంగా వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులూ ఆదుకోలేదు. ఈ ఆధునిక యుగంలో కుడా మత చందసవడం ఎటువంటి వికృత చేష్టలకు పల్పడుతున్నడి తాలిబాన్ల చర్యలను చుస్తే అర్థమవుతుంది.
"సర్వే జనాః సుఖినో భవంతుసవ్య సాచి.

No comments:

Post a Comment